హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్‌కు లీగల్ నోటీసులు అందాయి. డేటా, ప్రైవసీ అనే అంశాలపై పరిశోధనలు చేసే హైదరాబాద్‌కు చెందిన కె.శ్రీనివాస్ అనే వ్యక్తి ఈ నోటీసులు పంపారు. డ్రగ్స్, గంజాయి కోసం తనిఖీల సమయంలో ప్రజల వాట్సాప్‌ చాట్‌లపై నిఘా పెట్టడం నిబంధనలకు విరుద్ధం అనే ఉద్దేశంతో కె.శ్రీనివాస్ ఈ లీగల్ నోటీసులు పంపారు. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌లోని వెస్ట్‌ జోన్‌ ప్రాంతంలో డ్రగ్స్‌ వ్యవహారానికి సంబంధించిన తనిఖీలు చేసే సమయంలో స్మార్ట్‌ ఫోన్లు చూపించాలంటూ పోలీసు అధికారులు స్థానిక ప్రజలను కోరినట్లుగా కొన్ని వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. వీటి ఆధారంగా డేటా, ప్రైవసీ అనే అంశాలపై పరిశోధనలు చేసే కె.శ్రీనివాస్‌ నోటీసులు పంపారు.


ఈ నెల అంటే అక్టోబరు 27న హైదరాబాద్‌లోని అఫ్జల్ గంజ్ సమీపంలో ఉన్న జుమేరాత్‌ బజార్‌, ధూల్‌ పేట్‌, మంగళ్‌ హాట్‌, ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఆ వీడియోలు బయటికి వచ్చాయి. వాట్సప్‌ను చూపించమని పోలీసులు చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడినట్లు తక్షణమే గుర్తించాలని కె. శ్రీనివాస్ అనే వ్యక్తి నోటీసులో కోరారు. పాదచారులు, బైకర్లు, ఆటో డ్రైవర్ల వంటి సాధారణ పౌరులను ఆపి, మొబైల్‌ ఫోన్లు ఆన్ చేసి అందులో తనిఖీ చేసేందుకు పోలీసులకు ఎలాంటి అధికారాలు లేవని నోటీసుల్లో తెలిపారు. సహేతుకమైన కారణం లేకుండా పోలీసులు వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడం అధికారాన్ని దుర్వినియోగం చేయడమే అని కె. శ్రీనివాస్ నోటీసుల్లో పేర్కొన్నారు.


Also Read: ఇంట్లో ఒంటరిగా ఆరేళ్ల బాలిక.. లోపలికి వచ్చిన సర్పంచ్ భర్త, చివరికి..


రెండ్రోజుల క్రితం సీపీ వివరణ
వాట్సప్‌ను తనిఖీ చేస్తున్న వీడియోలు వైరల్ అవ్వడంపై సీపీ అంజనీ కుమార్ రెండ్రోజుల క్రితం గురువారం స్పందించారు. ఓ అనుమానితుడిని తనిఖీ చేస్తున్న పోలీసులు అతడి ఫోన్‌లోని వాట్సాప్‌ను పరిశీలిస్తున్న వీడియో రెండు రోజులుగా వైరల్‌గా మారింది. ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు భగ్నమంటూ విమర్శలు వచ్చాయి. అనుమానితులను పట్టుకున్నప్పుడు ఆయనకు సంబంధించి ఆద్యంతం తనిఖీ చేయడం తమ విధుల్లో భాగమని సీపీ చెప్పారు. అలా చేయని కారణంగానే ఇటీవల నార్త్‌జోన్‌ పరిధికి చెందిన ఓ కానిస్టేబుల్‌పై నిందితుడు జేబులోని కత్తితో దాడి చేశాడని గుర్తు చేశారు. 


Also Read: కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి సమైక్య రాగం... ఆ విషయంలో కేసీఆర్ కు మద్దతిస్తానని కీలక వ్యాఖ్యలు


మరోవైపు, నగరంలో గత శనివారం మరోసారి డ్రగ్స్ కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఒకే రోజు రెండు చోట్ల డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టయింది. హైదరాబాద్‌ నుంచి ఆస్ట్రేలియాకు పంపించే పార్శిల్‌లో డ్రగ్స్ ఉన్నట్టుగా ఎన్సీబీ అధికారులు గుర్తించారు. ఇందులో ఉన్న 3 కిలోల డ్రగ్స్‌ను పట్టుకున్నారు. చెన్నైకు చెందిన వ్యక్తి హైదరాబాద్‌కు పార్సిల్‌ చేసినట్లు ప్రాథమికంగా నిర్ధరించారు. ఈ మేరకు ఒకర్ని కూడా అరెస్టు చేశారు.


Also Read: Hyderabad Murder: భర్త నిద్రిస్తున్న వేళ ప్రియుడ్ని ఇంటికి పిలిచిన భార్య.. కాసేపట్లోనే ఘోరం


Also Read: ఇల్లు అద్దెకు తీసుకున్నారు, కొన్నాళ్లకి పాడు పనులు స్టార్ట్.. గుట్టు ఇలా బయటికొచ్చింది






ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి