టీఆర్ఎస్ పార్టీ ప్రజాస్వామాన్ని ఖూనీ చేసిందని మాజీ మంత్రి, హుజూరాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. ఆదివారం ఆయన కరీంనగర్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హుజూరాబాద్ ఎన్నికల అనంతరం టీఆర్ఎస్ పార్టీ వ్యవహరించిన తీరుపై మాట్లాడారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలే స్వయంగా డబ్బు పంచారని ఈటల ఆరోపించారు. ఈవీఎంలు కూడా మార్చినట్లు వార్తలు వస్తున్నాయని అన్నారు. ఓటు వేసిన బాక్స్‌లు కూడా మాయం చేయడం దుర్మార్గమని.. టీఆర్‌ఎస్ కుట్రలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని ఈటల రాజేందర్ తెలిపారు.
ఎన్నికల్లో జరుగుతున్న అక్రమాలపై ఎన్నోసార్లు పోలీస్ కమిషనర్, కలెక్టర్‌కి చెప్పినా ప్రయోజనం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ఉన్నతాధికారులు ఏకపక్షంగా వ్యవహరించారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే పద్దతిలో అధికార పార్టీ వ్యవహరించిందని అన్నారు. డబ్బులు పెట్టి గెలిచే పద్దతి మంచిది కాదని.. ఎమ్మెల్యేలు స్వయంగా డబ్బులు పంచి వెళ్లడం చూస్తే బాధ కలుగుతోందని అన్నారు. అంతేకాక, కొన్ని బూత్‌లల్లో కూడా ఈవీఎంలు మార్చినట్టు వార్తలు వస్తున్నాయని అనుమానాలు వ్యక్తం చేశారు. ఈవీఎంలు పాడయ్యాయని అని మార్చడం పెద్ద అనుమానాలకు తావిస్తోందని ఈటల అన్నారు.
Also Read: Hyderabad CP: సీపీ అంజనీ కుమార్‌కు లీగల్ నోటీసులు.. ఎందుకంటే.. ఆ వీడియోలపై సీపీ వివరణ
‘‘నన్ను ఓడించడానికి కేసీఆర్ అన్ని ప్రయత్నాలు చేశారు. డబ్బులు పంచారు, మందు పంచారు. బెదిరించారు. మభ్యపెట్టారు. చివరికి పోలింగ్ సిబ్బందికి కూడా దావత్ ఇచ్చి డబ్బులు ఇచ్చి మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. అన్నీ చేసినా కూడా గెలవలేక ఇలాంటి పనులు చేస్తున్నారు. ఆత్మను ఆవిష్కరించి ఓటు వేసిన తరువాత కూడా.. ఓటు వేసిన బాక్స్‌లు కూడా మాయం చేయడం దుర్మార్గం. ఎన్నికల కమిషన్‌కి ఫిర్యాదు చేస్తున్నాం. హుజూరాబాద్ ప్రజలు ఇచ్చిన తీర్పు చరిత్రలో నిలిచిపోతుంది. ఇది చారిత్రాత్మక ఘట్టం. కలెక్టర్ పొరపాటు జరిగింది అని చెప్తున్నారు. ఇది మామూలు ఎన్నిక కాదు. ఇంత ఉత్కంఠ భరితంగా జరిగిన ఎన్నికలలో సిబ్బంది ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా?’’ అని ఈటల రాజేందర్ అనుమానాలు వ్యక్తం చేశారు.
Also Read: Hyderabad Murder: భర్త నిద్రిస్తున్న వేళ ప్రియుడ్ని ఇంటికి పిలిచిన భార్య.. కాసేపట్లోనే ఘోరం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి