మహిళలు, చిన్నారుల భద్రతకు రక్షణ కల్పించాల్సిన వారే అమానుషంగా ప్రవర్తించిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ గ్రామానికి సర్పంచ్ భర్తపై ఈ ఆరోపణలు వచ్చాయి. అతను ఓ గిరిజన సామాజిక వర్గానికి చెందిన ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లుగా అభియోగం నమోదైంది. దీంతో ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశం అయింది. సదరు సర్పంచ్ భర్త బాలికపై అమానుషంగా ప్రవర్తించాడంటూ నిరసనలు రేగుతున్నాయి. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలంలో చోటు చేసుకుంది.


పోలీసులు, స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఓ ఆరేళ్ల గిరిజన బాలికపై గ్రామ సర్పంచ్‌ భర్త అత్యాచారానికి పాల్పడినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. బాధితురాలైన ఆరేళ్ల బాలిక చెప్పిన వివరాల మేరకు తల్లిదండ్రులు వెళ్లి సదరు నిందితుణ్ని నిలదీయగా.. తిరిగి అతను వారిపైనే దాడికి పాల్పడ్డాడు. అంతేకాక, బాధితులను నిర్భందించినట్లుగా కూడా ఆరోపణలు ఉన్నాయి. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో ఈ ఘటన వెలుగుచూసింది. 


Also Read:  హైదరాబాద్‌లో యువకుడు ఘాతుకం.. యువతి చేతులు, గొంతు కోసి దాడి


ఎల్లారెడ్డి పేట మండలంలోని ఓ గ్రామ సర్పంచ్‌ భర్త, రైతుబంధు సమితి మండల కన్వీనర్‌ ఇంట్లో బడుగు సామాజిక వర్గానికి చెందిన ఓ కుటుంబం అద్దెకు ఉంటోంది. ఈ నెల 28న అద్దెకు ఉంటున్న వారి ఇంట్లో ఎవరూలేని సమయం చూసి ఆరేళ్ల బాలికపై నిందితుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పనులు ముగించుకొని సాయంత్రం ఇంటికి చేరిన తల్లిదండ్రులు, చిన్నారి కాస్త ఇబ్బందిగా ఉండడాన్ని గుర్తించారు. 


Also Read: కత్తి దాడి జరిగిన హైదరాబాద్ రియల్టర్ మృతి.. నిందితుడు అల్లుడే..


బాలికను ప్రశ్నించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు ఇదేంటని సర్పంచి భర్తను శుక్రవారం ఉదయం గట్టిగా అడిగారు. దీంతో ఆయన బెదిరిస్తూ.. తిరిగి ఆ తల్లిదండ్రులపైనే దాడి చేశాడు. అనంతరం ఇంట్లో నిర్బంధించాడు. ఆ తర్వాత బాధితుల ఫిర్యాదు మేరకు ప్రజాప్రతినిధి భర్తపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. నిందితుడ్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని వారు వివరించారు.


Also Read: మాజీ మిస్ తెలంగాణ మరోసారి ఆత్మహత్యాయత్నం... కీసర బ్రిడ్జిపై నుంచి మున్నేరులో దూకిన యువతి


Also Read: పుట్టింటికి వచ్చిన ఇద్దరు యువతులు.. చివరికి చెరువులో మూడు శవాలు, ఏం జరిగిందంటే..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి