Kirana Hills Pakistan: పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో సర్గోధా జిల్లాలో ఉన్న కిరాణా హిల్స్ ఇప్పుడు ఆ దేశానికి టెన్షన్ పుట్టిస్తోంది. దీనికి కారణం పాకిస్తాన్ సైనిక, యు అణు కార్యక్రమాలకు సంబంధించిన రహస్య కేంద్రంగా కిరాణా హిల్స్ ఉంది. అలాగే ఉగ్రవాద శిబిరాలకు సంబంధించిన కార్యకలాపాలకు కూడా కేంద్రంగా కూడా ఉంది. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా భారత సైన్యం కిరాణా హిల్స్ సమీపంలోని సర్గోధా వద్ద ముషాఫ్ ఎయిర్ బేస్ లోని రన్‌వే ధ్వంసం చేసిది. ఈ ప్రాంతంలో పాకిస్తాన్ భూగర్భ అణు నిల్వ కేంద్రాలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
ట్విట్టర్‌లో పలు పోస్ట్‌లు కిరాణా హిల్స్ నుండి రేడియోఆక్టివ్ గ్యాస్ లీకేజ్ జరుగుతోందని, దీని కారణంగా స్థానిక ప్రజలు తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నాయి పాకిస్తాన్ అధికారులు కిరాణా హిల్స్ చుట్టూ 100 కిలోమీటర్ల పరిధిని ఖాళీ చేయమని స్థానికులను ఆదేశించారని రేడియేషన్ సైడ్ ఎఫెక్ట్స్ , నివేదికలను నివారించడానికి జాగ్రత్తలు చెబుతున్నారని ప్రకటిస్తున్నారు.
అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం లేదు. పాకిస్తాన్ ప్రభుత్వం కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. కిరాణా హిల్స్లో అణు పరీక్షలు మరియు మిస్సైల్ టెస్టింగ్ కోసం భూగర్భ సొరంగాలు ఉన్నాయని అనుమానిస్తున్నాయి. ఆపరేషన్ సిందూర్ దాడుల తర్వాత, ఈ ప్రాంతంలోని అణు సౌకర్యాలు దెబ్బతిన్నాయని లేదా రేడియేషన్ లీకేజ్ జరిగిందని సోషల్ మీడియాలో ఊహాగానాలు వ్యాపించాయి. కిరాణా హిల్స్ దట్టమైన అడవులు, పర్వత ప్రాంతాల వల్ల ఉగ్రవాద శిబిరాలకు అనువైన ప్రదేశంగా ఉందని ఆరోపణలు ఉన్నాయి. పాకిస్తాన్ సైన్యం మరియు ISI మద్దతుతో జైష్-ఎ-మహమ్మద్ (JeM) వంటి ఉగ్రవాద సంస్థలు ఇక్కడ శిక్షణ శిబిరాలను నిర్వహించాయిని నివదేికలు చెబుతున్నాయి.
పాకిస్తాన్ అధికారులు లేదా అంతర్జాతీయ మీడియా నుండి కిరాణా హిల్స్‌లో రేడియేషన్ లీకేజ్ లేదా ఆరోగ్య సమస్యల గురించి ఎటువంటి అధికారిక సమాచారం లేదు. అయితే భారత ప్రభుత్వం, సైన్యం కిరాణా హిల్స్‌లోని సైనిక మరియు ఉగ్రవాద సౌకర్యాలను లక్ష్యంగా చేసినట్లు ధృవీకరించాయి, కానీ రేడియేషన్ లీకేజ్ గురించి ఎటువంటి అధికారిక ప్రకటనలు చేయలేదు.