Murder Case Solved With AI: అది పుదుచ్చేరిలోని ఓ గ్రామం. రెండు కుటుంబాలు పిల్లా పాపలతో హాయిగా ఉంటున్నాయి. ఇద్దరు స్నేహితుడు ఇద్దరు టీచర్లను పెళ్లి చేసుకుని జీవిస్తున్నారు. ఓ రోజు పొద్దున్నే కేరళ నుంచి వచ్చిన స్పెషల్ పోలీస్ టీం వాళ్లను మాటు వేసి పట్టేసుకుంది. వాళ్లు హత్యలు చేసి పారిపోయారని వారి కుటంబసభ్యులకు చెబితే నమ్మలేదు. ఎందుకంటే వాళ్లు అక్కడ పదిహేనేళ్ల నుంచి ఉన్నారని ఎవరికీ ఆపద తలపెట్టలేదని అంటున్నారు. కానీ వారు మర్డర్లు చేసి 19 ఏళ్ల కిందట అని పోలీసులు అసలు కథ చెప్పారు. ఎలా పట్టుకున్నామో కూడా చెప్పేసరికి వారికి మైండ్ బ్లాంక్ అయిపోయింది.
19 ఏళ్ల కిందట యువతితో పాటు ఆమె కవల పిల్లల హత్య
19 ఏళ్ల కిందట కేరళలో రంజనీ అనే మహిళ, ఆమె కవలపిల్లల్ని ఘోరంగా హత్య చేశారు. ఈ హత్య కేరళను కుదిపేసింది. పోలీసులు, సీబీఐ అధికారులు విచారణ జరిపారు. రంజనీ అవివాహిత. ఈ కోణంలో దర్యాప్తు చేసిన పోలీసులు, సీబీఐ అధికారులు చివరికి రంజనీ ప్రియుడు, ఆమె స్నేహితుడు ఈ హత్యలు చేసినట్లుగా తేల్చారు. కానీ వారు పరారయ్యారు. ఇద్దరూ సైన్యంలో పని చేసేవారు. తమను పట్టుకోవడం ఖాయం కావడంతో ఇద్దరూ ఉద్యోగం నుంచి కూడా పరారయ్యారు. అప్పట్లో ఆధార్ కార్డులు, పాన్ కార్డులు లాంటివేమీ లేవు. దాంతో వారెవరో ఎవరికీ తెలియదు. వీరికోసం గాలించని చోట లేదు. అయితే దొరకలేదు. దాంతో కేసును పక్కన పెట్టేశారు.
సంచలనాత్మక కేసుల్లో ఆధునిక పరిజ్ఞానంతో కొత్తగా దర్యాప్తు
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో పోలీసులు సంచలనాత్మక కేసుల్లో పారిపోయిన వారి కోసం కొత్తగా ట్రై చేయడం ప్రారంభించారు. రంజనీ , ఆమె కవల పిల్లల హత్య కేసులో నిందితులుగా ఉన్న వారి ఫోటోలు తీసుకుని ఏఐ పద్దతిలో ఇప్పుడు ఎలా ఉంటారో ఫోటోలు తయారు చేయించారు. వాటిని సోషల్ మీడియాలో ఫిల్టర్ చేశారు. ఓ ఫోటో 90 శాతం మ్యాచ్ కావడంతో వెంటనే వివరాలు ఆరా తీశారు. ఖచ్చితంగా తాము పెట్టుకున్న టార్గెట్ కావడంతో పోలీసులు మిగతా పని పూర్తి చేశారు.
అసలు ఈ నిందితులు ఎవరు..? ఎందుకు హత్యలు చేశారు ?
హత్యలు చేసి 19 ఏళ్ల పాటు కనిపించకుండా పోయి ఇప్పుడు దొరికిన ఇద్దరి పేర్లు అనిల్ , రాజేష్, ఇద్దరూ పఠాన్ కోట్‌లో సైన్యంలో పని చేస్తారు. అనిల్ కు కేరళలోని తన స్వగ్రామంలో రంజనీతో ప్రేమ వ్యవహారం ఉంది. ఈ క్రమంలో ఆమె గర్భవతి అయింది. అయితే ఆమె క్యారెక్టర్ పై అనుమానంతో ఆ గర్భం వద్దని తీయించుకోవాలని అనిల్ ఒత్తిడి చేశాడు. కానీ రంజనీ ఒప్పుకోలేదు. పెళ్లికి రమేష్ అంగీకరించకుండా ఆర్మీకి వెళ్లిపోయాడు. కానీ తర్వాత అయినా ఇబ్బంది అవుతుందని తన స్నేహితుడు రాజేష్ తో కలిసి హత్య చేయాలని ప్లాన్ చేశాడు. ప్లాన్ ప్రకారం రాజేష్ .. అని స్వగ్రామానికి వచ్చి.. అప్పటికే డెలివరీ అయిన రంజనీ, ఆమె కవలపిల్లల్ని చంపేశాడు. ఎలాగైనా పోలీసులు పట్టుకుంటారని చెప్పి పరారయ్యారు.
పుదుచ్చేరిలో వారు ఇద్దరు టీచర్లను చేసుకుని సెటిలయ్యారు. వీరి ఫ్లాష్ బ్యాక్ చెప్పడంతో వారి భార్యలు షాక్‌కు గురయ్యారు.