Nuclear Bunkers: అత్యధిక న్యూక్లియర్ బంకర్లను నిర్మించిన స్విట్జర్లాండ్, వాటిని మళ్లీ ఎందుకు యాక్టివేట్ చేస్తోంది?
అణుబాంబు దాడుల నుండి తమ ప్రజలను రక్షించడానికి స్విట్జర్లాండ్ ప్రభుత్వం ఏదైనా నిర్మాణం చేపట్టే ముందు న్యూక్లియర్ షెల్టర్లు నిర్మించాలని నిబంధనలు తీసుకొచ్చింది. నివేదికల ప్రకారం 88 లక్షల జనాభా కలిగిన స్విట్జర్లాండ్లో 3.7 లక్షలకు పైగా బంకర్లు ఉండటం విశేషం.
స్విట్జర్లాండ్ లోని స్విస్ ఆల్ప్స్ దృఢమైన శిలలను లోతుగా తవ్వకం ద్వారా దేశంలో అణు నిరోధక బంకర్లను పెద్ద సంఖ్యలో నిర్మించారు. అలాగే పౌర, సైనిక సొరంగాల నెట్వర్క్ కూడా ఉంది. ఈ బంకర్ల గేట్లు దిబ్బల క్రింద నిర్మించారు. ఇవి సాధారణ ఇళ్లలా కనిపిస్తాయి, కానీ వాస్తవానికి అవి రెండు మీటర్ల ఎత్తైన కాంక్రీట్ గోడలు అని దగ్గరికి వెళ్లి చూస్తే తెలుస్తుంది.
స్విట్జర్లాండ్ జనాభా 88 లక్షలు. ఇక్కడ ప్రభుత్వ ఆదేశాలతో అత్యధికంగా న్యూక్లియర్ షెల్టర్లు నిర్మించారు. వాటి సంఖ్య దాదాపు 3.7 లక్షలు ఉంటుందని సమాచారం. 1963 లో ఒక చట్టం చేశారు. ఇది ఇక్కడి పౌరులకు అణు విపత్తులు లేదా పొరుగు దేశంతో యుద్ధం సమయంలో బంక్ బెడ్ లను సమకూర్చుతారు.
ఆ చట్టం ప్రకారం, అత్యవసర పరిస్థితి కోసం ప్రతి వ్యక్తికి కనీసం ఒక చదరపు మీటర్ స్థలం ఉండాలి. అంతేకాకుండా ఆ బంకర్ వ్యక్తి ఇంటి నుండి అరగంట దూరంలో చేరుకోగలగాలి లేదా కొండ ప్రాంతం అయితే ఒక గంట దూరంలో చేరాలా ఉండాలి.
స్విట్జర్లాండ్ పౌర రక్షణ కార్యాలయం ప్రకారం ఈ బంకర్లు సాధారణ బాంబు దాడులతో పాటు అణు బాంబు దాడులను తట్టుకోగల సామర్థ్యం వాటి సొంతం. ఈ షెల్టర్లు చాలా ధృడంగా ఉంటాయి. వాటిపై ఏదైనా భవనం కూలినా, వాటి లోపల తలదాచుకునే వారికి ఎటువంటి ప్రాణ నష్టం జరగదు.
50-60 సంవత్సరాల కిందట నిర్మించిన ఈ బంకర్లు అణుబాంబు తరహా పెద్ద దాడులను ఆపగలవని స్విట్జర్లాండ్ ప్రజలు భావించడం లేదు. దాంతో ఆ పాత బంకర్లను ఆధునికీకరణ చేయాలని, పవర్ ఫుల్ బాంబులను సైతం తట్టుకుని ఉండేలా మరమ్మతులు చేయాలని ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
బంకర్ల నిర్మాణం, మరమ్మతుల కోసం 250 మిలియన్ డాలర్లు ఖర్చు అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. అత్యవసర పరిస్థితుల్లో బంకర్లు అందుబాటులో ఉండేలా చూడడమే దీని లక్ష్యం. అయితే యుద్ధ సన్నాహాలు అనడం కంటే, దేశ పౌరుల రక్షణ కోసం చేపట్టిన చర్యగా అధికారులు చెబుతున్నారు.