స్వాతంత్య్ర దినోత్సవ వేళ రాజ్‌భవన్‌లో ఏటా తేనీటి విందు (At Home In AP) కార్యక్రమాన్ని ఎట్ హోం పేరుతో నిర్వహించే సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి సీఎంతో పాటు, అధికార విపక్షాలకు చెందిన నేతలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు హాజరవుతుంటారు. అయితే, సోమవారం సాయంత్రం ఆగస్టు 15 సందర్భంగా ఏపీ రాజ్ భవన్ లో జరిగిన ఎట్ హోం మాత్రం ప్రత్యేకత సంతరించుకుంది. ఈ ఎట్ హోంకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ సతీసమేతంగా హాజరయ్యారు. సీఎం జగన్, చంద్రబాబు ఇలా ఒకే కార్యక్రమంలో పాల్గొనడం ఇదే మొదటి సారి. ఈ సందర్భంగా కనీసం మర్యాదపూర్వకంగా అయినా, ఇద్దరు నేతలు మాట్లాడుకుంటారని, లేదంటే ఎదురుపడ్డప్పుడు ముఖంలో చిరునవ్వు నవ్వుకుంటారని అంతా భావించారు. కానీ ఇరువురు నేతలు ఒకే కార్యక్రమంలో ఉన్నా వారు కలిసే సందర్భం తెచ్చుకోలేదు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి 


ఒక్కోసారి చార్మీ ఏడుస్తుంది, నా భార్య వల్లే కొత్త కథలు: పూరీ జగన్నాథ్
చార్మీ.. తెలుగు సినిమా పరిశ్రమలో అడుగు పెట్టి తక్కువ కాలంలోనే హీరోయిన్ గా మంచి పేరు సంపాదించారు. తన అందాలతో కుర్రకారుకు కిక్కెక్కించిన ఈ ముద్దుగుమ్మ ఎంత త్వరగా స్టార్ డమ్ అందుకున్నారో.. అంతే త్వరగా వెండి తెరకు దూరమయ్యారు. హీరోయిన్ గా కనిపించకపోయినా.. మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో కలిసి సినిమా నిర్మాతగా మారిపోయారు. ఇప్పటికే పలు సినిమాలను నిర్మించిన ఈ హాట్ బ్యూటీ.. తాజాగా పూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా పాన్ ఇండియా చిత్రం ‘లైగర్’ను తెరకెక్కించారు. తాజాగా వరంగల్ లో ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా పూరీ కొన్ని ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు.  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి 


అరగంట ఎదురుచూశాం, సీఎం కేసీఆర్ ఎందుకు రాలేదో తెలియదు: తమిళిసై 
At Home: రాష్ట్ర, దేశ వ్యాప్తంగా జెండా పండుగ వైభవంగా జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గోల్కొండ కోట మీద జాతీయ జెండాను ఎగుర  వేశారు. తర్వాత ప్రభుత్వం చేసిన, త్వరలో చేపట్టనున్న కార్యక్రమాలను వివరించారు. అంతకుముందు ప్రగతి భవన్ లో జెండా వందనం చేశారు. సాయంత్రం గవర్నర్ తమిళి సై సౌందర రాజన్, రాజ్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమం నిర్వహించారు. దానికి మాత్రం సీఎం కేసీఆర్ హాజరు కాలేదు. సాయంత్రం 6.55 గంటలకు సీఎం వస్తారని ఆయన కార్యాలయం నుండి సమాచారం వచ్చినా, ఆయన మాత్రం రాలేదని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు.  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి 



Tirumala: శ్రీవారి ఆలయంలో ప్రతి మంగళవారం నాడు నిర్వహించే సేవ, పూజలు ఇవే
తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తుల‌ రద్దీ సాధారణ స్ధితికి చేరుకుంది. ఇక ప్రతి మంగళవారం అష్టదళపాద పద్మరాధన‌ సేవను 108 సువర్ణ పద్మాలతో శ్రీవారిని అర్చించడమే ఈ సేవ విశేషం. సోమవారం 16-08-2022 రోజున 87,692 మంది స్వామి వారి దర్శించుకున్నారు. ఇక స్వామి వారికి 36,832 మంది తలనీలాలు సమర్పించగా, 5.30 కోట్ల రూపాయలు భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించారు. ఇక సర్వదర్శనం భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 30 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండి పోగా, స్వామి వారి సర్వదర్శనంకు 10 గంటల సమయం పడుతుంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనంకు దాదాపు రెండు గంటల సమయం పడుతుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి  

ఈ విమానం రెప్పపాటులో గమ్యానికి చేరుస్తుంది, టికెట్ జస్ట్ రూ.1,645 మాత్రమే!
ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చేందుకు ఎంత టైమ్ పడుతుంది? వాతావరణం బాగుంటే రెండు గంటల్లోనే గమ్యానికి చేరుకోవచ్చు కదా. ఈ రెండు నగరాలకు మధ్య దూరం (ఏరియల్ డిస్టెన్స్) 1,253 కిలోమీటర్లు కాబట్టి అంత టైమ్ పడుతుంది.  అయితే, స్కాట్లాండ్‌లోని ఈ విమానం రెప్పపాటులో గమ్యానికి చేర్చేస్తుందంటే.. వెంటనే మీరు షాకవుతారు. ఆ తర్వాత అదెలా సాధ్యం అని ఆశ్చర్యపోతారు. కనీసం రాకెట్‌లో వెళ్లినా అది అసాధ్యం కదా అని అనుకుంటారు. కానీ మీరు అక్కడే పప్పులో కాలేశారు. గమ్యం అంటే మీరు ఇంకా ఢిల్లీ టు హైదరాబాద్ గురించే ఆలోచిస్తున్నారు. రెప్పపాటులో 1,253 కిలోమీటర్ల దూరంలోని గమ్యానికి చేరడం అసాధ్యం. కాబట్టి, మీరు ఆ విమానం బయల్దేరే ప్రాంతానికి, గమ్యస్థానానికి మధ్య దూరమెంతా? అని ఆలోచించాలి. ఎందుకంటే, ఆ విమానం ప్రపంచంలోనే అతి తక్కువ దూరం ప్రయాణిస్తుంది. మీరు గాలి పీల్చి వదిలేలోపు అది గమ్యస్థానానికి చేర్చేస్తుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి 



Araku Train: పర్యాటకులకు పంద్రాగస్టు కానుక, అరకు రైలుకు నాలుగో గాజు బోగి!
అరకు పర్యటన ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. కొండలు, గుట్టలు, పచ్చని ప్రకృతి సోయగాలు ఎంతో అలరిస్తుంటాయి. విశాఖపట్నం నుంచి 114 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పర్వత ప్రాంతం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో అత్యంత పర్యాటక ఆకర్షణ గల ఏరియాలలో అరకు ఒకటి. అరకు లోయ అందాలను చూసిన పర్యాటకులు ఎవరైనా మంచి అనుభూతి పొందుతారు. చలి కాలంలో అరకు అందాలు రెట్టింపు అవుతాయి. మంచు కురుస్తున్న సమయంలో ఆ ప్రకృతి అందాలను చూస్తే ఎంతో అద్భుతంగా ఉంటుంది. అందుకే ఇక్కడికి డిసెంబర్ నుండి ఫిబ్రవరి మధ్య పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. సాహస క్రీడలు, ట్రెక్కింగ్, కేవింగ్, సైట్ సీయింగ్ ఇలా చాలా పర్యాటక హంగులు ఇక్కడ ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి 



Weather Updates: ఏపీలో మరో 24 గంటలు వర్షాలు - తెలంగాణలో వాతావరణం ఇలా
Rains In Telangana: వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ బలహీనపడింది. అంతకుముందు ఈ వాయుగుండం ఉత్తర ఛత్తీస్ గఢ్ దాని పరిసరాల్లో గంటకు 25 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదిలి మధ్యప్రదేశ్ లో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలు వీస్తాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి 



బంగారం, వెండి కొనాలా? నేటి ధరలు ఇక్కడ తెలుసుకోండి, ప్లాటినం కూడా
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు (Todays Gold Rate)  నిన్నటితో పోలిస్తే నేడు నిలకడగా ఉంది. వెండి ధరలో కూడా నేడు ఎలాంటి మార్పూ లేదు. కానీ, ప్లాటినం ధరలో మార్పు కనిపించింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ (Hyderabad Gold Rate) మార్కెట్‌లో రూ.48,150 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.52,530 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు రూ.64,800 గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి