Morning Habits to Help Burn Belly Fat : పొట్ట ఎక్కువగా ఉంటే.. కంఫర్టబుల్​గా ఉండలేరు. నచ్చిన డ్రెస్ వేసుకోలేరు. పైగా ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి. ఎంత కష్టపడినా బెల్లీ ఫ్యాట్ తగ్గట్లేదు అనుకునేవారు కొన్ని అలవాట్లను తమ రొటీన్​లో చేర్చుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. వాటిని రెగ్యులర్​గా ఫాలో అవ్వడం వల్ల పొట్ట తగ్గడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలు అందుతాయని చెప్తున్నారు. ఇంతకీ రొటీన్​లో చేర్చుకోవాల్సిన అలవాట్లు ఏంటి? వాటివల్ల బెల్లీ ఫ్యాట్ ఎలా తగ్గుతుంది వంటి విషయాలు ఇప్పుడు చూసేద్దాం. 


సాల్ట్ వాటర్​తో


మీ ఉదయాన్ని ఓ గ్లాసు నీటితో ప్రారంభించాలట. దానిలో కాస్త ఉప్పు కూడా వేసుకుంటే మరీ మంచిదని చెప్తున్నారు. ఇలా రోజూ చేయడం వల్ల మెటబాలీజం పెరుగుతుంది. జీవక్రియ ఎక్కువగా ఉన్నప్పుడు క్యాలరీలు సూపర్​ఫాస్ట్​గా బర్న్ అవుతాయి. దీనివల్ల కొవ్వు తగ్గుతుంది. అంతేకాకుండా జీర్ణక్రియ మెరుగవుతుంది. మిమ్మల్ని హైడ్రేటెడ్​గా ఉంచడంలో హెల్ప్ చేస్తుందట ఈ అలవాటు. 


ప్రోటీన్ బ్రేక్​ఫాస్ట్


బ్రేక్​ఫాస్ట్​ స్కిప్​ చేయడం కాదు.. ఉదయాన్నే హెల్తీ ఫుడ్​ని శరీరానికి అందించాలి. రోజు ప్రారంభమైన తర్వాత శరీరానికిచ్చే మొదటి మీల్ ఎప్పుడూ హెల్తీగా ఉంటే మంచిది. దానికోసం మీరు ప్రోటీన్​ ఎక్కువగా ఉండే బ్రేక్​ఫాస్ట్​ తీసుకోవాలి. గుడ్లు, యోగర్ట్, ప్రోటీన్ షేక్​ వంటివి బెస్ట్ ఆప్షన్. ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఫుడ్ క్రేవింగ్స్ తగ్గుతాయి. అలాగే కండరాలు దృఢంగా మారుతాయి. వయసు ప్రభావం వల్ల మీ కండరశక్తి తగ్గుతుంటే.. దానిని బిల్డ్ చేయడంలో ప్రోటీన్ బాగా హెల్ప్ చేస్తుంది. ఇది శరీరంలో కొవ్వు శాతాన్ని తగ్గించి.. మజిల్​ని బిల్డ్ చేస్తుంది. 


వ్యాయామం


మీకు జిమ్​కి సమయం కుదరడం లేదు అనుకున్నప్పుడు మీ మార్నింగ్​ని ఓ 20 నిమిషాలు ముందుకు తీసుకెళ్లండి. ఇంట్లోనే వ్యాయామం చేస్తే.. శరీరం యాక్టివ్ అవుతుంది. తేలికపాటి వ్యాయామాలు చేసినా.. ఫ్యూచర్​లో మంచి ఫలితాలు చూస్తారు. మెటబాలీజం పెరుగుతుంది. కేలరీలు తగ్గుతాయి. ఫ్యాట్​లాస్ అవుతుంది. 


డైట్ ప్లానింగ్.. 


మీరు తినే ఫుడ్​పై ఎంత ఫోకస్​ పెడితే అంత మంచి ఆరోగ్యం మీ సొంతమవుతుంది. ఏ ఫుడ్​ తింటే మీ హెల్త్​కి మంచిది. వేటిలో పోషకాలు ఉంటాయి. ఏ ఫుడ్స్ తింటే అన్​హెల్తీ ఫుడ్స్​పై క్రేవింగ్స్ తగ్గుతాయి వంటి విషయాలు నోటిస్ చేసి.. దాని ప్రకారం మీ డైట్​ని ఫిక్స్ చేసుకోండి. బ్యాలెన్స్డ్​ డైట్​ ఆరోగ్యానికి మంచిది. శరీరంలోని కొవ్వును తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. మీకు ఈ విషయంలో డౌట్ ఉంటే ఆరోగ్య నిపుణులు లేదా డైటీషియన్​తో మీ అలవాట్లను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి డైట్​ ప్లాన్ చేయించుకోండి. 


జిమ్​కి వెళ్లినా.. వాకింగ్​కి వెళ్లినా.. ఏమి చేసినా మిమ్మల్ని మీరు ఎంత ఎంగేజింగ్​గా ఉంచుకుంటే మీరు అంత త్వరగా పొట్టకొవ్వును తగ్గించుకోగలుగుతారు. హెల్తీగా ఉండగలుగుతారు. మరి ఈ సింపుల్, హెల్తీ అలవాట్లను మీ రొటీన్​లో చేర్చుకుని బెస్ట్ రిజల్ట్స్ మీరే చూడండి. 



Also Read : చికెన్ రైస్ బౌల్ రెసిపీ.. ఫిట్​నెస్, బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్