Flight Mode: విమానంలో ఫోన్ ఎందుకు ఫ్లైట్ మోడ్‌లో పెట్టాలి? - పెట్టకపోతే ఏం జరుగుతుంది?

Smartphone Flight Mode: విమానంలో ప్రయాణం చేసేటప్పుడు స్మార్ట్ ఫోన్‌ను ఫ్లైట్ మోడ్‌లో ఎందుకు ఉంచాలి? మీకు ఎవరికైనా తెలుసా? పెట్టకపోతే జరిగే ప్రమాదాల గురించి ఎప్పుడైనా విన్నారా?

Continues below advertisement

Flight Mode in airplane: విమానం ఎక్కిన తర్వాత ప్రయాణీకులను తన ఫోన్‌ను ఫ్లైట్ మోడ్‌లో ఉంచాల్సిందిగా అడుగుతారు. ఇలా ఎందుకు చేస్తారని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? వాస్తవానికి విమానం టేకాఫ్ లేదా ల్యాండింగ్ సమయంలో ఫోన్‌ను ఫ్లైట్ మోడ్‌లో ఉంచడానికి పెద్ద కారణం ఉంది. దీని వెనుక ఉన్న కారణాల గురించి ఒక పైలట్ సమాచారం ఇస్తూ, అలా చేయకపోవడం వల్ల పైలట్‌లకు సూచనలను వినడం కష్టమవుతుందని ఇది విమానంలో ఉండే ప్రయాణీకుల ప్రాణాలకు హాని కలిగిస్తుందని చెప్పారు.

Continues below advertisement

పైలట్ ఏం చెప్పాడు?
టిక్‌టాక్‌లో వైరల్ అవుతున్న వీడియోలో ప్రకారం @perchpoint హ్యాండిల్‌తో ఉన్న పైలట్... టవర్‌కి కనెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మొబైల్ ఫోన్‌లు పైలట్ రేడియో కమ్యూనికేషన్‌కు అంతరాయం కలిగిస్తాయని చెప్పారు. అదే సమయంలో అనేక మొబైల్ ఫోన్లు టవర్‌కు కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తే పైలట్ తన రేడియో సెట్‌లోని సూచనలను వినడానికి సమస్యలు కలుగుతాయని అతను చెప్పాడు. ఈ మొబైల్ ఫోన్‌లు రేడియో తరంగాలను విడుదల చేస్తాయి. ఇవి పైలట్ హెడ్‌సెట్‌లోని రేడియో తరంగాలలోకి చొచ్చుకుపోతాయి.

Also Read: వావ్ అనిపించే వివో ఫోన్ వచ్చేసింది - మార్కెట్లో ఎక్స్200 ఎంట్రీ - ధర ఎంత?

ఇలాంటి పరిస్థితి కారణంగానే తాను ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని ఇటీవల జరిగిన ఓ సంఘటనను ఉదాహరణగా చెప్పారు. అతను తన విమానాన్ని తీసుకెళ్లడానికి కంట్రోల్ టవర్‌ను డైరెక్షన్స్ అడుగుతున్నాడు. కాని మొబైల్ ఫోన్ నుంచి వచ్చే రేడియో తరంగాల కారణంగా అతనికి సూచనలు స్పష్టంగా వినబడలేదు. తన చెవిలో వినిపించిన శబ్దాన్ని దోమ చెవిలోకి ప్రవేశించిన శబ్దంతో పోల్చాడు.

భారతదేశంలోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) సూచనల ప్రకారం ప్రయాణీకులు తమ ఫోన్‌లను ఫ్లైట్ మోడ్‌లో ఉంచుకోవాలి. ఈ మార్గదర్శకాల ప్రకారం ప్రయాణీకులు మొబైల్‌తో పాటు ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లతో సహా ప్రతి పోర్టబుల్ ఎలక్ట్రానిక్ పరికరాన్ని ఫ్లైట్ మోడ్‌లో ఉంచాలి. అయితే కొన్ని విమానయాన సంస్థలు తమ విమానం సామర్థ్యం, డీజీసీఏ నుంచి వచ్చే అనుమతిని బట్టి విమానంలో వైఫై సౌకర్యాన్ని అందించవచ్చు.

Also Read: 2025 మే నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పని చేయదు - లిస్ట్‌లో ఏయే ఫోన్లు ఉన్నాయి?

Continues below advertisement