Gita Gopinath Update: ఐఎంఎఫ్‌కు గీతా గోపినాథ్ గుడ్‌బై.. తిరిగి హార్వర్డ్‌ వర్సిటీకే!

ABP Desam Updated at: 20 Oct 2021 08:32 PM (IST)
Edited By: Murali Krishna

ఐఎంఎఫ్ చీఫ్ ఎకనామిస్ట్‌ బాధ్యతల నుంచి గీతా గోపినాథ్ తప్పుకోనున్నారు. ఆమె మళ్లీ హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్లనున్నారు.

ఐఎంఎఫ్‌కు గీతా గుడ్‌బై

NEXT PREV

అంత‌ర్జాతీయ ద్ర‌వ్య నిధి (ఐఎంఎఫ్‌)లో చీఫ్ ఎకాన‌మిస్ట్‌గా ఉన్న గీతా గోపినాథ్ ఆ బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. మూడేళ్ల పాటు ఇంట‌ర్నేష‌న‌ల్ మానిట‌రీ ఫండ్‌కు ఆమె సేవలందించారు. ఆమె మ‌ళ్లీ హార్వ‌ర్డ్ యూనివ‌ర్సిటీ ఆర్థిక‌శాస్త్రం శాఖ‌లో చేర‌నున్నారు.






తొలి మహిళ..


ఏడాది పాటు హార్వ‌ర్డ్ యూనివ‌ర్సిటీకి సెలవు పెట్టివ‌చ్చిన గీతా గోపినాథ్‌.. ఐఎంఎఫ్‌లో మూడేళ్ల పాటు ప‌నిచేశారు. ఐఎంఎఫ్‌లో ప‌రిశోధ‌నా విభాగానికి ఆమె అధిప‌తిగా ఉన్నారు. చీఫ్ ఎక‌నామిస్ట్ పోస్టులో ప‌ని చేసిన తొలి మ‌హిళగా గీతా గోపినాథ్ రికార్డులకెక్కారు.



సంస్థకు గీత అందించిన సేవలు చిరస్మరణీయం. ఆమె అంకిత భావంతో విధులు నిర్వహిస్తున్నారు. సంస్థపై ఆమె ఎంతో ప్రభావం చూపారు. పలు కార్యక్రమాల్లో కీలకంగా వ్యవహరించారు.                                -   క్రిస్టలినా జార్జీవా, ఐఎంఎఫ్ మేనేజింగ్ డైర‌క్ట‌ర్  


వ‌ర‌ల్డ్ ఎక‌నామిక్ ఔట్‌లుక్ నివేదిక‌లు, జీడీపీ అంచ‌నాల నివేదిక‌లు ఆమె ఆధ్వర్యంలోనే త‌యార‌య్యేవి. అమెరికా, భార‌త్‌లో పౌర‌స‌త్వం ఉన్న గీతా గోపినాథ్‌.. 2018 అక్టోబ‌ర్‌లో ఐఎంఎఫ్ చీఫ్ ఎకాన‌మిస్ట్‌గా నియ‌మితుల‌య్యారు.


Also Read: Priyanka Gandhi Detained: నేను రాష్ట్రంలో తిరగకూడదా? రెస్టారెంట్లో కూర్చోవాలా?: ప్రియాంక గాంధీ


Also Read: Lakhimpur Kheri Case: ఎందుకింత ఆలస్యం..? దీన్నొక అంతులేని కథగా మార్చకండి: సుప్రీం


Also Read: Aryan Khan Bail News: ఆర్యన్ ఖాన్‌కు మళ్లీ షాక్.. బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసిన కోర్టు


Also Read: కుక్కకు రూ.15 కోట్ల ఆస్తి రాసేసిన ప్లేబాయ్ మోడల్, కారణం తెలిస్తే షాకవ్వడం ఖాయం!


Also Read: చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలకు షాకిచ్చిన కేంద్రం .. ఇక అన్నీ చెప్పాల్సిందే..!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at: 20 Oct 2021 08:28 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.