IPL 2024 Auction Live Updates: ముగిసిన ఐపీఎల్ మినీ వేలం, 72 మంది ఆటగాళ్లు వెరీ లక్కీ

IPL 2024 Auction Live Updates: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ 2024 కోసం ప్లేయర్ల వేలానికి సర్వం సిద్ధమైంది. దీనికి సంబంధించిన లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ABP Desam Last Updated: 19 Dec 2023 10:25 PM
IPL 2014 Auction: మినీ వేలంలో అమ్ముడైన 72 మంది ఆటగాళ్లు

మంగళవారం నిర్వహించిన IPL 2024 మినీ వేలం ముగిసింది. ఈ వేలంలో మొత్తం 72 మంది ఆటగాళ్లను ఆయా ఫ్రాంచైజీలు దక్కించుకున్నాయి. ఇందులో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ అత్యంత ఖరీదైనదిగా నిలిచాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ రూ.24.75 కోట్లకు స్టార్క్‌ను కొనుగోలు చేసింది. పాట్ కమిన్స్ రెండవ అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. 20.50 కోట్లకు కమిన్స్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. వేలంలో అత్యంత ఖరీదైన భారత ఆటగాడిగా హర్షల్ పటేల్ నిలిచాడు. పంజాబ్ కింగ్స్ అతడిని రూ.11.75 కోట్లకు కొనుగోలు చేసింది. యూపీ తరఫున ఆడిన సమీర్ రిజ్వీ అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ప్లేయర్. సమీర్‌ను చెన్నై సూపర్ కింగ్స్ 8.40 కోట్లకు కొనుగోలు చేసింది.

మహ్మద్ నబీని ముంబై, షాయ్ హోప్‌ను ఢిల్లీ కొనుగోలు

వెస్టిండీస్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ షాయ్ హోప్ కూడా చివరి రౌండ్‌లో సోల్డ్ అయ్యాడు. హోప్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.75 లక్షలకు కొనుగోలు చేసింది. కాగా, ముంబై ఇండియన్స్ ఆఫ్ఘనిస్తాన్ ఆల్ రౌండర్‌ మహ్మద్ నబీని రూ. 1.5 కోట్లకు కొనుగోలు చేసింది.

2 కోట్లకు ముజీబ్ ఉర్ రెహ్మాన్

ఆఫ్ఘనిస్థాన్ మిస్టరీ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ చివరి రౌండ్‌లో రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది. గత సీజన్ లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన అర్షద్ ఖాన్ ను లక్నో సూపర్ జెయింట్స్ రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది.

IPL 2024 Auction LIVE: 8 కోట్లకు రిలే రోసోను పంజాబ్ కొనుగోలు చేసింది

ఆఖరి రౌండ్ వేలంలో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ రిలే రోసోను పంజాబ్ కింగ్స్ రూ.8 కోట్లకు కొనుగోలు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఈ ఆటగాడిని తీసుకునేందుకు వేలంలో పాల్గొంది. కానీ చివరికి పంజాబ్ రోసోను దక్కించుకుంది. 

నువాన్ తుషారకు ముంబై ఇండియన్స్ రూ.4.80 కోట్లు 

శ్రీలంక ఫాస్ట్ బౌలర్ నువాన్ తుషారాపై ముంబై ఇండియన్స్ భారీ బిడ్డింగ్ వేసింది. రూ.50 లక్షల బేస్ ధరతో వేలంలోకి వచ్చిన ఈ ఆటగాడిని రూ.4.80 కోట్ల భారీ మొత్తానికి ముంబై కొనుగోలు చేసింది. ముంబై అన్‌క్యాప్డ్ ఆల్ రౌండర్ నమన్ ధీర్‌ను కూడా రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది.

రూ.5 కోట్లకు జే రిచర్డ్ సన్ ను సొంతం చేసుకున్న ఢిల్లీ

విదేశీ ఆటగాడు జే రిచర్డ్‌సన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 5 కోట్లకు కొనుగోలు చేసింది.

రూ.10 కోట్లు పలికిన స్పెన్సర్ జాన్సన్

వేలంలో ఆస్ట్రేలియా లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ స్పెన్సర్ జాన్సన్ రూ.10 కోట్ల ధర పలికాడు. జాన్సన్ బేస్ ప్రైస్ రూ.50 లక్షలు. అతని కోసం ఢిల్లీ క్యాపిటల్స్ తో పోటీ పడి గుజరాత్ టైటాన్స్ మధ్య భారీ ధరకు సొంతం చేసుకుంది.

RCBకి ఇంగ్లండ్‌ ఆటగాడు టామ్‌ కరన్‌

ఇంగ్లండ్ బౌలింగ్ ఆల్ రౌండర్ టామ్ కరన్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ. 1 కోటి 50 లక్షలకు కొనుగోలు చేసింది. సామ్ కరన్ సోదరుడే ఈ టామ్ కరన్. టామ్ ఇంతకు ముందు IPLలో ఆడాడు.

రూ.7.40 కోట్లకు షారుక్ ఖాన్‌ను గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది

దేశవాళీ క్రికెటర్ షారుక్ ఖాన్ ను గుజరాత్ టైటాన్స్ భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. తమిళనాడుకు చెందిన ఈ స్టార్ క్రికెటర్ ఇప్పటి వరకు పంజాబ్ కింగ్స్‌లో ఆడాడు. అయితే ఈసారి పంజాబ్ అతడిని విడుదల చేయగా.. రూ.7.40 కోట్లకు షారుక్ ను గుజరాత్ తీసుకుంది

రూ.8.40 కోట్లకు సమీర్ రిజ్వీని తీసుకున్న చెన్నై సూపర్ కింగ్స్

ఐపీఎల్ 2024 వేలంలో 20 ఏళ్ల సమీర్ రిజ్వీ కోటీశ్వరుడయ్యాడు. రూ.8.40 కోట్లకు సమీర్ రిజ్వీని చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. సమీర్ డాషింగ్ బ్యాటర్ గా పేరుంది. గుజరాత్ టైటాన్స్, చెన్నై ఫ్రాంచైజీలు ఈ యువకుడి కోసం పోటీ పడ్డాయి. చివరికి చెన్నై ఫ్రాంచైజీ అతడ్ని దక్కించుకుంది.

IPL 2024 Auction LIVE: రూ. 5.80 కోట్లకు శుభమ్ దూబేని తీసుకున్న రాజస్థాన్

IPL 2024 Auction LIVE: దేశవాళీ క్రికెట్‌లో విదర్భ తరఫున ఆడుతున్న మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ శుభమ్ దూబేపై రాజస్థాన్ రాయల్స్ భారీగా వెచ్చించింది. అన్ క్యాప్డ్ ప్లేయర్ అయిన శుభమ్ దూబేను 5 కోట్ల 80 లక్షలకు రాజస్థాన్ కొనుగోలు చేసింది.

విరామం తర్వాత మళ్లీ వేలం ప్రారంభం

శివమ్ దూబేపై వేలంతో తదుపరి రౌండ్ వేలం ప్రారంభమైంది. విరామం తర్వాత తొలి బిడ్‌ భారత ఆటగాడు శివమ్‌ దూబే బేస్ ధర రూ.20 లక్షలు.

షమ్సీతో పాటు ముజీబ్‌ పై ఆసక్తి చూపని ఫ్రాంచైజీలు

దక్షిణాఫ్రికా బౌలర్ తబ్రేజ్ షమ్సీ ప్రాథమిక ధర రూ.50 లక్షలతో వేలంలోకి వచ్చాడు. కానీ అతడ్ని ఎవరూ తీసుకోలేదు. న్యూజిలాండ్ బౌలర్ ఇష్ సోధి కూడా అన్ సోల్డ్ గా మిగిలాడు. అతని బేస్ ధర రూ.75 లక్షలు. ఆఫ్ఘనిస్థాన్ బౌలర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ బేస్ ప్రైస్ రూ.2 కోట్లు. స్పిన్నర్ ముజీబ్ ను సైతం ఏ ఫ్రాంచైజీ తీసుకోలేదు..

అన్ సోల్డ్ గా ఇంగ్లండ్‌ ప్లేయర్ ఆదిల్ రషీద్

ఆఫ్ఘనిస్థాన్ బౌలర్ వకార్ సలాంఖేల్ బేస్ ధర రూ.50 లక్షలు. అతడిపై ఎవరూ వేలం వేయలేదు. దాంతో సలాంఖేల్ అమ్ముడుపోలేదు. ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ కూడా అమ్ముడుపోలేదు. అతని బేస్ ధర రూ.2 కోట్లు. వెస్టిండీస్ ఆటగాడు అకిల్ హుస్సేన్ కూడా అన్ సోల్డ్ గా మిగిలాడు.

IPL Auction 2024 Live: మధుశంకను కొనుగోలు చేసిన ముంబై

శ్రీలంక బౌలర్ దిల్షాన్ మధుశంక బేస్ ప్రైస్ రూ.50 లక్షలతో వేలంలోకి వచ్చాడు. లక్నో అతనిపైనే తొలి బిడ్‌ వేసింది. ఆ తర్వాత ముంబై రంగంలోకి దిగింది. చివరకు మధుశంకను ముంబై రూ.4.60 కోట్లకు కొనుగోలు చేసింది.

IPL Auction 2024 Live: జయదేవ్ ఉనద్కత్‌ ను సొంతం చేసుకున్న హైదరాబాద్

IPL Auction 2024 Live: భారత ఆటగాడు జయదేవ్ ఉనద్కత్ బేస్ ధర రూ.50 లక్షలు. కాగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ అతడిపై తొలి బిడ్‌ వేసింది. ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్‌ వేలంలోకి వచ్చింది. అయితే చివరకు రూ.1.60 కోట్లకు జయదేవ్‌ను సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది.

లక్నో సూపర్ జెయింట్‌కు శివమ్ మావి

భారత ఫాస్ట్ బౌలర్ శివమ్ మావి బేస్ ప్రైస్ రూ.50 లక్షలు. కాగా 6.40 కోట్లకు శివమ్ మావిని లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది. శివమ్ మావి కోసం రూ.6.20 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వేలం వేసింది. చివరికి లక్నో సొంతం చేసుకుంది.

Most Expensive Player IPL History: ఐపీఎల్ లో ఖరీదైన ఆటగాడిగా మిచెల్ స్టార్క్, రూ.24.75 కోట్ల రికార్డు ధర

ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా ఆస్ట్రేలియాకు చెందిన మిచెల్ స్టార్క్ నిలిచాడు. కోల్ కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ ను రూ.24.75 కోట్ల రికార్డు ధరకు కొనుగోలు చేసింది. మిచెల్ స్టార్క్ కోసం  రూ.24.75 కోట్లు వెచ్చించి వేలంలో స్టార్ పేసర్ ను కేకేఆర్ సొంతం చేసుకుంది. 

IPL Auction 2024 Live: గుజరాత్ టైటాన్స్ రూ.5.80 కోట్లకు ఉమేష్ యాదవ్ ను కొనుగోలు

భారత బౌలర్ ఉమేష్ యాదవ్ బేస్ ధర రూ.2 కోట్లు కాగా, అతడిని కొనుగోలు చేసేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ మధ్య పోటీ ఏర్పడింది. ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్‌ కూడా రంగంలోకి దిగింది. కానీ చివరకు గుజరాత్ టైటాన్స్ రూ.5.80 కోట్లకు ఉమేష్ యాదవ్‌ను కొనుగోలు చేసింది.

IPL Auction 2024 Live: అల్జారీ జోసెప్‌ను రూ.11.50 కోట్లకు కొనుగోలు చేసిన ఆర్సీబీ

విండీస్ ఆటగాడు అల్జారీ జోసెఫ్ బేస్ ప్రైజ్ రూ.కోటి. అతడిని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ.1.11 కోట్లకు కొనుగోలు చేసింది. జోసెఫ్‌ను కొనుగోలు చేయడానికి లక్నో సూపర్ జెయింట్స్ పోటీ పడింది. కానీ చివరికి ఆర్సీబీ గెలిచింది.

చేతన్ సకారియాను కొనుగోలు చేసిన కోల్‌కతా- అమ్ముడు పోని పెర్గూసన్

భారత ఫాస్ట్ బౌలర్ చేతన్ సకారియా బేస్ ప్రైజ్ రూ.50 లక్షలు. అతడిని కోల్‌కతా నైట్‌రైడర్స్ బేస్ ప్రైస్‌కు కొనుగోలు చేసింది. న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ బేస్ ప్రైజ్ రూ.2 కోట్లు. అతన్ని కొనుగోలు చేసేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదు. ఫెర్గూసన్ అమ్ముడుపోలేదు.

IPL Auction 2024 Live: బేస్ ప్రైస్‌కే అమ్ముడుపోయిన కేఎస్ భరత్

భారత వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ కేఎస్ భరత్ బేస్ ప్రైజ్ రూ.50 లక్షలు. అతడిని కోల్‌కతా నైట్రైడర్స్ కొనుగోలు చేసింది.

IPL Auction 2024 Live: బేస్ ధరకే అమ్ముడుపోయిన దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ ట్రిస్టన్ స్టబ్స్

దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ ట్రిస్టన్ స్టబ్స్ బేస్ ప్రైస్‌ రూ.50 లక్షలు. అదే ధరకు అతడిని ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది.

IPL Auction 2024 Live: అమ్ముడుపోని ఇంగ్లాండ్ కీపర్ ఫిలిప్ సాల్ట్ 

IPL Auction 2024 Live: అన్ సోల్డ్ ప్లేయర్ గా ఫిలిప్ సాల్ట్ 
బిడ్డింగ్ తరువాత రౌండ్ ప్రారంభమైంది. ఇంగ్లండ్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఫిలిప్ సాల్ట్‌పై బిడ్డింగ్ జరిగింది. అతని బేస్ ధర రూ.1.50 కోట్లు కాగా, ఆ ధరకు సైతం అతడ్ని ఎవరూ కోనుగోలు చేయలేదు. 

IPL Auction 2024 Live: ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్ కు ఫ్రాంచైజీలు షాక్

స్టార్ ఆటగాళ్లలో అయితే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ కు ఫ్రాంచైజీలు షాకిచ్చాయి. ఏ ఒక్క ఫ్రాంకైజీ స్మిత్ ను తీసుకోకపోవడంతో అన్ సోల్డ్ ప్లేయర్ గా నిలిచాడు. 

IPL Auction 2024 Live: ఇప్పటివరకు అమ్ముడుపోని నలుగురు ఆటగాళ్లు

ఇప్పటి వరకు జరిగిన వేలాన్నిగమనిస్తే నలుగురు ఆటగాళ్లు అమ్ముడుపోలేదు. ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ అమ్ముడుపోలేదు. అతనితో పాటు మనీష్ పాండే, కరుణ్ నాయర్ మరియు రిలే రోసోను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. 

IPL Auction 2024 Live: చెన్నై, హైదరాబాద్ చెరో ముగ్గురు ఆటగాళ్లను కొనుగోలు చేశాయి

ఇప్పటి వరకు జరిగిన వేలంలో చూస్తే చెన్నై ముగ్గురు ఆటగాళ్లను కొనుగోలు చేసింది. డారిల్ మిచెల్ ను రూ.14 కోట్లకు కొనుగోలు చేశారు. రచ్చన్ రవీంద్రను రూ.1.80 కోట్లకు కొనుగోలు చేశారు. శార్దూల్ ఠాకూర్‌ను రూ.4 కోట్లకు కొనుగోలు చేశారు. 
హైదరాబాద్ ముగ్గురు ఆటగాళ్లను కొనుగోలు చేసింది. పాట్ కమిన్‌ను రూ.20.50 కోట్లకు కొనుగోలు చేశారు. ట్రావిస్ హెడ్‌ను రూ.6.80 కోట్లకు కొనుగోలు చేశారు. వనిందు హసరంగను రూ.1.50 కోట్లకు కొనుగోలు చేశారు. క్రిస్ వోక్స్, హర్షల్ పటేల్‌ను పంజాబ్ రూ.11.75 కోట్లకు కొనుగోలు చేశారు. రోవ్ మన్ పావెల్‌ను రాజస్థాన్ దక్కించుకుంది. హ్యారీ బ్రూక్ ను ఢిల్లీ , గెరాల్డ్ కోయిట్జీని ముంబై కొనుగోలు చేశాయి.

IPL Auction 2024 Live: క్రిస్ వోక్స్‌ను రూ.4.20 కోట్లకు కొనుగోలు చేసిన పంజాబ్ 

ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ క్రిస్ వోక్స్ బేస్ ప్రైజ్ రూ.2 కోట్లు. కోల్‌కతా నైట్రైడర్స్ తొలి బిడ్ దాఖలు చేసింది. కానీ చివరికి పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. క్రిస్ వోక్స్‌ను పంజాబ్ రూ.4.20 కోట్లకు కొనుగోలు చేసింది.

IPL Auction 2024 Live: మిచెల్‌ను రూ.14 కోట్లకు కొనుగోలు చేసిన సీఎస్కే

న్యూజిలాండ్ ఆల్ రౌండర్ డారిల్ మిచెల్ బేస్ ప్రైస్ కోటి రూపాయలు. ఇతనిపై ఢిల్లీ క్యాపిటల్స్ తొలి బిడ్ వేసింది. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ వేలం మొదలైంది. చివరికి చెన్నై సూపర్ కింగ్స్ మిచెల్ ను కొనుగోలు చేసింది. మిచెల్‌ను సీఎస్కే రూ.14 కోట్లకు కొనుగోలు చేసింది.

IPL Auction 2024 Live: హర్షల్ పటేల్‌ను పంజాబ్ కింగ్స్ రూ.11.75 కోట్లకు కొనుగోలు చేసింది

భారత ఆటగాడు హర్షల్ పటేల్ కనీస ధర రూ.2 కోట్లు. ఇతనిపై గుజరాత్ టైటాన్స్ తొలి బిడ్ వేసింది. గుజరాత్ తర్వాత పంజాబ్ కింగ్స్ బరిలోకి దిగింది. గుజరాత్, పంజాబ్ జట్ల మధ్య పోటీ చివరి వరకు కొనసాగింది. ఆ తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ వేలంపాటలోకి వచ్చింది. కానీ చివరికి పంజాబ్ కింగ్స్ గెలిచింది. హర్షల్ పటేల్ ను పంజాబ్ రూ.11.75 కోట్లకు కొనుగోలు చేసింది.

 గెరాల్డ్ కొయిట్జీని కొనుగోలు చేసిన ముంబై

దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ గెరాల్డ్ కొయిట్జీ బేస్ ప్రైజ్ రూ.2 కోట్లు. అతడిని ముంబై ఇండియన్స్ రూ.5 కోట్లకు కొనుగోలు చేసింది. 

ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా ప్యాట్ కమిన్స్

ఆస్ట్రేలియా ఆటగాడు ప్యాట్ కమిన్స్ బేస్ ప్రైస్ రూ.2 కోట్లు. కమిన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ తొలి బిడ్ వేసింది. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ రూ.4.80 కోట్ల వరకు పాడింది. ఆ తర్వాత ఆర్సీబీ బరిలోకి దిగింది. 7.60 కోట్ల వరకు చెన్నై వేలంలో ఉంది. ఆ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ జోరు కొనసాగింది. 20.50 కోట్లకు కొనుగోలు చేసింది.

IPL Auction 2024 Live: శ్రీలంక ఆటగాడు వానిందు హసరంగను కొనుగోలు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 

శ్రీలంక మిస్టరీ స్పిన్నర్ వనిందు హసరంగను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.1.5 కోట్లకు కొనుగోలు చేసింది. హైదరాబాద్ మినహా మరే జట్టు కూడా హసరంగ కోసం పోటీ పడలేదు. 

IPL Auction 2024 Live: రచిన్ రవీంద్రను కొనుగోలు చేసిన చెన్నై సూపర్ కింగ్స్

50 లక్షల బేస్ ప్రైస్ ఉన్న రచిన్ రవీంద్రను చెన్నై సూపర్ కింగ్స్ రూ.1.80 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ న్యూజిలాండ్ ఆల్ రౌండర్ ఆటగాడు 2023 ప్రపంచకప్ లో అద్భుతంగా రాణించాడు.

శార్దూల్ ఠాకూర్‌కు రూ.4 కోట్లు

భారత స్టార్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ను చెన్నై సూపర్ కింగ్స్ రూ.4 కోట్లకు కొనుగోలు చేసింది. శార్దూల్ బేస్ ప్రైస్ రూ.2 కోట్లు. అఫ్గానిస్థాన్ ఆల్రౌండర్ అజ్మతుల్లా ఉమర్జాయ్ రూ.50 లక్షలకు అమ్ముడుపోయాడు. అతడిని గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది.

అమ్ముడుపోని మనీశ్ పాండే, కరుణ్ నాయర్‌ 

భారత ఆటగాళ్లు కరుణ్ నాయర్, మనీష్‌ పాండే అమ్ముడుపోలేదు. కరుణ్‌ నాయర్‌ బేస్ ప్రైస్ రూ.50 లక్షలు. మనీష్ పాండే బేస్ ప్రైస్ రూ.50 లక్షలు. 

ప్రపంచకప్ ఫైనల్లో సెంచరీ చేసిన హెడ్‌ను కొనుగోలు చేసిన హైదరాబాద్

ఆస్ట్రేలియా ఆటగాడు ట్రావిస్ హెడ్ బేస్ ప్రైస్ రూ.2 కోట్లు. సన్ రైజర్స్ హైదరాబాద్ అగ్రస్థానంలో నిలవగా చెన్నై సూపర్ కింగ్స్ రెండో స్థానంలో నిలిచింది. సీఎస్కే రూ.6.60 కోట్లకు తుది బిడ్ దాఖలు చేసింది. కానీ ఆ తర్వాత అతడిని సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. హెడ్ ను హైదరాబాద్ రూ.6.80 కోట్లకు కొనుగోలు చేసింది.

బేస్‌ ప్రైస్ కంటే రెట్టిపు ధరకు హ్యారీ బ్రూక్ ను కొనుగోలు చేసిన ఢిల్లీ

హ్యారీ బ్రూక్‌ను రూ.4 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. అతని బేస్ ప్రైస్ రూ.2 కోట్లు. రాజస్థాన్ రాయల్స్  బ్రూక్‌ను కొనుగోలు చేయాలని చూసింది. చివరకు ఢిల్లీ దక్కించుకుంది. 

అమ్ముడుపోని దక్షిణాఫ్రికా ఆటగాడు రూసో

దక్షిణాఫ్రికా బ్యాట్స్ మన్ రిలీ రూసో అమ్ముడుపోలేదు. అతని బేస్ ప్రైజ్ రూ.2 కోట్లు. 

రోవ్‌మన్ పావెల్‌ను రూ.7.40 కోట్లకు కొనుగోలు చేసిన రాజస్థాన్


ఐపీఎల్ వేలం కోసం తొలి బిడ్‌లో వెస్టిండీస్ ఆటగాడు రోవ్‌మన్ పావెల్‌ను రాజస్థాన్‌ కొనుగోలు చేసింది. బేస్ ప్రైస్ కంటే 7 రెట్లు ఎక్కువకు కొనుగోలు చేసింది. రూ.7.40 కోట్లకు కొనుగోలు చేసింది. అతని బేస్ ప్రైస్ కోటి రూపాయలు.

 తొలి బిడ్ దక్కించుకున్న రోవ్మన్ పావెల్

తొలి సెట్లో బ్యాట్స్‌మెన్‌ను బరిలోకి దింపారు. మొదటి బిడ్ రోవ్మన్ పావెల్‌పై ఉంది. అతని బేస్ ప్రైస్ కోటి రూపాయలు.

ఐపీఎల్ వేలం ప్రారంభం

ఐపీఎల్ 2024 వేలం ప్రారంభమైంది. ఈ సభకు అరుణ్ కుమార్ ధుమాల్ ను ఆహ్వానించారు. అన్ని ఫ్రాంచైజీల నుంచి ప్రజలు కోకాకోలా ఎరీనాకు చేరుకున్నారు. మరికొద్ది నిమిషాల్లో తొలి వేలం జరగనుంది.

కాసేపట్లో ఐపీఎల్ వేలం ప్రారంభం

మరికాసేపట్లో ఐపీఎల్ 2024 వేలం ప్రారంభం కానుంది. తొలి సెట్లో హ్యారీ బ్రూక్, ట్రావిస్ హెడ్, కరుణ్ నాయర్, మనీష్ పాండే, రోవ్మన్ పావెల్, రిలీ రోసౌ, స్టీవ్ స్మిత్ ఉన్నారు. బ్రూక్, హెడ్, స్మిత్, రుస్సోల బేస్ ప్రైస్ రూ.2 కోట్లు.

వేలంలో 333 మంది ఆటగాళ్లు

ఐపీఎల్ 2024 వేలంలో 333 మంది ఆటగాళ్లు పాల్గొంటున్నారు. ఇందులో 214 మంది భారతీయులు, 119 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. వేలంలో గరిష్టంగా 77 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయవచ్చు. 262.95 కోట్లు ఖర్చు చేయనున్నారు.

భారత్ వెలుపల తొలిసారి ఐపీఎల్ వేలం


ఈసారి వేలం దుబాయ్‌లో జరుగుతోంది. భారత్ వెలుపల ఐపీఎల్ వేలం నిర్వహించడం ఇదే తొలిసారి.

10 జట్లు 77 స్లాట్లు- అదృష్టం ఎవరిని వరించనుందీ?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 వేలానికి టైం దగ్గర పడింది. దుబాయ్‌లో జరగబోయే వేలంలో మొత్తం 10 జట్లు 77 స్లాట్లు కోసం పోటీ పడుతున్నాయి. ఇందులో 30 స్లాట్‌లలో విదేశీ ఆటగాళ్లకు కేటాయించారు. ఈ వేలంలో 333 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వేలం జాబితాలో పలువురు పెద్ద ఆటగాళ్లు కూడా ఉన్నారు. శార్దూల్ ఠాకూర్, వనిందు హసరంగ, మిచెల్ స్టార్క్, ఆదిల్ రషీద్, లాకీ ఫెర్గూసన్ పై ఫోకస్‌ పెట్టాయి జట్లు. 

Background

IPL 2024 Auction Live Streaming: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ 2024 కోసం ప్లేయర్ల వేలానికి సర్వం సిద్ధమైంది. ఈ వేలంలో దేశ, విదేశీ ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈరోజు ( డిసెంబర్‌ 19)న దుబాయ్‌ వేదికగా మధ్యాహ్నం ఒంటి గంటకు ఐపీఎల్‌ వేలం ప్రారంభం కానుంది. 

 

ఐపీఎల్ 2024 సీజన్ వచ్చే ఏడాది మార్చిలో ప్రారంభం కానున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. మార్చి రెండో వారం నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. త్వరలోనే ఐపీఎల్-17 షెడ్యూల్‌పై అధికారిక ప్రకటన రానుంది. అయితే ఇప్పటికే ఆటగాళ్ల రిలీజ్‌, రిటెన్షన్‌ ప్రక్రియ పూర్తయింది. డిసెంబర్ 19న ఐపీఎల్‌ మినీ వేలం జరగనుంది. పది ప్రాంఛైజీలు కొంతమంది ఆటగాళ్లను వదులుకోగా ఏర్పడిన ఖాళీలను భర్తీ చేసేందుకు 1166 మంది ఆటగాళ్లు పేర్లను నమోదు చేసుకోగా... వేలంలో మొత్తం 333 మంది అమ్మకానికి ఉంటారు. 77 ఖాళీలు ఉండగా.... ఈ ఖాళీలను భర్తీ చేసేందుకు 333 మంది పోటీ పడుతున్నారు.

 

ఐపీఎల్‌ వేలంలో మొత్తం 1166 మంది ఆటగాళ్లు పేర్లు నమోదు చేసుకోగా..ఐపీఎల్‌ పాలకవర్గం మొత్తం ఈ జాబితాను పది ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలకు అందించింది. ఆటగాళ్లపై ఫ్రాంఛైజీల ఆసక్తి ఆధారంగా జాబితాను 333కు కుదించింది. ఇందులో 214 మంది భారతీయులు, 119 మంది విదేశీయులు, అసోసియేట్‌ దేశాల నుంచి ఇద్దరు ఉన్నారు. హర్షల్‌ పటేల్‌, శార్దూల్‌ ఠాకూర్‌, ఉమేశ్‌ యాదవ్‌ కనీస ధర రూ.2 కోట్లు ఉన్న ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు. రెండేళ్ల కింద జరిగిన వేలంలో హర్షల్‌ రూ.10.75 కోట్లకు అమ్ముడుపోయాడు.

 

వేలంలో ఖర్చు పెట్టడానికి ఫ్రాంఛైజీల వద్ద మొత్తం రూ.262.95 కోట్లు ఉన్నాయి. మొత్తం 77 మంది నుంచి గరిష్టంగా 30 మంది విదేశీ క్రికెటర్లను జట్లు కొనుక్కోవచ్చు. ఈసారి వేలంలో స్టార్‌ ఆటగాళ్లు చాలామంది ఉన్నారు. వన్డే ప్రపంచకప్‌ ఆస్ట్రేలియా గెలవడంలో కీలకపాత్ర పోషించిన ట్రావిస్‌ హెడ్‌, కమిన్స్‌, స్టార్క్‌, హాజిల్‌వుడ్‌కు మంచి ధర పలికే అవకాశం ఉంది. ఈ ఆసీస్‌ త్రయం 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి ప్రవేశిస్తున్నారు. న్యూజిలాండ్‌ స్టార్‌ రచిన్‌ రవీంద్ర తన కనీస ధరను రూ.50 లక్షలుగా నిర్ణయించుకున్నాడు.

 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎందరో యువకుల ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసింది. 2008లో ప్రారంభమైన ఈ లీగ్ విజయవంతంగా.. 16 సీజన్‌లు పూర్తి చేసుకుంది. అనతి కాలంలోనే రిచ్చెస్ట్ క్రికెట్‌ లీగ్‌గా నిలిచింది. ఈ లీగ్‌లో ఒక్కసారైనా ఆడితే చాలు అని అనుకునే ఆటగాళ్లు ఎంతో మంది ఉన్నారు. ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్‌ సైతం ఈ లీగ్‌లో ఆడేందుకు ఆసక్తి కనబరిచాడు. ఎట్టకేలకు గత సీజన్‌లో అరంగేట్రం చేశాడు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లోనూ ఈ తరహా లీగ్‌లు జరుగుతాయి. కానీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ స్థాయే వేరు. దేశంలో IPL 2024 నిర్వహణకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఐపీఎల్ 2024 సీజన్ వచ్చే ఏడాది మార్చిలో ప్రారంభం కానున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఐపీఎల్ 2024 మార్చి రెండో వారం నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. త్వరలోనే ఐపీఎల్-17 షెడ్యూల్‌పై అధికారిక ప్రకటన రానుంది.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.