Toyota Fortuner Tax Calculation in India: భారత మార్కెట్లో కోట్ల రూపాయలు ఖరీదు చేసే లగ్జరీ కార్లు చాలా ఉన్నాయి. అందరూ ఖరీదైన కార్లను కొనుగోలు చేయలేరు. కానీ, ఖరీదైన కార్లను అమ్మడం ద్వారా కార్ మాన్యుఫాక్చరింగ్‌ కంపెనీలు ఎంత సంపాదిస్తాయనే ప్రశ్న మీ మనసులోకి ఎప్పుడైనా వచ్చిందా?. లగ్జరీ కార్ల అమ్మకం ద్వారా కార్‌ కంపెనీలు భారీగా సంపాదిస్తున్నాయని మీరు అనుకుని ఉంటారు. కానీ, ప్రస్తుత పరిస్థితి మీరు అనుకున్నట్లుగా లేదు, దానికి విరుద్ధంగా జరుగుతోంది.

Continues below advertisement


లగ్జరియస్‌ SUV టయోటా ఫార్చ్యూనర్‌ను ఇక్కడ ఉదాహరణగా తీసుకుందాం. ఈ కార్‌ సేల్స్‌ నుంచి కంపెనీకి తక్కువ సంపాదిస్తుంది & ప్రభుత్వం ఎక్కువ సంపాదిస్తుంది.


టయోటా ఫార్చ్యూనర్ పన్ను లెక్కింపు
ప్రస్తుతం, హైదరాబాద్‌లో, Toyota Fortunar 4X2 AT (Petrol) వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర దాదాపు రూ. 36 లక్షల 05 వేలు (రూ. 36.05 లక్షలు). దీని టాప్ మోడల్ GR S 4X4 Diesel AT (Diesel) వేరియంట్ ధర రూ. 62 లక్షల 34 వేలు (రూ. 62.34 లక్షలు). 


2022 సంవత్సరంలో, యూట్యూబర్ & CA (ఛార్టెడ్‌ అకౌంటెంట్‌) సాహిల్ జైన్, టయోటా ఫార్చ్యూనర్ గురించి తన వీడియోలో వివరించారు. టయోటా ఫార్చ్యూనర్‌లో ఒక వేరియంట్‌ ఎక్స్-షోరూమ్ ధర రూ. 39,28,000 (ఆ సమయంలో ధర) అయితే, దీనిలో కారు వాస్తవ ధర రూ. 26,27,000 అని వివరించారు. ఛార్టెడ్‌ అకౌంటెంట్‌ చెప్పిన ప్రకారం, వ్యత్యాసంగా ఉన్న రూ. 13,01,000 మొత్తం (39,28,000 - 26,27,000) GSTలోని రెండు భాగాల కారణంగా యాడ్‌ అయింది. మొదటిది GST పరిహారం & రెండోది GST. వాహనంపై GST పరిహారం 22 శాతం కాగా, GST 28 శాతం.


ఈ కారు ద్వారా ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుంది? 
GSTతో పాటు, కారుపై ఇతర ఛార్జీలు కూడా విధిస్తారు, అవి - రిజిస్ట్రేషన్, లాజిస్టిక్స్, ఫాస్టాగ్ వంటివి. అన్ని పన్నులు & ఛార్జీలు కలిపితే ప్రభుత్వానికి వచ్చే మొత్తం ఆదాయం రూ. 18 లక్షల కంటే ఎక్కువ. లగ్జరీ కార్ల అమ్మకం వల్ల కంపెనీలకు అధిక మార్జిన్లు & డీలర్లకు అధిక కమీషన్ లభిస్తాయి. అయితే, లగ్జరీ కార్లపై విధించే పన్ను రూపంలో ప్రభుత్వం అంతకంటే ఎక్కువే సంపాదిస్తుంది.


మరొక ఉదాహరణ చూద్దాం. టయోటా ఫార్చ్యూనర్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 39.28 లక్షలు అయితే, దానిపై సెస్ (22 శాతం) కింద దాదాపు రూ. 5.72 లక్షలు & GST (28 శాతం) కింద దాదాపు రూ. 7.28 లక్షలు వసూలు చేస్తారు. అంటే, ఈ ధరలో కేవలం ప్రభుత్వానికే రూ. 13 లక్షలు చెల్లించాలి. 


ఇప్పుడు మనం ఆన్-రోడ్ ధర గురించి మాట్లాడుకుందాం. ఎక్స్‌-షోరూమ్‌లో కట్టిన సెస్ & GSTకి అదనంగా, ఆన్‌-రోడ్‌ ధరలో రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. మీరు కొనేది డీజిల్ వేరియంట్ అయితే గ్రీన్ టాక్స్ కూడా చెల్లించాలి. ఈ కేస్‌లో, ప్రభుత్వానికి కట్టే మొత్తం పన్నులు దాదాపు రూ. 18 లక్షలకు సమానం.