ABP  WhatsApp

Pee Power Project: ఏం ఐడియా సర్‌జీ..! ఛీఛీ అనుకోకండి.. దీంతో ఇంటి మొత్తానికి కరెంట్!

ABP Desam Updated at: 31 Oct 2021 03:35 PM (IST)
Edited By: Murali Krishna

మన రోజూ వినియోగించే టాయిలెట్స్ నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చట. అవును మన ఇళ్లలోకి కావల్సిన విద్యుత్ ఇలానే తయారు చేస్తారట. ఎలానో తెలుసా?

ఏం ఐడియా సర్‌జీ..! ఛీఛీ అనుకోకండి.. దీంతో ఇంటి మొత్తానికి కరెంట్

NEXT PREV

విద్యుత్.. మన రోజువారి అవసరాలు, సౌకర్యాల కోసం ఇది ఎంత అవసరమో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే ఇటీవల సోలార్ విద్యుత్ వైపు అందరి పరుగులు పెడుతున్నారు. కొంతమంది చెత్త నుంచి కూడా విద్యుత్ తయారు చేస్తున్నారు. కానీ ఇటీవల ఓ షాకింగ్ విషయం బయటపడింది. అదేంటంటే హ్యూమన్ వేస్ట్ నుంచి కూడా కరెంట్ ఉత్పత్పి చేస్తున్నారు. అవును మీరు విన్నది నిజమే దీనిని 'పీ ప్రాజెక్ట్' అంటారు.


పీ ప్రాజెక్ట్ అంటే?


బ్రిస్టోల్‌కు చెందిన కొంతమంది పరిశోధనకర్తలు ఈ తరహా విద్యుత్ ఉత్పత్తిని కనిపెట్టారు. హ్యూమన్ వేస్ట్ (మూత్రం, మలం) ద్వారా కరెంట్‌ను ఉత్పత్తి చేసి దాంతో ఇళ్లలోని విద్యుత్ అవసరాలను తీర్చడమే ఈ 'పీ ప్రాజెక్ట్' ఉద్దేశం.


ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై 2 ఏళ్ల క్రితం గ్లాస్టోన్‌బరీ ఫెస్టివల్‌లో ట్రయల్స్ నిర్వహించారు. టాయిలెట్స్ నుంచి ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేశారు. మొబైల్ ఫోన్ల ఛార్జింగ్, లైట్ బల్బులు, రోబోల వినియోగానికి ఈ కరెంట్‌ను వినియోగించుకోవచ్చు. 



మొత్తం ఐదురోజుల పాటు మూత్రవిసర్జన కోసం ప్రజలు వినియోగించిన టాయిలెట్ల నుంచి 300 వాట్-అవర్స్ విద్యుత్‌ను తయారు చేశాం. ఈ విద్యుత్‌తో ఒక వాట్ బల్బును 300 గంటలపాటు వినియోగించవచ్చు. లేదా 10 బల్బులను 30 గంటలపాటు వాడుకోవచ్చు.      - డా. లోయిన్నిస్ లెరోపోలస్, బ్రిస్టోల్ బయోఎనర్జీ సెంటర్ డైరెక్టర్


ఎలా వచ్చింది?


మైక్రోబియాల్ ఫ్యూయల్ సెల్స్ ఆధారంగా ఈ పరిశోధన మొదలుపెట్టినట్లు ఆయన తెలిపారు. మైక్రోబ్స్‌తో ఈ బ్యాటరీలను ఫిల్ చేసినట్లు వెల్లడించారు. మైక్రోబ్స్ కెమికల్ పార్ట్స్‌గా మారి విద్యుత్‌ను తయారు చేయగలవని పేర్కొన్నారు. ఆర్గానిక్ వేస్ట్ ద్వారా రోబో బ్యాటరీని ఛార్జ్ చేసినప్పుడు ఇలా హ్యూమన్ వేస్ట్ ద్వారా కూడా విద్యుత్‌ను తయారు చేయాలనే ఆలోచన వచ్చినట్లు లోయిన్నిస్ తెలిపారు.


భవిష్యత్తులో ఇళ్ల కోసం నిర్మించే గోడల్లో వాడే ఇటుకల్లో ఈ ఫ్యూయల్ సెల్స్‌ను ఏర్పాటు చేస్తారు. తద్వారా ఇళ్ల గోడలే హ్యూమన్ వేస్ట్ నుంచి కరెంట్‌ను ఉత్పత్తి చేస్తాయట.


దీంతో రోజువారి ఓ కుటుంబం నుంచి వచ్చే హ్యూమన్ వేస్ట్ ద్వారా వారి ఇళ్లలో కరెంట్ సమస్య లేకుండా చేయొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరి ఫ్యూచర్లు కరెంట్ బిల్లులు కట్టే బాధ తప్పుతుందన్నమాట!


Also Read:Restaurant Update: పిజ్జా, బర్గర్లను కుమ్మేస్తున్నారా? వాటిలో ప్లాస్టిక్‌లో వాడే కెమికల్స్ ఉన్నాయట!


Also Read: G20 Summit: 'ప్రపంచానికి బాసటగా భారత్.. 2022 చివరి నాటికి 500 కోట్ల టీకా డోసులు'


Also Read: Dehradun: లోయలో పడిన వాహనం.. 11 మంది మృతి, నలుగురికి గాయాలు


Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 12,830 కేసులు, 446 మరణాలు


Also read: ఈ అయిదు పనులు చేయకపోతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం... ముందుజాగ్రత్తపడమంటున్న వైద్యులు


Also read:  తెల్లవెంట్రుక పీకేస్తే... అవి మరింత ఎక్కువవుతాయంటారు నిజమేనా?


Also read: ఇది మంగళసూత్రం ప్రకటనా లేక లోదుస్తుల ప్రకటనా?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at: 31 Oct 2021 03:31 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.