ABP  WhatsApp

Election Results 2024

(Source: ECI/ABP News/ABP Majha)

National Unity Day 2021: 'భారతజాతి ఐక్యత, సమగ్రతను ఎవరూ దెబ్బతీయలేరు'

ABP Desam Updated at: 31 Oct 2021 03:57 PM (IST)
Edited By: Murali Krishna

సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులర్పించారు.

'భారతజాతి ఐక్యతా, సమగ్రతను ఎవరూ దెబ్బతీయలేరు'

NEXT PREV

సర్దార్ వలభ్‌భాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆయనను కీర్తించారు. 'ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్' కోసం సర్దార్ వల్లభ్​భాయ్ పటేల్ తన జీవితాన్ని అంకితం చేశారని ప్రధాని మోదీ కొనియాడారు. ప్రతి ఒక్క భారతీయుడి హృదయాల్లో సర్దార్ పటేల్ చిరస్థాయిగా నిలిచి ఉన్నారన్నారు. ఈ మేరకు వీడియో సందేశం ఇచ్చారు మోదీ.






దేశ ఐక్యతకు ప్రతీక..


పటేల్​ జయంతి సందర్భంగా గుజరాత్​ కెవాడియాలోని ఐక్యతా విగ్రహం వద్దకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెళ్లారు. 'రాష్ట్రీయ ఏక్తా దివస్​' పరేడ్​ను వీక్షించారు. ఒలింపిక్స్​లో పతకం సాధించిన భారత హాకీ టీం కెప్టెన్​ మన్​ప్రీత్​ సింగ్​తో పాటు మరికొందరు జట్టు సభ్యులు ఈ పరేడ్​లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రసంగించిన అమిత్ షా.. పటేల్ చేసిన కృషిని కొనియాడారు.






భారతదేశ ఐక్యత, సమగ్రతను ప్రపంచంలో ఎవరూ దెబ్బతీయలేరనే సందేశాన్ని సర్దార్​ వల్లభ్​భాయ్​ పటేల్​ ఇచ్చారని అమిత్​ షా అన్నారు. ఈ ప్రాంతం కేవలం పటేల్​ స్మారకంగానే కాకుండా దేశ భక్తిని పెంపొందించే పుణ్యక్షేత్రంగా మారిందన్నారు.



స్వాతంత్ర్యం తర్వాత దేశాన్ని ముక్కలు చేయడానికి బ్రిటీషర్లు కుట్ర పన్నారు. అయితే సర్దార్‌ పటేల్‌ వారి కుట్రను భగ్నం చేశారు. అఖండ భారత్‌ చేయాలని సంకల్పించారు. ఈ ఐక్యతా విగ్రహం దేశ ఐక్యత, సమగ్రతను ఎవరూ దెబ్బతీయలేరనే సందేశం ఇస్తుంది.                                                            - అమిత్ షా, కేంద్ర హోంమంత్రి


పటేల్​ జయంతి సందర్భంగా ప్రతి ఏడాది అక్టోబర్​ 31న దేశం 'రాష్ట్రీయ ఏక్తా దివస్' జరుపుకుంటుంది. 


Also Read: Pee Power Project: ఏం ఐడియా సర్‌జీ..! ఛీఛీ అనుకోకండి.. దీంతో ఇంటి మొత్తానికి కరెంట్!


Also Read:Restaurant Update: పిజ్జా, బర్గర్లను కుమ్మేస్తున్నారా? వాటిలో ప్లాస్టిక్‌లో వాడే కెమికల్స్ ఉన్నాయట!


Also Read: G20 Summit: 'ప్రపంచానికి బాసటగా భారత్.. 2022 చివరి నాటికి 500 కోట్ల టీకా డోసులు'


Also Read: Dehradun: లోయలో పడిన వాహనం.. 11 మంది మృతి, నలుగురికి గాయాలు


Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 12,830 కేసులు, 446 మరణాలు


Also read: ఈ అయిదు పనులు చేయకపోతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం... ముందుజాగ్రత్తపడమంటున్న వైద్యులు


Also read:  తెల్లవెంట్రుక పీకేస్తే... అవి మరింత ఎక్కువవుతాయంటారు నిజమేనా?


Also read: ఇది మంగళసూత్రం ప్రకటనా లేక లోదుస్తుల ప్రకటనా?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at: 31 Oct 2021 03:55 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.