Skoda Sub Compact SUV: స్కోడా ఇండియా 2024 చివరి నాటికి సబ్ 4 మీటర్ ఎస్‌యూవీని భారత మార్కెట్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఎంక్యూబీ ఏ0 ఐఎన్ ఆర్కిటెక్చర్ ఆధారంగా మార్కెట్లోకి వచ్చిన మొదటి స్కోడా సబ్ 4 మీటర్ ఎస్‌యూవీ ఇదే అవుతుంది. ఇటీవల కొత్త స్కోడా ఎస్‌యూవీ టెస్ట్ రన్ సమయంలో కనిపించింది. దీనికి సంబంధించిన స్పై వీడియో కొత్త ఎస్‌యూవీ డిజైన్ గురించి అనేక కొత్త వివరాలను వెల్లడించింది.
పేరు ఏంటంటే?
ఈ రాబోయే ఎస్‌యూవీకి క్విక్, కైరోక్, కైమాక్, కారిక్, కైలాక్ అని పేరు పెట్టవచ్చు, ఎందుకంటే స్కోడా దాని కోసం 'నేమ్ యువర్ స్కోడా' అనే ఆన్‌లైన్ పోటీని నడుపుతోంది. దేశీయ మార్కెట్లో ఇది మారుతి సుజుకి బ్రెజా, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, టాటా నెక్సాన్, నిస్సాన్ మాగ్నైట్ వంటి కార్లతో పోటీపడుతుంది.
డిజైన్, లుక్ ఎలా ఉన్నాయి?
స్పై వీడియోను చూస్తే, ఎస్‌యూవీలోని మినిమలిస్ట్ విధానంతో స్కోడా సిగ్నేచర్ స్టైలింగ్ ఎలిమెంట్స్ స్పష్టంగా కనిపిస్తాయి. కొత్త స్కోడా ఎస్‌యూవీ రోడ్ ప్రెసెన్స్ చాలా ట్రెండీగా కనిపిస్తుంది. కుషాక్‌లో కనిపించే విధంగా ఫ్రంట్ ఎండ్ స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్‌తో మీసాల గ్రిల్‌ను కలిగి ఉంది. డ్యూయల్ పాడ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు పైన టర్న్ ఇండికేటర్‌లు/ఎల్ఈడీ డీఆర్ఎల్స్‌తో వస్తాయి.
Read Also: 'వ్లాగర్' పేరుతో గూగుల్ సృష్టిస్తున్న AI సంచలనం, ఒక్క ఫోటోతో సినిమా తీసేస్తోంది
వీడియోలో క్యాప్చర్ చేసిడిన కొన్ని ఇతర డిజైన్ హైలైట్‌లలో నీట్‌గా డిజైన్ చేసిన దిగువ బంపర్, ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్‌లతో కూడిన పెద్ద ఓఆర్‌వీఎంలు, పెద్ద హనీకాంబ్ దిగువ గ్రిల్, క్లామ్‌షెల్ బానెట్ ఉన్నాయి. సైడ్ ప్రొఫైల్‌లో రూఫ్ రెయిల్స్, బాడీ క్లాడింగ్‌తో పాటు మందపాటి సి-పిల్లర్‌ను చూపిస్తుంది. వెనుక భాగం వోక్స్‌వ్యాగన్ టైగన్‌ని పోలి ఉంటుంది. ఇందులో సి-ఆకారపు ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్‌లు ఉంటాయి. అయితే ఇండికేటర్లు, రివర్స్ లైట్లు హాలోజన్ యూనిట్లుగా కనిపిస్తాయి.
స్పెసిఫికేషన్లు ఇలా...
ఈ ఎస్‌యూవీ సెక్షన్ 205 టైర్‌లతో కప్పబడిన స్టీల్ వీల్స్‌తో కనిపించింది. ఇది కాకుండా వెనుక డీఫాగర్, వాషర్, వైపర్ వంటి అనేక ప్రత్యేక అంశాలు కనిపించలేదు. ఇందులో సన్‌రూఫ్ ఫీచర్ కూడా లేదు. ఇది మిడ్ లెవల్ ట్రిమ్ అని చూపిస్తుంది. క్యాబిన్ లోపల, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటు ఆల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కనిపిస్తుంది. కొత్త ఎస్‌యూవీ టెక్నికల్ డిటైల్స్ ఇంకా పబ్లిక్ డొమైన్‌లో అందుబాటులో లేవు. ఇది 1.0 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌తో రానుంది. దీని గరిష్ట శక్తి 113 బీహెచ్‌పీ, పీక్ టార్క్ 178 ఎన్ఎంగా ఉంది. దాని గేర్‌బాక్స్ కోసం 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ యూనిట్ అందుబాటులో ఉంటుంది.
Read Also: మామా నీ ‘టైమ్’ ఎంత? చంద్రుడికి టైమ్ జోన్ సెట్ చేస్తున్న నాసా, వైట్ హౌస్ కీలక ఆదేశాలు