SIM Card Rules: నేటి కాలంలో అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఆధార్ కార్డ్ ఒకటి. ఇది కేవలం ఐడెంటిటీ ప్రూఫ్ మాత్రమే కాదు. సిమ్ కార్డ్‌ని కొనుగోలు చేయడానికి కూడా మీరు ఆధార్ కార్డును వాడవచ్చు. అయితే ఆధార్ కార్డుపై సిమ్ కార్డును కొనుగోలు చేయడానికి పరిమితిని నిర్ణయించారు. మీరు ఈ పరిమితి కంటే ఎక్కువ సిమ్ కార్డ్‌లను కొనుగోలు చేస్తే చట్టపరమైన సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.
ఒక ఆధార్ కార్డ్‌పై ఎన్ని సిమ్ కార్డ్‌లను కొనుగోలు చేయవచ్చు?
భారత ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఒక ఆధార్ కార్డుపై గరిష్టంగా తొమ్మిది సిమ్ కార్డులను కొనుగోలు చేయవచ్చు. అయితే మెషిన్ టు మెషిన్ (M2M) సేవలకు ఈ సంఖ్య 18కి పెరుగుతుంది. ఎం2ఎం సేవలు ప్రత్యేకంగా స్మార్ట్ హోమ్ పరికరాలు, వాహనాలలో ఉపయోగించే ఐవోటీ సిస్టమ్‌ల వంటి పరికరాలను కనెక్ట్ చేయడం కోసం విక్రయిస్తున్నారు.
Also Read: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
మీరు ఎక్కువ సిమ్ కార్డులను కొనుగోలు చేస్తే ఎలాంటి సమస్యలు తలెత్తుతాయి?
మీరు తొమ్మిది కంటే ఎక్కువ సిమ్ కార్డ్‌లను కొనుగోలు చేసినా లేదా సరైన కారణం లేకుండా వాటిని ఉపయోగించినా మీరు ఈ క్రింది సమస్యలను ఎదుర్కోవచ్చు:
సిమ్ కార్డ్ బ్లాక్ కావచ్చు: మీ గుర్తింపును రక్షించడానికి అదనపు సిమ్ కార్డ్‌లు బ్లాక్ చేయవచ్చు.
మోసానికి అవకాశం: మల్టీపుల్ సిమ్ కార్డులు దుర్వినియోగం అయితే సైబర్ మోసం లేదా ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దారితీయవచ్చు. ఇది మిమ్మల్ని బాధ్యులను చేస్తుంది.
చట్టపరమైన చర్య: మీ పేరు మీద రిజిస్టర్ అయిన సిమ్ కార్డ్ ఏదైనా చట్టవిరుద్ధమైన కార్యకలాపానికి ఉపయోగించినట్లయితే మీరు చట్టపరమైన చర్యను ఎదుర్కోవచ్చు.
యూజర్ వెరిఫికేషన్: ట్రాయ్, టెలికమ్యూనికేషన్ల శాఖ సిమ్ కార్డు వినియోగదారులను క్రమం తప్పకుండా చెక్ చేస్తాయి. మీ సిమ్ కార్డ్‌లోని సిమ్‌ల సంఖ్య పరిమితి కంటే ఎక్కువగా ఉన్నట్లు గుర్తించినట్లయితే మీరు నోటీసును అందుకోవచ్చు.
సిమ్ కార్డును ఎలా తనిఖీ చేయాలి?
మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డ్‌లు రిజిస్టర్ అయ్యాయనే సమాచారాన్ని పొందడానికి ప్రభుత్వం TAFCOP (టెలికాం అనలిటిక్స్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్‌మెంట్ అండ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్) పోర్టల్‌ను ప్రారంభించింది.
- TAFCOP వెబ్‌సైట్‌ను సందర్శించండి.
- మీ మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి.
- ఓటీపీ వెరిఫికేషన్ తర్వాత మీ పేరుపై నమోదు అయిన అన్ని సిమ్ కార్డ్‌ల జాబితా కనిపిస్తుంది.
ఆధార్ కార్డ్‌లో పరిమిత సంఖ్యలో సిమ్ కార్డ్‌లను తీసుకోవాలనే నియమం మీ భద్రత కోసం, డిజిటల్ సిస్టమ్‌లో పారదర్శకతను కొనసాగించడం కోసం ప్రారంభించారు. అదనపు సిమ్ కార్డ్‌లను తీసుకోకుండా ఉండండి. మీ సిమ్ కార్డుల జాబితాను ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండండి. ఎందుకంటే ఎవరైనా సైబర్ నేరగాళ్లు మీ పేరు మీద సిమ్ తీసుకుంటే ఆ నేరంలో మీరు బుక్ అయ్యే అవకాశం ఉంది.
Also Read: విమానంలో ఫోన్ ఎందుకు ఫ్లైట్ మోడ్‌లో పెట్టాలి? - పెట్టకపోతే ఏం జరుగుతుంది?