Indian Passport Ranking: భారత్ పాస్‌పోర్ట్ ర్యాంకింగ్‌లో 8 స్థానాలు ఎగబాకింది! ఈ దేశాల్లో వీసా లేకుండానే భారతీయులకు ప్రవేశం
Indian Passport Ranking: హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2025 నివేదికలో భారతదేశం 85వ స్థానం నుంచి 77వ స్థానానికి ఎగబాకింది. ఈ పెరుగుదల చూడటానికి సాధారణంగా అనిపించవచ్చు, అయితే పాస్‌పోర్ట్ ఇండెక్స్ వంటి సూచికలలో ఒక స్థానం మారడం కూడా దౌత్యపరంగా చాలా ముఖ్యమైనది.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppIndian Passport Ranking: భారతదేశం ఇప్పుడు మొత్తం 59 దేశాలకు వీసారహిత సౌకర్యం కలిగి ఉంది. ఇది గత సంవత్సరాలతో పోలిస్తే స్వల్ప పెరుగుదల, కానీ ఇది ర్యాంకింగ్‌లో భారీ పెరుగుదలకు కారణం అయ్యింది.
Indian Passport Ranking: భారతదేశం వీసా రహిత దేశాలలో మలేషియా, ఇండోనేషియా, మాల్దీవులు, థాయిలాండ్ ఉన్నాయి, అయితే శ్రీలంక, మయన్మార్, మకావులలో వెంటనే వీసా ఇస్తారు. ఇది దక్షిణ ఆసియా, ఆసియాన్ దేశాలతో భారతదేశ దౌత్య సంబంధాల బలాన్ని కూడా సూచిస్తుంది.
Indian Passport Ranking: హెన్లీ అండ్ పార్టనర్స్ CEO డాక్టర్ జుర్గ్ స్టీఫెన్ మాట్లాడుతూ నేడు పాస్‌పోర్ట్ కేవలం ప్రయాణ పత్రం మాత్రమే కాదు, మీ దేశానికి ప్రపంచ దేశాలతో ఉన్న సంబంధాలకు చిహ్నం. అమెరికన్, బ్రిటిష్ పౌరులు ఇప్పుడు ప్రత్యామ్నాయ పౌరసత్వం, నివాస పథకాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు అని అన్నారు.
Indian Passport Ranking: 2025లో చైనా ర్యాంకింగ్ కూడా చాలా ముఖ్యంగా ఉంది. 2015లో 94వ స్థానంలో ఉన్న చైనా ఇప్పుడు 60వ స్థానానికి చేరింది. సౌదీ అరేబియా కూడా నాలుగు కొత్త వీసా లేని దేశాలను చేర్చి 91 దేశాల వరకు వీసా లేకుండా ప్రవేశాన్ని సాధించింది.
Indian Passport Ranking: బ్రిటన్ 186 వీసా ఫ్రీ దేశాలతో ఆరో స్థానానికి పడిపోయింది. అయితే అమెరికా 182 వీసా ఫ్రీ దేశాలతో 10వ స్థానానికి చేరుకుంది. ఈ తగ్గుదల అనేక భౌగోలిక-రాజకీయ మార్పులు, కఠినమైన ఇమ్మిగ్రేషన్ చట్టాలను పరిగణలోకి తీసుకొని ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలు కేవలం 25 దేశాలలో వీసారహిత ప్రయాణం చేయవచ్చు. ఇది ప్రపంచ పాస్‌పోర్ట్ పవర్‌లో అసమానతను సూచిస్తుంది.
Indian Passport Ranking: యూరోప్‌లోని అనేక దేశాలు మూడో , నాల్గో స్థానాల్లో ఉన్నాయి. ఫ్రాన్స్, జర్మనీ, ఐర్లాండ్, ఇటలీ, స్పెయిన్ వంటి దేశాల ప్రజలు 189 దేశాలలో వీసా లేకుండా తిరగవచ్చు, అయితే ఆస్ట్రియా, బెల్జియం, స్వీడన్, పోర్చుగల్ వంటి దేశాలు నాల్గో స్థానంలో ఉన్నాయి.
Indian Passport Ranking: హెన్లీ సూచిక 2025లో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్ సింగపూర్‌దిగా నిలిచింది. ఇక్కడి పౌరులకు 193 దేశాలలో వీసారహిత ప్రవేశం లభిస్తుంది. సింగపూర్ జపాన్, దక్షిణ కొరియాను అధిగమించి అగ్రస్థానంలో నిలిచింది.
Indian Passport Ranking: ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, అమెరికా, బ్రిటన్ వంటి సాంప్రదాయకంగా శక్తివంతమైన దేశాల ర్యాంకింగ్స్ తగ్గుముఖం పట్టాయి, ఇది ప్రపంచ విధానాలు, దౌత్యపరమైన మార్పులను సూచిస్తుంది.
Indian Passport Ranking: జపాన్, కొరియా సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాయి. ఇక్కడి పౌరులు 190 దేశాలలో వీసా లేకుండా ప్రయాణించవచ్చు. ఇది ఆసియా ప్రపంచ గమనశీలతలో అగ్రగామిగా కొనసాగుతోందని సూచిస్తుంది.