Modi salutes Army: ఆపరేషన్ సిందూర్ సమయంలో ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసిన భారత క్షిపణుల ఖచ్చితత్వం , సామర్థ్యం కారణంగా భారతదేశం పాకిస్తాన్ సైన్యాన్ని వారి స్వంత గడ్డపై దుమ్ము దులిపిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రశంసించారు. పాకిస్తాన్ సైన్యానికి నిద్రలేని రాత్రులు ఇచ్చిందన్నారు. ప్రధానమంత్రి మోదీ హఠాత్తుగా అదంపూర్ ఎయిస్ బేస్‌కు వెళ్లారు. తాము ఉదంపూర్ ఎయిర్ బేస్ ను ధ్వంసం చేశామని పాకిస్తాన్ ప్రకటించుకుంది. అక్కడ ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ S 400 ను ధ్వంసం చేశామని చెప్పుకుంది. కానీ అవి చెక్కు చెదరలేదని మోదీ పర్యటనతో తేలిపోయింది.
రక్షణ శాఖకు చెందిన విమానం ఎయిర్ బేస్ లో ల్యాండ్ అయిది. అలాగే మోదీ ప్రసంగించేటప్పుడు బ్యాక్ గ్రౌండ్ లో ఎస్ 400 కనిపించింది. ఇదంతా వ్యూహాత్మకంగా చేశారని ..పాక్ ఫేక్ ప్రచారాన్ని తిప్పికొట్టడానికి ఇలా ప్లాన్ చేశారని భావిస్తున్నారు. మరో వైపు ఉదం పూర్ తో సైనికులతో మోదీ సరదాకా గడిపారు. ప్రసంగంోల భారత సాయుధ దళాలను ప్రశంసిస్తూ "మీరు వారిపై నేరుగా దాడి చేశారు. మీరు ప్రధాన ఉగ్రవాద స్థావరాలను నాశనం చేశారు. తొమ్మిది ఉగ్రవాద శిబిరాలు తుడిచిపెట్టేశారు. వంద మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు" అని ప్రశంసించారు.
పాకిస్తాన్ డ్రోన్‌లు, UAVలు, విమానాలు, మిస్సైళ్లను భారతదేశ శక్తివంతమైన వైమానిక రక్షణ వ్యవస్థ ముందు విఫలమయ్యాయని మోదీ హైలైట్ చేశారు. అదంపూర్ ఎయిర్ బేస్‌తో సహా ఇతర ఎయిర్ బేస్‌లపై పాకి స్తాన్ బహుసార్లు దాడి చేయడానికి ప్రయత్నించినప్పటికీ, ఈ దాడులు చేయలేకపోయారని గుర్తు చేశారు. దేశంలోని అన్ని ఎయిర్ బేస్‌ల నాయకత్వానికి మరియు ప్రతి ఎయిర్ వారియర్‌కు హృదయపూర్వక ప్రశంసలు తెలిపారు. "మీ శౌర్య కథలు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయి. భారత సైన్యం, వైమానిక దళం మరియు నావికా దళ సైనికులకు నా సెల్యూట్" అని మోదీ అన్నారు.
భారత సైనికులు "భారత్ మాతా కీ జై" అనే నినాదాన్ని యుద్ధభూమిలో , మిషన్‌లలో గట్టిగా పలికినప్పుడు, శత్రువుల గుండెలు కంపించాయని మోదీ అన్నారు. భారత్ మాతా కీ జై అనేది కేవలం నినాదం కాదన్నారు. ఇది ప్రతి సైనికుడు తన జీవితాన్ని దేశానికి అంకితం చేసే ప్రతిజ్ఞ అని తెలిపారు. మేము ఇంట్లోకి చొచ్చుకొని మారణ హోమం చేస్తాము, శత్రువుకు తప్పించుకునే ఒక్క అవకాశం కూడా ఇవ్వము అని మోదీ గట్టిగా హెచ్చరించారు. ఉగ్రవాదులు ఆధారపడిన పాకిస్తాన్ సైన్యాన్ని భారత సైన్యం, వైమానిక దళం , నావికా దళం ఓడించాయని మోదీ సంతృప్తి వ్యక్తం చేసారు.
"మా డ్రోన్‌లు శత్రు కోట గోడలను ధ్వంసం చేసినప్పుడు, మా మిస్సైళ్లు ఝంకార శబ్దంతో లక్ష్యాన్ని చేరుకున్నప్పుడు, శత్రువు ‘భారత్ మాతా కీ జై’ శబ్దాన్ని వింటాడు. మేము రాత్రిపూట కూడా సూర్యుడిని వెలిగించినప్పుడు, శత్రువు ‘భారత్ మాతా కీ జై’ని చూస్తాడు" అని ఆయన కవితాత్మకంగా చెప్పారు. మోదీ ఆపరేషన్ సిందూర్‌ను దేశంలోని ప్రతి తల్లి, సోదరి మరియు కుమార్తెకు అంకితం చేశారు. "మా సోదరీమణుల సిందూరాన్ని తొలగించడానికి శత్రువు చెల్లించే ధరను ఇప్పుడు ప్రతి ఉగ్రవాది తెలుసుకున్నాడు" అని ఆయన అన్నారు. "భారతదేశం బుద్ధుడి భూమి మాత్రమే కాదు, గురు గోబింద్ సింగ్ జీ యొక్క భూమి కూడా అని మోదీ పేర్కొన్నారు, శాంతి , ధైర్యం రెండింటినీ సమన్వయాన్ని భార్త చేస్తుందన్నారు.
మోదీ అదంపూర్ పర్యటన పాకిస్తాన్ దాడుల తర్వాత ఎయిర్ బేస్‌లో సైనికుల ధైర్యాన్ని పెంచడానికి , పాకిస్తాన్ తప్పుడు ప్రచారాన్ని (S-400 రక్షణ వ్యవస్థ ధ్వంసం న) ఖండించడానికి ఉద్దేసించారని అనుకోవచ్చు. ఎయిర్ బేస్‌లో MiG-29 జెట్ , S-400 వ్యవస్థ దృశ్యాలు పాక్ ఫేక్ చేసిందని తెలిపింది. ఈ సందర్భంగా "భారత్ మాతా కీ జై" , "వందే మాతరం" నినాదాలు అదంపూర్ ఎయిర్ బేస్‌లో మారుమోగాయి,