విక్టరీ వెంకటేష్ (Venkatesh)... వివాదాలకు దూరంగా ఉండే హీరో. ఎటువంటి కాంట్రవర్సీలకు ఆయన చోటివ్వడు. కామ్ గోయింగ్ పర్సన్. అందుకే ఆ హీరో, ఈ హీరో అని లేకుండా అందరి హీరోల ఫ్యాన్స్ ఆయనని ఇష్టపడతారు. అయితే వెంకటేష్ ఫస్ట్ టైమ్ తన దర్శకుడితో గొడవ పెట్టుకున్నాడు. అది కూడా తన సినిమా కోసమేనంటే ఆశ్చర్యంగా ఉంది కదా. అయితే గొడవ అనగానే ఇదేదో తిట్టేసుకుని, కొట్టేసుకునే టైప్ గొడవ కాదు. సినిమాలో పాట పాడే విషయంలో చిన్న డిస్కర్షన్ అంతే. ప్రజంట్ వెంకటేష్ చేస్తున్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఈ సినిమాకు దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ దర్శకుడితోనే వెంకీ చిన్న డిస్కర్షన్ పెట్టి, పట్టుబట్టి, పాట పాడే కోరికను నెరవేర్చుకున్నారని తెలిసింది. అసలు విషయం ఏమిటంటే..
‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు రెండు పాటలు వచ్చాయి. ఈ రెండూ కూడా చార్ట్‌బస్టర్స్‌గా నిలిచి, ఇప్పటికీ ట్రెండింగ్‌లోనే ఉన్నాయి. ఇప్పుడు మూడో సాంగ్‌కు సంబంధించి మేకర్స్ ఓ అప్డేట్ వదిలారు. ఈ సాంగ్‌ని స్వయంగా వెంకటేష్ అడిగి మరీ పాడారట. ఇంతకు ముందు ‘గురు’ సినిమాలో ఆయన ‘జింగిడి జింగిడి’ అనే పాట పాడిన విషయం తెలిసిందే. అదే.. వెంకీ సినీ కెరీర్‌లో ఫస్ట్ టైమ్ పాట పాడిన చిత్రం. ఇప్పుడు మరోసారి ఆయన పాట పాడుతున్నారట. అదీ కూడా దర్శకుడు అనిల్ రావిపూడి వేరొక బాలీవుడ్ సింగర్‌ని అనుకున్న ప్లేస్‌లో.. పట్టుబట్టి మరీ పాట పాడారట. ఈ విషయం స్వయంగా చిత్రయూనిట్టే తెలపడం విశేషం.
Also Read: బేబీ జాన్ రివ్యూ: కీర్తి సురేష్ ఫస్ట్ హిందీ సినిమా - దళపతి విజయ్ 'తెరి' బాలీవుడ్ రీమేక్ ఎలా ఉందంటే?
‘సంక్రాంతి’ స్పెషల్‌గా ఉండే ఈ సాంగ్‌లో వెంకీ పాడిన ట్రాక్ అద్భుతంగా వచ్చిందని, ఆయన కెరీర్‌లో మరో ‘జింగిడి జింగిడి’ అవుతుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. అందుకే దర్శకుడిని అడిగి, ఒప్పించి మరీ వెంకీ ఈ పాట పాడారని తెలుస్తుంది. ఈ పాట విషయంలో వెంకీ ఉత్సాహాన్ని చూసిన దర్శకుడు అనిల్ రావిపూడి కూడా కాదనలేక పోయారట. అలా వెంకీ మరోసారి సింగర్ అవతార్‌లో కనిపించబోతున్నారు. అన్నట్లుగా వెంకీ పాట పాడుతున్న ఫొటోలను కూడా యూనిట్ విడుదల చేసింది. ఇప్పటికే వచ్చిన రెండు పాటలు బ్లాక్‌బస్టర్ ఆదరణను రాబట్టుకోవడంతో.. ఇప్పుడు రాబోయే ఈ సంక్రాంతి స్పెషల్ సాంగ్‌పై మరింతగా క్యూరియాసిటీ పెరుగుతోంది. ఈ హై ఎనర్జీ పాటకు భాను మాస్టర్ కొరియోగ్రాఫర్ అందిస్తుండగా.. ప్రస్తుతం RFCలో వేసిన ఫెస్టివల్ సెట్‌లో చిత్రీకరణ జరుపుతున్నారని తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలో వెంకీ పాట పాడుతున్నట్లుగా తెలుపుతూ.. బిహైండ్ వీడియోని సైతం విడుదల చేయగా.. దర్శకుడు అనిల్ రావిపూడి, హీరో వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి, నిర్మాత శిరీష్, సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో ఈ ఫెస్టివల్ ట్రాక్ డెవలప్మెంట్‌ని రివీల్ చేశారు. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇందులో వెంకటేష్ ఎక్స్ పోలీసు ఆఫీసర్‌గా నటిస్తుండగా.. ఆయన భార్యగా ఐశ్వర్య రాజేష్, ఎక్స్ లవర్‌గా మీనాక్షి చౌదరి కనిపించనున్నారు.
Also Read: 'మ్యాక్స్' రివ్యూ: మ్యాగ్జిమమ్ మాస్ యాక్షన్‌తో అదరగొట్టిన కిచ్చా సుదీప్ - మరి సినిమా హిట్టా? ఫట్టా?