Operation Keller: సంచలనం.. పహల్గాం ఎటాక్ సూత్రధారి, టీఆర్ఎప్ చీఫ్ హతం - భారత్ సైన్యం ఆపరేషన్ కెల్లర్
Pahalgam attack : పహల్గాం ఎటాక్ దాడిలో కీలక పాత్ర పోషించిన ఉగ్రవాద సంస్థ టీఆర్ఎఫ్ చీఫ్ ను బలగాలు హతమార్చాయి. దీనికి ఆపరేషన్ కెల్లర్ అని పేరు పెట్టారు.
TRF chief behind Pahalgam attack killed: భారత భద్రతా దళాలు ఆపరేషన్ కెల్లర్ ను ప్రారంభించాయి. పహల్గామ్ దాడి వెనుక ఉన్న ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ప్రాక్సీ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) చీఫ్ షాహిద్ కుట్టాయ్, జమ్మూ కాశ్మీర్‌లోని షోపియన్ జిల్లాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించినట్లు సమాచారం. 'ఆపరేషన్ కెల్లర్' లో మరో ఇద్దరు ఉగ్రవాదులు కూడా హతమయ్యారు.
షాహిద్ కుట్టే 2024లో బీజేపీ సర్పంచ్ హత్య, డానిష్ రిసార్ట్‌పై దాడి , యు కుల్గామ్‌లో టెరిటోరియల్ ఆర్మీ సిబ్బంది హత్య వంటి ఘటనల్లో పాల్గొన్నాడు. చనిపోయిన మరో ఉగ్రవాదిని అద్నాన్ షఫీగా గుర్తించారు. అతను TRF , LeT యొక్క టాప్ కమాండర్, షోపియాన్‌లోని వందమా నివాసి. హారిస్ నజీర్ మరోటెర్రరిస్టు హతమయ్యాడు. పుల్వామాకు చెందిన ఈ ఉగ్రవాది కూడా TRF/LeTతో సంబంధం కలిగి ఉన్నాడు. రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్‌కు షోకల్ కెల్లర్‌లో ఉగ్రవాదుల ఉనికిపై ఖచ్చితమైన ఇంటెలిజెన్స్ సమాచారం అందడంతో ఈ ఆపరేషన్ ప్రారంభించారు.
ఉదయం షోపియాన్‌లో ఉగ్రవాదుల కదలికలు గుర్తించిన భారత బలగాలు అప్రమత్తమయ్యాయి. షోపియాన్‌లో జరిగిన ఎన్‌కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) ఒకరు అని తేలింది. షోపియాన్‌లోని కెల్లర్ అడవి ప్రాంతంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ సమయంలో టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. దాంతో అప్రమత్తమైన బలగాలు ఎదురుకాల్పులు జరపగా కొందరు ఉగ్రవాదులు హతమయ్యారు. షోపియాన్ ప్రాంతంలో ఇంకా దళాలు ఉగ్రవాదుల వేట చేపట్టాయి.
Just In
ఆ ప్రాంతంలో ఏమైనా బాంబులు అమర్చరా అని తనిఖీలు చేపట్టారు. ఇటీవల పహల్గాం ఉగ్రదాడి.. అనంతరం భారత్, పాక్ మధ్య ఉద్రికత్తల నేపథ్యంలో పలు ప్రాంతాల్లో భారత ఆర్మీ ఆపరేషన్ కొనసాగిస్తోంది. ఉగ్రవాదుల ఏరివేతకు అన్ని చర్యలు చేపట్టింది. అనుమానస్పదంగా కనిపించిన వారిని సైతం వివరాలు ఆరా తీసి, తనిఖీలు కొనసాగిస్తుున్నారు.
పహల్గాం ఉగ్రవాద దాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదుల పోస్టర్లను భద్రతా సంస్థలు ఏర్పాటు చేశాయి. షోపియాన్‌లోని వివిధ ప్రాంతాలలో కనిపించిన ఈ పోస్టర్లు 2019లో పుల్వామా తరువాత కాశ్మీర్ లోయలో జరిగిన అత్యంత దారుణమైన ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్రవాదుల గురించి సమాచారం ఇచ్చిన వారికి రూ. 20 లక్షల బహుమతిని ఇస్తామని ప్రకటించారు. ఉగ్రవాదుల సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, ఏ భయం లేకుండా తమకు సమాచారం ఇవ్వాలని అధికారులు హామీ ఇచ్చారు. ఉగ్రవాదులందర్నీ తుడిచి పెట్టేలా ఆపరేషన్ కెల్లర్ నిర్వహిస్తున్నారు.