Family Star release postponed, Out of Sankranti 2024 race: రౌడీ బాయ్ 'ది' విజయ్ దేవరకొండ కథానాయకుడిగా ప్రముఖ నిర్మాత 'దిల్' రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలో రూపొందుతోన్న సినిమా 'ఫ్యామిలీ స్టార్'. హీరోకి ఇది 13వ (VD13) సినిమా అయితే... నిర్మాణ సంస్థలో 54వ సినిమా (SVC 54). ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే... ఇప్పుడు వెనక్కి వెళ్లారు. 


సంక్రాంతికి ఎందుకు విడుదల చేయడం లేదంటే?
తెలుగు రాష్ట్రాల్లో 'యానిమల్'ను 'దిల్' రాజు డిస్ట్రిబ్యూట్ చేశారు. సినిమాకు మంచి వసూళ్లు వస్తున్న నేపథ్యంలో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమయంలో సంక్రాంతి సినిమాల ప్రస్తావన కూడా వచ్చింది.


''సంక్రాంతికి వస్తున్న 'సైంధవ్', 'గుంటూరు కారం' చిత్రాలను నైజాంలో మా సంస్థ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. అలాగే, విశాఖలో కూడా 'సైంధవ్' పంపిణీ చేస్తున్నాం. మేం నిర్మిస్తున్న 'ఫ్యామిలీ స్టార్'ను కూడా సంక్రాంతికి విడుదల చేద్దామని అనుకున్నాం. అయితే... అమెరికాలో చేయాల్సిన షెడ్యూల్ వీసాలు సకాలంలో రాకపోవడం వల్ల కుదరలేదు. అందుకని, సంక్రాంతికి సినిమాను విడుదల చేయడం కుదరడం లేదు'' అని 'దిల్' రాజు చెప్పారు. 


'ఫ్యామిలీ స్టార్' అమెరికా వెళ్ళేది ఎప్పుడంటే?
Family Star to release in March 2024: 'ఫ్యామిలీ స్టార్' యూనిట్ ఆదివారం రాత్రి అమెరికా ప్రయాణం అవుతోంది. ''అక్కడ 14 రోజుల చిత్రీకరణ చేయాలి. డిసెంబర్ 19న ఇండియా తిరిగి వస్తాం. వచ్చిన తర్వాత ఇంకొక 15 రోజులు చిత్రీకరణ ఉంటుంది. మార్చిలో 'ఫ్యామిలీ స్టార్' విడుదలకు సన్నాహాలు చేశాం'' అని 'దిల్' రాజు చెప్పారు. వచ్చే ఏడాది దిల్ రాజు ప్రొడక్షన్స్ సంస్థ నుంచి మూడు సినిమాలు, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలో నాలుగు సినిమాలు ఉన్నాయని ఆయన చెప్పారు. 2024 తమకు చాలా ముఖ్యమైన ఏడాది అని చెప్పారు.


Also Readక్రష్మిక క్లబ్‌లో ఆలియా భట్ - భర్తను వదిలేసింది ఏంటి?




'ఫ్యామిలీ స్టార్' ప్రత్యేకత ఏమిటంటే... 'గీత గోవిందం' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురామ్ కలయికలో వస్తున్న చిత్రమిది. ఇందులో 'సీతారామం', 'హాయ్ నాన్న' సినిమాల ఫేమ్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) కథానాయికగా నటిస్తున్నారు. మరో కథానాయికగా 'మజిలీ', 'రామారావు ఆన్ డ్యూటీ', 'మైఖేల్' సినిమాల ఫేమ్ దివ్యాంశ కౌశిక్ నటిస్తున్నారు.  


Also Readసిల్క్ స్మిత బయోపిక్ - టైటిల్ రోల్ చేస్తున్న హాట్ లేడీ ఎవరో తెలుసా?
 
ప్రస్తుతానికి సూపర్ స్టార్ మహేష్ బాబు 'గుంటూరు కారం', మాస్ మహారాజ రవితేజ 'ఈగల్', యువ హీరో తేజా సజ్జ 'హను - మాన్', వెంకటేష్ 'సైంధవ్' సంక్రాంతి రేసులో ఉన్నాయి. తెలుగు సినిమాలు పక్కన పెడితే... తమిళనాడు నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రత్యేక పాత్ర చేసిన 'లాల్ సలామ్', ఆయన మాజీ అల్లుడు ధనుష్ నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'కెప్టెన్ మిల్లర్' సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాయి.



ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply