ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మధ్య రాజకీయ ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుతున్నాయి. ఒకరికొకరు పోటీగా రాజకీయ కార్యక్రమాలు చేపడుతున్నారు.  "ప్రభుత్వ టెర్రరిజంపై పోరు" అంటూ చంద్రబాబు 36 గంటల దీక్ష చేయాలని నిర్ణయించగా.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా జనాగ్రహ దీక్షలు చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. గురువారం, శుక్రవారం రెండు రోజుల పాటు జనాగ్రహ దీక్షలు చేపట్టాలని సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 


Also Read : అంతా చంద్రబాబే చేశారు.. వైసీపీ మంత్రులు, నేతల ఘాటు విమర్శలు!


 తెలుగుదేశం పార్టీ నాయకులు  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై చేస్తున్న బూతుల వ్యాఖ్యలకు నిరసనగా నియోజకవర్గ స్థాయిలో రెండు రోజుల పాటు దీక్షలు, నిరసనలు చేయాలని సూచించారు. టీడీపీ నేతలు చేస్తున్న బూతు వ్యాఖ్యలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలనే డిమాండ్‌తో జనాగ్రహ దీక్షలు చేయాలన్నారు. తెలుగుదేశం పార్టీ బుధవారం బంద్‌కు పిలుపునివ్వడంతో పోటీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నిరసన ప్రదర్శనలు కూడా చేపట్టారు. 


Also Read : చేతకాని దద్దమ్మలే తిడతారు.. తిడితే ఇక ముందు అదే రియాక్షన్ వస్తుందని సజ్జల హెచ్చరిక !


గంజాయి స్మగ్లింగ్ ఆరోపణలను చేసిన టీడీపీ నేత నక్కా ఆనందబాబుకు నర్సీపట్నం సీఐ ప్రత్యేకంగా గుంటూరు వచ్చి అర్థరాత్రి నోటీసులు ఇవ్వడంతో వివాదం ప్రారంభమయింది. ఆయన నోటీసులు తీసుకోవడానికి నిరాకరించడం..  పోలీసులు అర్థరాత్రిళ్లు టీడీపీ నేతల ఇళ్లపైకి వెళ్తున్న విషయంపై టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ప్రెస్‌మీట్‌లో తీవ్ర విమర్శలు చేయడంతో వివాదం ప్రారంభమయింది. పట్టాభిరామ్ ముఖ్యమంత్రిని దారుణంగా దూషించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆయన ఇంటిపైనా.. పార్టీ కార్యాలయంపైనా దాడులు చేయడంతో  వివాదం తీవ్రమయింది. 


Also Read : " ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు " - 36 గంటల పాటు చంద్రబాబు దీక్ష !


ఇప్పుడు రెండు పార్టీలు పోటాపోటీగా తప్పు మీదంటే మీదని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ రాజకీయ కార్యక్రమాలు చేపడుతున్నారు. దీక్షలు ధర్నాలు చేస్తున్నారు. చంద్రబాబు శనివారం అమిత్ షాను కలిసి రాష్ట్రంలో పరిస్థితులపై ఫిర్యాదు చేయనున్నారు. 


Also Read : నిన్నటి వరకూ బూతులు .. ఇప్పుడు దాడులు ! ఏపీ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారాయా ?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి