లఖింపుర్ ఖేరీ ఘటనపై సుప్రీం కోర్టు విచారణ జరిపింది. అయితే ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్ట్ రామన్ కశ్యప్, మరో మృతుడు శ్యామ్ సుందర్ మరణాలపై దర్యాప్తు వివరాలను వెల్లడించాలని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఘటనకు సంబంధించిన వీడియోల నివేదికలను త్వరగా ఇవ్వాలని ఫోరెన్సిక్ విభాగాన్ని కోరింది.






లఖింపుర్ ఘటన సాక్షులకు రక్షణ కల్పించాలని యూపీ సర్కార్‌ను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఈ విచారణ చేపట్టింది.


యూపీ ప్రభుత్వం తరపున హాజరైన సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే.. 68 మంది సాక్షుల్లో 30 మంది వాంగ్మూలాన్ని రికార్డు చేసినట్లు తెలిపారు. అందులో 23 మంది తమను తాము ప్రత్యక్ష సాక్షులుగా చెప్పుకున్నారని వెల్లడించారు. వీరు కారుతో పాటు, అందులో ఉన్న వ్యక్తులను చూశారని వివరించారు.


మిగిలిన సాక్షుల వాంగ్మూలాలను జుడీషియల్ మెజిస్ట్రేట్ల ముందు రికార్డ్ చేయాలని హరీశ్ సాల్వేను కోర్టు ఆదేశించింది. అయితే ప్రత్యక్ష సాక్షులు 23 మందే ఉండటంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. వందల మంది రైతులు ఘటన జరిగిన ప్రాంతంలో ఉంటే కేవలం 23 మంది ప్రత్యక్ష సాక్షులే ఉండటం ఏంటని ప్రశ్నించింది. అనంతరం కేసును నవంబర్ 8కి వాయిదా వేసింది.


Also Read: Compensation: కొవిడ్ మృతుల కుటుంబాలకు రూ.50 వేల పరిహారం.. దరఖాస్తు చేసుకున్నాక ఎప్పటిలోగా వస్తాయంటే..


Also Read: Study: కరోనా వ్యాక్సిన్ ఇతర వ్యాధుల మరణాల రేటును కూడా ప్రభావితం చేస్తుందా?


Also Read: గడ్డం పెంచేవారు కుక్కలు కంటే హానికరమట.. ఫీల్ కావద్దు, ఎందుకో తెలుసుకోండి!


Also Read: ఈ ఊరిలో ప్రజలంతా గాల్లో తాడు మీదే నడుస్తారు.. ఇదో భిన్నమైన గ్రామం


Also Read: కుక్కకు రూ.15 కోట్ల ఆస్తి రాసేసిన ప్లేబాయ్ మోడల్, కారణం తెలిస్తే షాకవ్వడం ఖాయం!


Also Read: ఛీ.. యాక్.. ఈ ఆహారాన్ని లొట్టలేసుకుని మరీ తింటారట, ఇది ఏమిటో తెలుసా?


Also Read: కూల్ డ్రింక్ తాగిన కొన్ని గంటల్లోనే వ్యక్తి మృతి.. ఇతడిలా మీరు చేయొద్దు!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి