Krishna Mukunda Murari Today Episode కృష్ణ, మురారిలు బయట ఆదర్శ్‌ గురించి మాట్లాడుకుంటారు. మురారి ఆదర్శ్‌ని అడుగుతాను అని అంటే కృష్ణ ఆపుతుంది. ఆదర్శ్‌ని ప్రశ్నించడం తనకు ఇష్టం లేదని అంటుంది. ఇక కృష్ణ, మురారిలు మాట్లాడుకుంటుంటే అక్కడికి ముకుంద వస్తుంది. 


ముకుంద: తనలో తాను. ఆదర్శ్‌కి నీ మీద రోజు రోజుకు కోపం ద్వేషం పెరుతుతాయి తప్ప తగ్గవు. మురారి నుంచి నిన్ను దూరం చేయడానికి నేను వాడుతున్న ఆయుధమే అది. ఏమైంది కృష్ణ డల్‌గా ఉంది.
మురారి: డల్ ఏం లేదు. ఒక్కర్తే ఇంత పెద్ద ముగ్గు వేసింది కదా అలిసి పోయింది.
ముకుంద: ముగ్గు వేశావా కృష్ణ.. మేం కూడా పానకం కలిపేశాం.
కృష్ణ: అవన్నీ నాకు ఎందుకు చెప్తున్నావ్ అని కృష్ణ వెళ్లిపోతుంది.
మురారి: సారీ మీరా తనేదో వేరే మూడ్‌లో ఉంది.
ముకుంద: పర్లేదు మీరు ఎందుకు సారీ చెప్తారు. అయినా అంత కోపం ఎందుకు.. ఎవరి మీద..
మురారి: నా మీదే. భార్యలకు భర్తల మీద కోపం ఊరికే వస్తుంది కదా. 


ముకుంద మైమరిచిపోయి మురారిని టచ్ చేయబోతుంది.  దీంతో మురారి మీరా అని పిలిస్తే ముకుంద తేరుకొని చెంప మీద ఏదో అంటుకుందని అంటుంది. దీంతో మురారి తుడుచుకుంటాడు. ఇంతలో భవాని వచ్చి మురారికి రెడీ అవ్వమని చెప్పి పంపిస్తుంది.


కృష్ణ: ఆదర్శ్‌కి నా మీద ఎందుకు అంత కోపం. నేనేం చేశాను. ఇంతలో మురారి వచ్చి వెనక నుంచి హత్తుకుంటాడు. కృష్ణ చిరాకు పడుతుంది. దీంతో మురారి కృష్ణని కూల్ చేస్తాడు. దీంతో కృష్ణ తన మీద ఆదర్శ్‌కు ఎవరో చెడుగా చెప్పారని అంటుంది. ఆ మాటలు ముకుంద వింటుంది. ఈ ఇంట్లో నీ గురించి చెడుగా చెప్పేవాళ్లు ఎవరున్నారు అని మురారి అడుగుతాడు. దానికి కృష్ణ ఎవరూ లేరు అని చెప్తుంది. ఆదర్శ్‌ మాటలు పట్టించుకోవద్దని చెప్తాడు.


ముకుంద: ఆదర్శ్‌కి ఎవరూ నూరి పోస్తున్నారు అని కృష్ణ బాగానే కనిపెట్టేసింది. ఇక నేనే అది అని తెలిసేలోపు మొత్తం పూర్తి అయిపోవాలి. ఈ రోజు ఈ ఇంట్లో జరిగే పండగ కృష్ణ జీవితంలో విషం నింపాలి.


భవాని ఇంట్లో పూజ ఏర్పాట్లు పూర్తి అవుతాయి. అందరూ పూజ దగ్గరకు వస్తారు. ఇక భవాని వచ్చి పూజ ఏర్పాట్లు పూర్తయ్యాయా అని అడుగుతుంది. దానికి ముకుంద అన్ని ఏర్పాట్లూ పూర్తి అయ్యాయి అత్తయ్య. పంతులు వస్తే పూజ మొదలు పెట్టేయడమే అంటుంది. ముకుంద భవానిని అత్తయ్య అనడంతో అందరూ షాక్ అవుతారు. 


ముకుంద: ఎంత జాగ్రత్తగా ఉందాం అనుకుంటున్నా ఇలా నోరు జారిపోతున్నా ఏంటి. సారీ మేడమ్. కృష్ణ అత్తయ్య అనింది కదా నేను కూడా అలవాటులో పొరపాటుగా.. ఇంతలో పంతులు వస్తారు. పంతులు ముకుందని చూసి ఎవరు కొత్తగా కనిపిస్తుంది.
భవాని: మా ఇంటి మనిషే పంతులుగారు మా అమ్మాయే..
ఆదర్శ్‌: మనసులో.. ఈరోజు ఏంటో అన్ని మంచి మాటలే చెవిలో పడుతున్నాయి. ముకుంద పొరపాటున పిలిచినా అమ్మని అత్తయ్య అంది. అమ్మ కూడా ముకుందనిఈ ఇంటి మనిషే అంటుంది. ఈ రోజు నిజంగానే మంచి రోజు ఎలా అయినా అమ్మకు ముకుంద గురించి చెప్పేయాలి. 
ముకుంద: కృష్ణ, మురారి పూజలో కూర్చొంటే.. ఈ శ్రీరామనవమికి నీతో కలిసి పూజ చేయాలి అనుకున్నా మురారి.. వచ్చే పూజకు మాత్రం నీతో కలిసే పూజ చేస్తా. 
ఆదర్శ్‌: మనసులో.. వచ్చే శ్రీరామనవమి పూజకు మనిద్దరం కలిసి పూజలో కూర్చొవాలి ముకుంద.. 


ఇక సంగీత పక్కన మధు కూర్చొంటే ఆదర్శ్ ముకుంద పక్కన కూర్చొంటాడు. ఆదర్శ్‌ ఈ రోజు అన్నీ కలిసొస్తున్నాయి అనుకుంటే. ముకుంద మాత్రం భగవంతుడా ఎక్కడికి వెళ్లినా ఈయన గోల తప్పడం లేదు ఏంటి అనుకుంటాడు. ఇక పంతులు పూజ చేస్తారు.


ఆదర్శ్‌:  కృష్ణని చూశావా ఎవరైనా చూస్తే ఇంత అమాయకురాలు లేదు కుటుంబం కోసం ఎంత మంచిగా పూజలు చేస్తుంది అనుకుంటారు కదా.. కానీ మేక వన్నె పులి.  
ముకుంద: ఈయన ఏంటి ఎక్కడ పడితే అక్కడ కృష్ణ గురించి మాట్లాడుతున్నారు నేను జాగ్రత్తగా ఉండాలి.


సీతారాముల కల్యాణం పూర్తి చేసి అందరికీ హారతి ఇస్తారు. ఇక ముకుంద పానకం తీసుకురావడానికి వెళ్తుంది. అందరి కోసం పానకం వేసి కృష్ణకు ఇచ్చే గ్లాస్‌లో ట్యాబ్లెట్స్ కలుపుతుంది. ఇంతలో సంగీత వచ్చి ఏంటి కలుపుతున్నావ్ అని అడుగుతుంది. ముకుంద షాక్ అయిపోతుంది. సంగీత చూసేసిందేమో అని కంగారు పడుతుంది. బెల్లం అని కవర్ చేస్తుంది. ఇక ముకుంద సంగీతని అక్కడి నుంచి పంపేస్తుంది. అందరికీ పానకం ఇచ్చిన ముకుంద కృష్ణకు తాను ట్యాబ్లెట్స్ కలిపిన పానకం ఇస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: కార్తీకదీపం 2 సీరియల్: తల్లి ఆవేదన చూసి జ్యోత్స్న విషయంలో కార్తీక్‌ మనసు మార్చుకుంటాడా.. ఆ ఒక్క సాయం చేయమని దీప రిక్వెస్ట్!