EV Charging Stations on Google Maps: ఎలక్ట్రిక్ కార్ల యజమానులు ఇకపై ఛార్జింగ్ స్టేషన్‌లను కనుగొనడంలో ఎక్కువ ఇబ్బంది పడరు. గూగుల్ మ్యాప్స్ ఇప్పుడు ఈ సమస్యను పరిష్కరించబోతోంది. ఇటీవలే గూగుల్ మ్యాప్స్‌కి కొత్త ఫీచర్ జోడించారు. ఇది ఎలక్ట్రిక్ కార్లను ఛార్జ్ చేయడానికి స్టేషన్‌లను కనుగొనడాన్ని సులభతరం చేస్తుంది. గూగుల్ మ్యాప్స్‌లో కొత్త అప్‌డేట్ త్వరలో అందుబాటులోకి రానుంది దీని కారణంగా ఈవీ ఛార్జింగ్ స్టేషన్‌ల గురించిన సమాచారం కూడా యాప్‌లో కనిపిస్తుంది. గూగుల్ మ్యాప్స్‌లో పెట్రోల్ బంకులను ఎలా చూపిస్తుందో, ఇకపై ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను కూడా అలాగే చూపించనున్నారు.


దేశంలో ఎలక్ట్రిక్ కార్లకు పెరుగుతున్న డిమాండ్‌తో ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్ల కోసం ఛార్జింగ్ స్టేషన్‌ను కనుగొనడం చాలా పెద్ద పని. ఎలక్ట్రిక్ కార్ల యజమానులు ఛార్జింగ్ స్టేషన్‌లను కనుగొనడంలో చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. గూగుల్ మ్యాప్స్‌లో రాబోయే అప్‌డేట్ ప్రజలు ఎదుర్కొంటున్న ఈ సమస్యను తగ్గించగలదు. గూగుల్ మ్యాప్స్ ద్వారా ఛార్జింగ్ స్టేషన్‌ను కనుగొనడం, పెట్రోల్ పంప్‌ను కనుగొనడం మరింత సులభం అవుతుంది.


Also Read: 2024 స్కోడా సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ లాంచ్ త్వరలో - ఫీచర్లు ఎలా ఉండనున్నాయి?


ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో యూజర్ రివ్యూలను తీసుకున్న తర్వాత ఈవీ ఛార్జర్ ఉన్న లొకేషన్ మ్యాప్‌లో కనిపిస్తుందని గూగుల్ మ్యాప్స్ పేర్కొంది. ఈ ఫీచర్ ద్వారా గూగుల్ మ్యాప్స్ వినియోగదారులకు ఛార్జింగ్ స్టేషన్‌కు వెళ్లే మార్గం కనిపిస్తుంది. ఈ యాప్‌లో డైరెక్షన్స్‌ను అందించడంతో పాటు, ఈవీ ఛార్జింగ్ స్టేషన్‌ను ఉపయోగించే యూజర్ నుంచి సమీక్షలు కూడా తీసుకోవచ్చు. ఈ సమీక్షలో ఛార్జింగ్ స్టేషన్ గురించి మరింత సమాచారం యూజర్ నుంచి సేకరిస్తారు. ఛార్జింగ్ స్టేషన్‌లో ఇన్‌స్టాల్ చేసిన ఛార్జింగ్ ప్లగ్, ఛార్జింగ్ క్యూలో పట్టే సమయానికి సంబంధించి కూడా యూజర్ నుంచి రివ్యూ కోరతారు.






గూగుల్ మ్యాప్స్ మొదటగా ఇన్ బిల్ట్ వాహనాలకు ఈ సదుపాయాన్ని అందించనుంది. ఈ ఎలక్ట్రిక్ వాహనాల్లో బ్యాటరీ స్థాయి తగ్గుతున్నట్లు కనిపించిన వెంటనే ఈవీ ఛార్జింగ్ స్టేషన్ గురించిన సమాచారం కారు డిస్‌ప్లేలో కనిపిస్తుంది. ముందుగా అమెరికాలో గూగుల్ మ్యాప్ ఈ సదుపాయాన్ని కల్పించబోతోంది. దీని తర్వాత ఈ ఫీచర్ భారతదేశంతో సహా ప్రపంచంలోని ఇతర దేశాలలో అందుబాటులోకి రావచ్చు.


అయితే మరోవైపు గూగుల్ మ్యాప్స్‌లో కొన్ని టెక్నికల్ ఎర్రర్స్ కూడా ఉంటాయి. మీరు ఒక లొకేషన్‌కు వెళ్లాలనుకుంటే అది మరో లొకేషన్ చూపించిందని ఇప్పటికే చాలా ఫిర్యాదులు వచ్చాయి. గూగుల్ మ్యాప్స్ కారణంగా స్టూడెంట్స్ పరీక్షలు మిస్ అయిన సందర్భాలు ఉన్నాయి.



Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!