Ukraine Crisis Live Updates: ఉక్రెయిన్‌తో చర్చలకు పుతిన్ ఓకే- రష్యా అధ్యక్ష కార్యాలయం ప్రకటన

రెండో రోజు కూడా ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధం చేస్తోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరాన్ని అధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది.

ABP Desam Last Updated: 25 Feb 2022 07:50 PM
చర్చలకు ఓకే

ఉక్రెయిన్ అధికారులతో చర్చలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ అంగీకరించారు. మిన్‌స్క్‌కు బృందాన్ని పంపిస్తామని ప్రకటించింది రష్యా అధ్యక్షుడి కార్యాలయం.

రష్యా కీలక ప్రకటన (Russia Statement)

ఉక్రెయిన్‌తో యుద్ధం జరుగుతోన్న వేళ రష్యా కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్ ఆర్మీ లొంగిపోతే.. తాము చర్చలకు సిద్ధమని ప్రకటించింది. ఈ మేరకు రష్యా విదేశాంగ మంత్రి తెలిపారు.

ఖర్చులు ప్రభుత్వానివే

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారత పౌరులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం విమానాలను ఏర్పాటు చేస్తోంది. టికెట్ ఖర్చులను ప్రభుత్వమే భరించనున్నట్లు సమాచారం.


 






రష్యా ప్రకటన

ఉక్రెయిన్‌పై తాము చేపట్టిన సైనిక దాడి గురించి వివరాలను వెల్లడించింది రష్యా రక్షణ శాఖ



• 243 మంది ఉక్రెయిన్ సైనికులు సరెండర్


• మెరైన్ సైనిక విభాగం సరెండర్


• 118 సైనిక వాహనాలు ధ్వంసం. ఇందులో 11 వాయుసేన స్థావరాలు.13 కమాండ్, సమాచార కేంద్రాలు 300 క్షిపణులు, 36 రాడార్ స్టేషన్లు ఉన్నాయి.


• ఐదు యుద్ధ విమానాలు, ఓ హెలికాప్టర్, 5 డ్రోన్లు కూల్చివేత.


• 18 ట్యాంకులు, 7 రాకెంట్ లాంఛర్లు, 41 సైనిక వాహనాలు, 5 యుద్ధ పడవలు ధ్వంసం.


• చెర్నోబిల్ అణు కేంద్రాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రష్యా రక్షణ శాఖ తెలిపింది.


 


కీవ్‌లోకి రష్యా సేనలు

కీవ్​లో ప్రభుత్వ భవనాలకు సమీపంలో కాల్పుల మోత మోగుతోంది.

కూల్చివేత

 రష్యాకు చెందిన రెండు క్షిపణులు, విమానాన్ని తమ సైన్యం కూల్చివేసినట్లు ఉక్రెయిన్​ తెలిపింది.

చేరువలో రష్యా



కీవ్ నగరానికి కేవలం 3 మైళ్ల దూరంలోనే రష్యా సేనలు ఉన్నట్లు ఆ దేశ సైన్యం వెల్లడించింది.




యూకే విమానాలపై నిషేధం

బ్రిటన్ ఎయిర్‌లైన్స్‌ను తమ విమానాశ్రయాలు, గగనతలంలోకి ప్రవేశించడంపై రష్యా నిషేధం విధించింది. ఉక్రెయిన్‌తో యుద్ధం జరుగుతోన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది.





450 మంది మృతి

రాజధాని కీవ్‌ వెలుపల రష్యా బలగాలను ఉక్రెయిన్ సైన్యం ఎదుర్కొంటోంది. తమ దాడుల్లో 450 మంది రష్యా సైనికులు చనిపోయారని ఉక్రెయిన్‌ రక్షణశాఖ వెల్లడించింది.

Background

ఉక్రెయిన్‌ను అన్ని వైపుల నుంచి రష్యా సేనలు చుట్టుముట్టాయి. ఇప్పటికే ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంలోకి రష్యా బలగాలు చొరబడినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ తెలిపారు. తొలిరోజు యుద్ధంలో 137 మంది వరకు ఉక్రెయిన్‌ సైనికులు మృతి చెందినట్లు అధ్యక్షుడు ప్రకటించారు. స్నేక్ ద్వీపంలో తమకు లొంగేందుకు ససేమిరా అన్న 13 మంది ఉక్రెయిన్ సైనికులను రష్యా బలగాలు హతమార్చాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.






దేశం కోసం







స్నేక్ ఐల్యాండ్‌ను కాపాడేందుకు ఆ ప్రాంతంలో సైనిక శిబిరం ఏర్పాటు చేసింది ఉక్రెయిన్. ఆ శిబిరంలోకి చొరబడిన రష్యా దళాలు.. వారిని ఆయుధాలు విడిచిపెట్టి సరెండర్ కావాలని కోరాయి. అయితే ఆ శిబిరంలో సైనికులు మాత్రం సరెండర్ అయ్యేందుకు ససేమిరా అన్నారు. దీంతో వారిని రష్యా బలగాలు కాల్చి చంపాయి.


హీరో ఆఫ్ ఉక్రెయిన్



దేశం కోసం అమరులైన 13 మంది సైనికులకు 'హీరో ఆఫ్ ఉక్రెయిన్' అవార్డును ప్రకటించారు అధ్యక్షుడు జెలెన్‌స్కీ. ఉక్రెయిన్‌కు 30 మైళ్ల దూరంలో 42 ఎకరాల్లో స్నేక్ ఐల్యాండ్‌ ఉంది. ఉక్రెయిన్ ప్రాదేశిక జలాలకు సమీపంలో ఈ ఐల్యాండ్ ఉంది. బ్లాక్ సీలో ఇది చాలా వ్యూహాత్మక ప్రాంతం. కీవ్ నగరం వైపు రష్యా బలగాలు తరలి వెళ్తున్నాయి.

 

నేేనే టార్గెట్

 

రష్యా మొదటి గురి తానేనని ఉక్రెయిన్ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తర్వాత తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుంటారని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే తాము ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్లే ప్రసక్తే లేదన్నారు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.