Best 5 Cars Under Rs 8 Lakh: ప్రస్తుతం చాలా మంది తమకు సొంత కారు ఉండాలని ఆశపడుతున్నారు. బడ్జెట్ ధరలో ఒక మంచి కారును కొనుగోలు చేయాలనుకున్న వారికి, రూ. 8 లక్షల కంటే తక్కువ ధర ఉన్న కొన్ని ప్రముఖ కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


మారుతి సుజుకి ఫ్రాంక్స్ (Maruti Suzuki Fronx)
మారుతి సుజుకి ఫ్రాంక్స్‌లో 1.2 లీటర్, 4 సిలిండర్, నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌ అందించారు. ఇది 89 బీహెచ్‌పీ పవర్‌ని, 113 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరో 1.0 లీటర్ 3 సిలిండర్, టర్బో పెట్రోల్ ఇంజన్ 99 బీహెచ్‌పీ పవర్, 147 ఎన్ఎం పీక్ టార్క్‌ను డెలివర్ చేయనుంది. గేర్‌బాక్స్ ఆప్షన్ల విషయానికి వస్తే 5 స్పీడ్ మాన్యువల్, ఏఎంటీ, 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ యూనిట్ ఉన్నాయి. మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఎక్స్ షోరూమ్ ధర రూ.7.47 లక్షల నుంచి రూ.13.14 లక్షల మధ్య ఉంది.


మారుతి సుజుకి బలెనో (Maruti Suzuki Baleno)
మారుతి సుజుకి బలెనో 1.2 లీటర్ 4 సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ని పొందుతుంది. ఇది 88 బీహెచ్‌పీ పవర్, 113 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ల గురించి చెప్పాలంటే 5 స్పీడ్ మాన్యువల్ యూనిట్, ఏఎంటీ గేర్‌బాక్స్ ఉన్నాయి. ఈ ఇంజన్ ఇప్పుడు లేటెస్ట్ ఎమిషన్ రూల్స్‌కు అనుగుణంగా అప్‌డేట్ అయింది. మారుతి బలెనో ఎక్స్ షోరూమ్ ధర రూ. 6.61 లక్షల నుంచి రూ. 9.88 లక్షల మధ్య ఉంటుంది.


కియా సొనెట్ (Kia Sonet)
కియా మూడు ఇంజన్ ఎంపికలతో సోనెట్ సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీని పరిచయం చేసింది. ఇందులో 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ (120 పీఎస్ పవర్/ 172 ఎన్ఎం పీక్ టార్క్), 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ (83 పీఎస్ పవర్/ 115 ఎన్ఎం పీక్ టార్క్) మరియు 1.5 లీటర్ డీజిల్ యూనిట్ (115 పీఎస్ పవర్/ 250 ఎన్ఎం పీక్ టార్క్) ఉన్నాయి. టర్బో పెట్రోల్ ఇంజన్ 6 స్పీడ్ ఐఎంటీ లేదా 7 స్పీడ్ డీసీటీతో పెయిర్ అయింది. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ కోసం 5 స్పీడ్ మాన్యువల్ అందుబాటులో ఉంది. డీజిల్ యూనిట్ 6 స్పీడ్ ఐఎంటీ లేదా 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో పెయిర్ అయింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.7.79 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.


మహీంద్రా ఎక్స్‌యూవీ300 (Mahindra XUV300)
మహీంద్రా ఎక్స్‌యూవీ300లో రెండు పెట్రోల్, ఒక డీజిల్ ఇంజన్‌తో సహా మూడు ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. ఇందులో 1.2 లీటర్ టర్బో పెట్రోల్ యూనిట్ (110 పీఎస్ పవర్/ 200 ఎన్ఎం పీక్ టార్క్), 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ (117 పీఎస్ పవర్/ 300 ఎన్ఎం పీక్ టార్క్), టీజీడీఐ 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ (130 పీఎస్ పవర్/ 250 ఎన్ఎం పీక్ టార్క్) ఉన్నాయి. ఈ ఇంజన్‌లన్నీ 6 స్పీడ్ మాన్యువల్‌తో పెయిర్ అయ్యాయి, అయితే 6 స్పీడ్ ఏఎంటీ ఆప్షన్ డీజిల్ ఇంజిన్‌లు, టర్బో పెట్రోల్‌లో కూడా అందుబాటులో ఉంది. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.7.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.


ఎంజీ కామెట్ ఈవీ (MG Comet EV)
ఈ 2 డోర్ ఈవీ 4 సీటర్ లేఅవుట్‌లో వస్తుంది. ఎంజీ కామెట్ ఈవీలో 17.3 కేడబ్లయూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ అందించారు. దీని రేంజ్ 230 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఎలక్ట్రిక్ మోటార్ దాని రేర్ వీల్ డ్రైవ్ (RWD) సెటప్‌తో 42 పీఎస్ పవర్, 110 ఎన్ఎం పీక్ టార్క్ ఉత్పత్తి చేసేలా ట్యూన్ చేశారు. దీని బ్యాటరీని 3.3 కేడబ్ల్యూ ఛార్జర్ ద్వారా ఏడు గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర రూ.7.98 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply


Also Read: సూపర్ హిట్ టయోటా కామ్రీ అప్‌డేటెడ్ వెర్షన్ త్వరలో - ఈసారి హైబ్రిడ్ ఇంజిన్‌తో!


Also Read: లాంచ్‌కు రెడీ అవుతున్న కొత్త స్విఫ్ట్ - సరికొత్త ఇంజిన్, సూపర్ లుక్‌తో!