అఫ్గానిస్థాన్‌లో ఎప్పుడేం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఏ సమయంలో ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని అఫ్గాన్ వాసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. అఫ్గాన్‌ను చేజిక్కించుకున్న తర్వాత తాలిబన్ల మారణహోమం కొనసాగుతూనే ఉంది. 


ఇప్పటికే ప్రజలు నిరసనలు చేస్తున్నా పట్టించుకోకుండా తమ దారి తమదే అన్నట్లు తాలిబన్లు చెలరేగిపోతున్నారు. తాజాగా అఫ్గాన్‌ జూనియర్ మహిళల జాతీయ వాలీబాల్ క్రీడాకారిణి తల నరికి తాలిబన్లు అమానుషంగా చంపేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఆ జట్టు కోచ్ ఓ ప్రముఖ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు. అయితే ఈ దారుణానికి గల కారణాన్ని ఆమె వెల్లడించలేదు. 


ఏం జరిగింది?


అక్టోబర్‌లో మహబజిన్ హకీమి అనే మహిళా క్రీడాకారిణిని తాలిబాన్లు చంపడేమే కాకుండా కిరాతకంగా ఆమె తలను నరికేశారని కోచ్ తెలిపారు. అయితే ఈ విషయం గురించి బయట ప్రపంచానికి తెలియకూడదని తాలిబన్లు ఆమె కుటుంబాన్ని బెదిరించారన్నారు. ఆ భయంతో తాను ఇప్పటి వరకు ఈ విషయం చెప్పలేకపోయినట్లు పేర్కొన్నారు.






కాబూల్ మునిసిపాలిటీ వాలీబాల్ క్లబ్ తరపున హకీమి ఆడేదని పైగా  క్లబ్ స్టార్ ఆటగాళ్లలో ఆమె ఒకరని కోచ్ చెప్పారు. ఆగస్టులో తాలిబన్లు అఫ్గానస్థాన్‌ను పూర్తి నియంత్రణలోకి తీసుకోవడానికి ముందు జట్టులోని ఇద్దరు క్రీడాకారులు మాత్రమే దేశం నుంచి తప్పించుకోగలిగారని కోచ్ తెలిపారు.


భయంభయం..


ప్రస్తుతం వాలీబాల్ జట్టులోని ఆటగాళ్లు ఏ క్షణాన ఏం జరుగుతోందో అనే భయంతో బతుకుతున్నారని అఫ్జలీ వెల్లడించారు. ఈ క్రమంలో చాలా మంది క్రీడాకారులు ఎవరికీ కనిపించకుండా జీవిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.


Also Read: Priyanka Gandhi Detained: నేను రాష్ట్రంలో తిరగకూడదా? రెస్టారెంట్లో కూర్చోవాలా?: ప్రియాంక గాంధీ


Also Read: Lakhimpur Kheri Case: ఎందుకింత ఆలస్యం..? దీన్నొక అంతులేని కథగా మార్చకండి: సుప్రీం


Also Read: Aryan Khan Bail News: ఆర్యన్ ఖాన్‌కు మళ్లీ షాక్.. బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసిన కోర్టు


Also Read: కుక్కకు రూ.15 కోట్ల ఆస్తి రాసేసిన ప్లేబాయ్ మోడల్, కారణం తెలిస్తే షాకవ్వడం ఖాయం!


Also Read: చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలకు షాకిచ్చిన కేంద్రం .. ఇక అన్నీ చెప్పాల్సిందే..!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి