PM Awas Yojana Rules: ఒకే ఫ్యామిలీలో ఇద్దరు సోదరులకు పీఎం ఆవాస్ యోజన పథకం వర్తిస్తుందా ? పూర్తి వివరాలు
భారత ప్రభుత్వం 2015లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకాన్ని ప్రారంభించింది. దీని లక్ష్యం హౌసింగ్ ఫర్ ఆల్ అంటే.. అందరికీ పక్కా ఇల్లు ఉండాలి. ముఖ్యంగా మధ్య, దిగువమధ్య తరగతి వారికి పీఎం ఆవాస్ యోజన అర్బన్, పీఎం ఆవాస్ యోజన రూరల్ అని రెండు రకాలుగా పీఎంఏవై పథకాన్ని అమలు చేస్తున్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపీఎం ఆవాస్ యోజన పథకం ద్వారా ఇప్పటివరకు లక్షలాది కుటుంబాలు లబ్ధి పొందాయి. కేంద్ర ప్రభుత్వం తరచుగా వీటికి సంబంధించిన గణాంకాలను విడుదల చేస్తుంది. పీఎం ఆవాస్ యోజన అర్బన్, పీఎం ఆవాస్ యోజన రూరల్ లో లబ్ధి కోసం ప్రభుత్వం వేర్వేరు నిబంధనలను అమలు చేస్తోంది.
దరఖాస్తుదారుడి కుటుంబంలో భార్యాభర్తలు, వారికి అవివాహిత పిల్లలు ఉండాలి. పీఎంఏవై పథకంలో రుణాలపై సబ్సిడీ కూడా లభిస్తుంది. తద్వారా ఇల్లు పొందడం సులభం అవుతుంది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు సొంత సోదరులు ఒకేసారి లబ్ధి పొందవచ్చా అని ప్రజలలో సందేహాలు నెలకొన్నాయి.
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PM Awas Yojana) పథకం నిబంధనల ప్రకారం ఒక కుటుంబంలో భర్త, భార్య, అవివాహిత పిల్లలు మాత్రమే ఉండాలి. ఇద్దరు సోదరులు కలిసి నివసిస్తుంటే, ఒకరికి మాత్రమే ప్రయోజనం చేకూరుతుంది. ఒకేసారి ఇద్దరికీ ప్రయోజనం లభించదు.
సోదరులు ఇద్దరి కుటుంబాలు వేర్వేరుగా నివసిస్తున్నాయి. ఇద్దరూ కలిసి ఉండరు. అలాంటి సందర్భంలో ఇద్దరూ పథకం పొందడానికి అర్హులు అవుతారు. అప్పుడు వారు వేర్వేరుగా దరఖాస్తు చేసుకుంటే ఇద్దరికీ వేర్వేరుగా ప్రయోజనం చేకూరనుంది.
ఇద్దరు సొంత అన్నదమ్ములు వేర్వేరుగా నివాసం ఉన్నట్లయితే.. ఇద్దరికీ వారి వ్యక్తిగత కుటుంబాలు ఉంటాయి. ఇద్దరూ పీఎం ఆవాస్ యోజన పథకంలో వేరువేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ ఇద్దరూ ఒకే కుటుంబంలో కలిసి నివసిస్తుంటే, ఒకరు మాత్రమే లబ్ధి పొందుతారు.