రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా కేసులు, మరణాలు పెరుగుతోన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా వారం రోజుల పాటు ఉద్యోగులకు పెయిడ్ సెలవులు ఇవ్వాలని కేబినెట్ ప్రతిపాదించింది. దీనికి అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆమోదం తెలిపారు. అంటే అక్టోబర్-30 నుంచి నవంబర్-7 వరకు రష్యాలో ఉద్యోగులకు సెలవులన్నమాట. అయితే ఇందులో నాలుగు రోజులు అధికారిక సెలవులే. మరో మూడు రోజులే అదనంగా ఇస్తోంది ప్రభుత్వం.
వ్యాక్సిన్ తీసుకోవాలి..
కరోనా కట్టడి కోసం అర్హులైన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని పుతిన్ పిలుపునిచ్చారు. వ్యాక్సిన్ తీసుకోవడాన్ని ఓ బాధ్యతగా చూడాలన్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటి కరోనా వ్యాక్సిన్ రష్యానే కనిపెట్టినప్పటికీ అక్కడి పౌరులు వ్యాక్సిన్ వేసుకోవడానికి అంతగా సుముఖంగా లేరు. దీంతో వ్యాక్సినేషన్ నత్త నడకన సాగుతోంది.
భారీగా కేసులు..
రష్యాలో బుధవారం రికార్డు స్థాయిలో 1,028 మరణాలు నమోదయ్యాయి. వైరస్ వ్యాప్తి మొదలైన తొలినాళ్ల నుంచి ఇవే అత్యధికం. గడిచిన 24 గంట్లలో రష్యాలో కొత్తగా 34,074 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత వారం రోజులుగా సగటున రోజుకు 1000 కరోనా మరణాలు నమోదవుతున్నాయి. పలు ప్రాంతాల్లో వైరస్ తీవ్రత అత్యంత ఆందోళనకరంగా ఉంది. దీంతో అధ్యక్షుడు పుతిన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
Also Read: Taliban Crisis: తాలిబన్లా.. నరరూప రాక్షసులా! వాలీబాల్ క్రీడాకారిణి తలనరికి..
Also Read: Priyanka Gandhi Detained: నేను రాష్ట్రంలో తిరగకూడదా? రెస్టారెంట్లో కూర్చోవాలా?: ప్రియాంక గాంధీ
Also Read: Lakhimpur Kheri Case: ఎందుకింత ఆలస్యం..? దీన్నొక అంతులేని కథగా మార్చకండి: సుప్రీం
Also Read: Aryan Khan Bail News: ఆర్యన్ ఖాన్‌కు మళ్లీ షాక్.. బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసిన కోర్టు
Also Read: కుక్కకు రూ.15 కోట్ల ఆస్తి రాసేసిన ప్లేబాయ్ మోడల్, కారణం తెలిస్తే షాకవ్వడం ఖాయం!
Also Read: చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలకు షాకిచ్చిన కేంద్రం .. ఇక అన్నీ చెప్పాల్సిందే..!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి