Sharmila reacted with emotion on the occasion of YS Vijayamma  birthday  :  వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజు సందర్భంగా  కుమార్తె, ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలా రెడ్డి భావోద్వేగంతో స్పందించారు.  జన్మనిచ్చి..   జన్మకు సార్థకత చేకూర్చుకోవడానికి నాకు అండగా, చీకటిలో వెలుగుగా, వేదనలో సాంత్వనగా, విలువలను, విశ్వాసాన్ని నింపిన నిస్వార్థ రూపం నువ్వు అమ్మ  నీకు ఆ దేవుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలను, మనఃశాంతిని, ఆనందాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నానన్నారు. 





 
 
వైఎస్ విజయలక్ష్మి కుమారుడు సీఎం వైఎస్ జగన్ కూడా స్పందించారు. షర్మిల ఎక్స్ లో శుభాకాంక్షలు చెప్పిన దాదాపుగా గంట తర్వాత సీఎం వైఎస్ జగన్  సోషల్ మీడియా హ్యాండిల్స్ లో   హ్యాపీ బర్త్ డే అమ్మా అని పోస్టు పెట్టారు.  





 



ప్రస్తుతం వైఎస్ విజయలక్ష్మి అమెరికా పర్యటనలో ఉన్నారు. రాజకీయ ప్రచారం చేయడం లేదు. 2019 ఎన్నికల్లో ఐక్యంగా ఉన్న వైఎస్‌ కుటుంబం తర్వాత పరిణామాలతో చీలిపోయిది. అన్న జగన్‌తో విభేదించిన షర్మిల ముందు తెలంగాణలో పార్టీ పెట్టుకున్నారు. తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక్కడ అన్నకు వ్యతిరేకంగా రాజకీయ పోరాటం చేస్తున్న షర్మిలకు వైఎస్‌ ఫ్యామిలీ సపోర్ట్‌ కూడా లభిస్తోంది. తన తండ్రి హత్యకు కారణమైన దోషులను శిక్షించడంలో విఫలమయ్యారన్న కారణంతో జగన్‌ను వ్యతిరేకిస్తున్నారు సునీత. అంటే వైఎస్‌ ఫ్యామిలీకి చెందిన ఇద్దరు సోదరీమణులు జగన్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. 
   
ఒకవైపు కుమారుడు, మరోవైపు కుమార్తె ఇద్దరూ చెరో దారిలో వెళ్తున్న టైంలో తల్లి విజయమ్మ సపోర్ట్ ఎవరికి ఉంటుందనే ఆసక్తి అందరిలో కనిపించింది. తెలంగాణ రాజకీయాల్లో ఉన్నప్పుడు షర్మిలకు తల్లిగా విజయ సపోర్ట్‌ చేశారు. ఏపీ రాజకీయాల్లో ఆమె వచ్చిన తర్వాత విజయ సైలెంట్ అయిపోయారు. గత ఎన్నికల్లో కుమారుడు జగన్ విజయం కోసం కాళ్లకు చక్రాలు కట్టుకొని తిరిగిన విజయమ్మ ఈసారి మద్దతు ఇచ్చేందుకు ఓకే చెప్పలేదని టాక్ నడుస్తోంది. అభ్యర్థుల ప్రకటన టైంలో ఆయనను ఆశీర్వదించిన విజయ తర్వాత ఎక్కడా రాజకీయ వేదికలపై కనిపించలేదు. అయితే షర్మిల, సునీత నుంచి వస్తున్న విమర్శలకు కౌంటర్‌గా ప్రచారం చేయాలనే ఒత్తిడి విజయమ్మపై ఉందనే ప్రచారం ఎప్పటి నుంచో నడుస్తోంది. దీనిపై ఎవరూ బహిరంగంగా మాట్లాడింది లేదు. కానీ పొలిటికల్ సర్కిల్‌లో మాత్రం ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. 
 
ఎన్నికల ప్రచారం కీలక దశకు వచ్చింది. ఈ టైంలో విజయమ్మ ఎవరి పక్షాన నిలుస్తారనే చర్చ జరుగుతున్న సమయంలో ఆమె ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. అసలు ఎన్నికలతో సంబంధం లేదన్నట్టు ఆమెరికా వెళ్లిపోయారు. ఆమె అమెరికా చేరే వరకు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. షర్మిల కుమారుడు, కోడలు, కుమార్తెతో కలిసి అమెరికాలో ఉన్నారు.