హుజురాబాద్ ఉపఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు సాధారణ ఓటర్లు, సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు కోవిడ్ సోకిన ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 85 శాతానికిపైగా పోలింగ్ నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. సాయంత్రం ఐదు గంటల సమయానికి 76.26శాతం పోలింగ్ జ‌రిగిన‌ట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. పోలింగ్ సమయం ముగిసినా క్యూ లైన్లలో ఓటు వేసే వారికి అవకాశం కల్పిస్తారు కాబట్టి రేపు ఉదయానికి మొత్తం ఎంత మేర పోలింగ్ జరిగిందో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే రికార్డు స్థాయిలో పోలింగ్ ఇప్పటికే నమోదయింది. 


అన్ని రాజకీయ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్నికల కారణంగా కాస్తంత ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పలు చోట్ల రెండు పార్టీల నేతలు ఘర్షణకు దిగారు.  పోలింగ్ ప్రారంభమైన సమయంలోనే ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్న బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌పై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు టీఆర్ఎస్ పార్టీ విజ్ఞప్తి చేసింది. కమలాపూర్ మండలంలోని పోలింగ్ బూత్ నెం.262లో ఓటు వేయడానికి వెళ్ళిన ఈటల రాజేందర్, తన భార్యతో కలిసి మీడియాతో మాట్లాడారని, ఓటర్లకు అప్పీల్ చేసే తీరులో విజ్ఞప్తి చేశారని టీఆర్ఎస్  ఫిర్యాదు చేసిది. 




Also Read : డబ్బుల కోసం ఓటర్ల ధర్నాలు ! ప్రజాస్వామ్యం పతనావస్థకు ఇదే సంకేతమా ?


హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం మరిపెల్లిగూడెంలో ఈటల కాన్వాయ్‌లోని మూడు వాహనాలను పోలీసులు సీజ్ చేసి, పీఆర్వోను అదుపులోకి తీసుకున్నారు. హిమ్మత్ నగర్ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రానికి మాజీ జడ్పీ చైర్మన్, బీజేపీ నేత తుల ఉమ వచ్చినప్పుడు ఉద్రిక్తత ఏర్పడింది. తుల ఉమ స్థానికేతర నేత కావడంతో టీఆర్ఎస్ నేతలు  ఆందోళనకు దిగారు. కారు దిగి వెళ్తున్న ఉమను అడ్డుకొని అక్కడి నుంచి వెళ్లిపోవాలని నినాదాలు చేశారు. ఈ క్రమంలో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు దాడికి దిగారు. పోలీసులు వారిని చెదరగొట్టారు.


Also Read : మంగళవారం మరదలమ్మా వ్యాఖ్యలపై రాజకీయ రచ్చ... పశ్చాత్తాపం వ్యక్తం చేసిన మంత్రి నిరంజన్ రెడ్డి..


పోలీసులు ప్రారంభమైన సమయంలో వీణవంక మండలంలో పోలింగ్‌ బూత్‌లో లో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఎన్నికల్లో అభ్యర్థి కాకపోయినప్పటికీ టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి పోలింగ్ కేంద్రంలోకి వెళ్లారు. అది గమనించిన ఓటర్లు కౌశిక్ రెడ్డి అడ్డుకున్నారు. పోలింగ్ జరుగుతున్న సమయంలో పోలింగ్ కేంద్రంలో ఎన్నికల ప్రచారం ఎందుకు చేస్తున్నావ్  అంటూ కౌశిక్‌ను నిలదీశారు. దీంతో ఆ పోలింగ్ కేంద్రంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకొని కౌశిక్ రెడ్డిని అక్కడి నుంచి బయటకు పంపించడంతో పరిస్థితి సద్దుమణిగింది.,


Also Read : ఫ్రాన్స్‌ సెనెట్‌లో ప్రసంగం.. పెట్టుబడుల కోసం పారిశ్రామిక వేత్తలతో భేటీలు .. బిజిబిజీగా కేటీఆర్ టూర్ !


అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఫలితంగా ఓటర్లు కూడా ఆసక్తి చూపించారు. అందరూ తమ  తమ ఓటర్లను పోలింగ్ బూత్‌ల వద్దకు తీసుకొచ్చేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నించారు. ఫలితంగా పోలింగ్ శాతం అనూహ్యంగా పెరిగింది.


Also Read : అనుమతులు వచ్చాకే పాలమూరు - రంగారెడ్డి నిర్మాణం .. తెలంగాణ సర్కార్‌ను ఆదేశించిన ఎన్జీటీ !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి