Delete Google Pay Transaction History: గూగుల్ పే మనదేశంలో ఎంతో ఫేమస్ అయిన పేమెంట్ ఆప్షన్. కొన్ని కోట్ల మంది గూగుల్ పే ద్వారా రోజువారీ లావాదేవీలు నిర్వహిస్తున్నారు. అయితే దీని ద్వారా ప్రైవసీ సమస్య కూడా తలెత్తుతోంది. ఎందుకంటే గూగుల్ పేలో ట్రాన్సాక్షన్ హిస్టరీ కూడా స్టోర్ అవుతుంది. కానీ దీన్ని సైలెంట్‌గా డిలీట్ చేసే ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. దానికి రకరకాల పద్ధతులు ఉన్నాయి. వీటిని ఫాలో అయ్యి గూగుల్ పేలో మీరు డిలీట్ చేయాలనుకున్న ట్రాన్సాక్షన్లను సులభంగా డిలీట్ చేయవచ్చు.


గూగుల్ పే ట్రాన్సాక్షన్ హిస్టరీని మొబైల్‌ యాప్ ద్వారా డిలీట్ చేయడం ఎలా?
మొబైల్ అప్లికేషన్ నుండి గూగుల్ పే ట్రాన్సాక్షన్ హిస్టరీని సులభంగా డిలీట్ చేయడానికి ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ ఇవే.


స్టెప్ 1: మీ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్‌పే అప్లికేషన్‌ను ఓపెన్ చేసి ప్రొఫైల్ విభాగంపై క్లిక్ చేయాలి.


స్టెప్ 2: క్రిందికి స్క్రోల్ చేసి సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. ఆపై సెక్యూరిటీ అండ్ ప్రైవసీ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.


స్టెప్ 3: డేటా & పర్సనలైజేషన్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. మిమ్మల్ని గూగుల్ అకౌంట్స్ పేజీకి తీసుకెళ్లే గూగుల్ ఖాతా లింక్‌పై క్లిక్ చేయండి.


స్టెప్ 4: ఇప్పుడు పేమెంట్ ఇన్ఫోలో పేమెంట్స్ అండ్ సబ్‌స్క్రిప్షన్స్‌లోకి వెళ్లాలి. అక్కడ మేనేజ్ ఎక్స్‌పీరియన్స్ ఆప్షన్‌కి వెళ్లాలి.


స్టెప్ 5: ట్రాన్సాక్షన్స్ అండ్ యాక్టివిటీ కింద మీరు గూగుల్ పే ట్రాన్సాక్షన్ల లిస్ట్‌ను కనుగొంటారు.


స్టెప్ 6: అక్కడ ట్రాన్సాక్షన్ పక్కన ఉన్న క్రాస్ బటన్‌ను నొక్కడం ద్వారా వ్యక్తిగత గూగుల్ పే ట్రాన్సాక్షన్ హిస్టరీని డిలీట్ చేయవచ్చు.


స్టెప్ 7: ట్రాన్సాక్షన్ హిస్టరీని ఒకేసారి బల్క్‌గా కూడా డిలీట్ చేయవచ్చు. ట్రాన్సాక్షన్‌కి పైన డిలీట్ ఆప్షన్ కనిపిస్తుంది.


స్టెప్ 8: అక్కడ మీకు కావాల్సిన టైమ్ ఫ్రేమ్‌ని ఎంచుకోండి. మీ గూగుల్ పే అప్లికేషన్ నుంచి కావాల్సిన డేటా డిలీట్ అయిపోతుంది.


డెస్క్‌టాప్ నుంచి గూగుల్ పే ట్రాన్సాక్షన్ హిస్టరీని డిలీట్ చేయడం ఎలా?
మీ డెస్క్‌టాప్ నుండి మీ గూగుల్ పే ట్రాన్సాక్షన్ హిస్టరీని తొలగించడానికి కూడా గూగుల్ మీకు ఆప్షన్‌ను అందిస్తుంది. కింది స్టెప్స్ ఫాలో అవ్వడం ద్వారా దాన్ని డిలీట్ చేయవచ్చు.


స్టెప్ 1: https://myaccount.google.com/కి వెళ్లి, పేమెంట్స్ అండ్ సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్‌ను క్లిక్ చేయండి.


స్టెప్ 2: ట్రాన్సాక్షన్ హిస్టరీని కనుగొనడానికి కిందకి స్క్రోల్ చేయండి. అక్కడ ట్రాన్సాక్షన్ అండ్ యాక్టివిటీ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.


స్టెప్ 3: అక్కడ మీకు గూగుల్ పే లావాదేవీల జాబితా కనిపిస్తుంది. మీరు ప్రతి ట్రాన్సాక్షన్‌ను డిలీట్ చేయవచ్చు.


స్టెప్ 4: డిలీట్ ఆప్షన్‌ని క్లిక్ చేసి, టైమ్ ఫ్రేమ్‌ని ఎంచుకోవడం ద్వారా ట్రాన్సాక్షన్ హిస్టరీని బల్క్‌లో తొలగించవచ్చు.


Also Read: వావ్ అనిపించే వివో ఫోన్ వచ్చేసింది - మార్కెట్లో ఎక్స్200 ఎంట్రీ - ధర ఎంత?


మీ గూగుల్ పే అకౌంట్ డేటాను ఎలా ఎక్స్‌పోర్ట్ చేయాలి?
మీ భవిష్యత్ ఉపయోగం కోసం మీ గూగుల్ పే అకౌంట్ డేటాను సులభంగా ఎక్స్‌పోర్ట్ చేసే ఆప్షన్‌ను కూడా గూగుల్ అందిస్తుంది. గూగుల్ పే ట్రాన్సాక్షన్ హిస్టరీని తొలగించే ముందు బ్యాకప్‌ని ఉంచాలనుకునే వారికి కూడా ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది ఆచరణీయమైనది. కింది స్టెప్స్ ఫాలో అవ్వడం ద్వారా ఎక్స్‌పోర్ట్ చేయవచ్చు.


స్టెప్ 1: మీ మొబైల్ లేదా డెస్క్‌టాప్ బ్రౌజర్‌కి వెళ్లి, https://myaccount.google.com/ వెబ్ సైట్‌కు వెళ్లాలి.


స్టెప్ 2: డేటా & ప్రైవసీ విభాగం కనిపించే 'Download Your Data'ని క్లిక్ చేయండి.


స్టెప్ 3: ఇప్పుడు లిస్ట్ నుంచి గూగుల్ పేని సెలక్ట్ చేసుకుని నెక్స్ట్ స్టెప్‌పై క్లిక్ చేయండి.


స్టెప్ 4: మీ ఆప్షన్ ప్రకారం ట్రాన్స్‌ఫర్ టు ఆప్షన్, ఎక్స్‌పోర్ట్ ఫ్రీక్వెన్సీ, ఫైల్ టైప్, ఫైల్ సైజును ఎంచుకుని క్రియేట్ ఎక్స్‌పోర్ట్‌పై నొక్కండి.


స్టెప్ 5: మీరు మీ ఖాతా నుండి  మొత్తం గూగుల్ పే డేటాను ఎగుమతి చేయవచ్చు.


గూగుల్ పే అకౌంట్‌ను పర్మినెంట్‌గా డిలీట్ చేయడం ఎలా?
మీరు గూగుల్ పే ఖాతాను అవసరం లేకుంటే శాశ్వతంగా డిలీట్ చేయవచ్చు. అలా చేయడానికి ఈ కింది స్టెప్స్‌ను ఫాలో అవ్వండి.


స్టెప్ 1: మీ మొబైల్ లేదా డెస్క్‌టాప్ బ్రౌజర్ నుండి https://myaccount.google.com/ వెబ్‌సైట్‌కి వెళ్లండి.


స్టెప్ 2: డేటా అండ్ ప్రైవసీ ఆప్షన్‌కి వెళ్లి ఆపై గూగుల్ సర్వీసును తొలగించడానికి కిందికి స్క్రోల్ చేయండి.


స్టెప్ 3: అక్కడ మీకు సర్వీసుల జాబితా కనిపిస్తుంది. గూగుల్ పే సర్వీసు కోసం సెర్చ్ చేయండి. దాని పక్కనే ఉన్న డస్ట్‌బిన్ సింబల్‌పై క్లిక్ చేయండి.


స్టెప్ 4: మీకు వార్నింగ్ మెసేజ్ వస్తుంది. ఆన్ స్క్రీన్ సూచనలను అనుసరించండి. మీ గూగుల్ పే అకౌంట్ పర్మినెంట్‌గా డిలీట్ అవుతుంది.



Also Read: 2025 మే నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పని చేయదు - లిస్ట్‌లో ఏయే ఫోన్లు ఉన్నాయి?