Kanpur Gangster Celebrates GF  Birthday Near DCP Office: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో డీసీపీ ఆఫీసు ముందు పన్నెండు స్కార్పియోలు విన్యాసాలు చేశాయి. అందులో ఓ యువతి స్టైల్ గా కూర్చుని ఉంది. దేనికీ నంబర్ ప్లేట్స్ లేవు. అరగంట సేపు హంగామా చేసి అ తర్వాత వేరే ప్రాంతానికి వెళ్లాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు వైరల్ గా మారాయి. 


ఈ దృశ్యాలు చూసిన తర్వాత అందరూ ఆ స్కార్పియోలు ఎవరివో ఓ అంచనాకు వచ్చారు. కాన్పూర్‌లో ముఫ్పై ఏళ్ల ఓ గ్యాంగ్ స్టర్ ఉన్నారు. అతనిపై 30కిపైగా తీవ్రమైన కేసులు ఉన్నాయి. అన్ని కేసులు ఉన్నా సరే పోలీసుల్ని చాలెంజ్ చేస్తున్నారు. అతను ఇటీవల ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. అ ఆమ్మాయి ముందు గొప్పలు  పోవడానికి రెచ్చిపోతున్నట్లుగా గుర్తించారు.  






అయితే యూపీలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ముఖ్యంగా ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇలాంటి పిల్ల గ్యాంగ్ స్టర్లు నిక్కర్లు తడుపుకుని పరారయ్యారు. ఎదుకంటే సీనియర్ గ్యాంగస్టర్లందర్నీ ఎన్ కౌంటర్ చేసేశారు. కొంత మంది ఎన్ కౌంటర్ దేశవ్యాప్తంగా సంచలనం అయింది. అయితే నేర సామ్రాజ్యంల తమదైన ముద్ర వేసి రాజకీయ పలుకుబడితో ఎలాగోలా నెట్టుకు రావాలని అనుకునేవారు మాత్రం అక్కడక్కడా ఉన్నారు.                       



Also Read: Indian Coast Guard Helicopter Crash: గుజరాత్‌లోని విమానాశ్రయంలో కుప్పకూలిన కోస్ట్ గార్డ్ హెలికాప్టర్, ముగ్గురు దుర్మరణం




 






Also Read: Aadhaar Card Sim Limit: మీ ఆధార్ నంబర్‌పై ఎన్ని సిమ్ కార్డులు ఉండవచ్చు? - ఎక్కువ ఉంటే ఏం అవుతుంది?