Chiranjeevi: చిరంజీవిని మాయ చేసిన పీఆర్వో... పాత వాళ్ళను పీకేసి రామ్ చరణ్ దగ్గర వ్యక్తికి బాధ్యతలు

Chiranjeevi PR Team: మెగాస్టార్ చిరంజీవి టీంలో మేజర్ చేంజెస్ జరిగాయి. పాత పీఆర్వోలను పంపించేశారని సమాచారం అందుతోంది. ఇప్పుడు రామ్ చరణ్ దగ్గర  వ్యక్తికి బాధ్యతలు అప్పగించారు.

Continues below advertisement

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కోటరీలో ఏం జరుగుతోంది? గత కొన్ని ఏళ్లుగా తన మేనేజింగ్, పిఆర్ఓ వ్యవహారాలను చూస్తున్న ఇద్దరు వ్యక్తులను ఆయన ఎందుకు పంపించేశారు? స్వతహాగా సౌమ్యుడు అయిన మెగా కాంపౌండ్ వాళ్ళిద్దరి మీద ఎందుకు కోపంగా ఉంది? అనేది ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.

Continues below advertisement

మేనేజర్, పిఆర్ఓ... ఇద్దరినీ మార్చేసిన చిరు!
చిరంజీవి దగ్గర గత కొన్ని సంవత్సరాలుగా జీకే మోహన్ అనే వ్యక్తి పని చేస్తున్నారు. పర్సనల్ మేనేజర్ అని టాక్. అటు సినిమా, ఇటు టీవీ ఇండస్ట్రీలో ఆయన చాలా పాపులర్. కింగ్ అక్కినేని నాగార్జున కుటుంబంతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. 

శ్రీకాంత్ కుమారుడు రోషన్ నటించిన 'నిర్మలా కాన్వెంట్' గుర్తుందా? నాగార్జున అతిధి పాత్రలో నటించిన ఆ చిత్రానికి జి నాగ‌ కోటేశ్వరరావు దర్శకుడు. ఆయన జీకే మోహన్ తండ్రి. తనకు నమ్మిన బంటు అయినటువంటి బాబీ అనే వ్యక్తిని పిఆర్ఒగా పెట్టారు జీకే మోహన్. ఇప్పుడు వాళ్లిద్దరినీ బాధ్యతల నుంచి తొలగించారు చిరు.

ఫైనాన్షియల్ ఫ్రాడ్... ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్?
జీకే మోహన్, బాబీలను తొలగించడానికి ప్రధాన కారణం ఫైనాన్షియల్ ఫ్రాడ్ అని ఫిల్మ్ నగర్ గుసగుస. పిఆర్ఒ పనులు, ఇంకా మెగాస్టార్ డాక్యుమెంటరీ పేరుతో ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్టు కొందరు చెవులు కొరుక్కుంటున్నారు. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్‌తో ఫ్రెండ్లీ ఎఫైర్ లాంటిది ఏదో ఉందని కూడా ఫిల్మ్ నగర్ జనాలు ఆఫ్ ది రికార్డ్ కామెంట్స్ చేస్తున్నారట. 

చిరంజీవి దగ్గరకు రామ్ చరణ్ పిఆర్ఒ అండ్ టీం!
చిరంజీవి పిఆర్ఒ, మీడియా రిలేషన్ బాధ్యతలు అనీ ఇప్పుడు ఫలానా వ్యక్తి చూసుకుంటారని క్రిస్మస్ మర్నాడు, డిసెంబర్ 26వ తేదీన టాలీవుడ్ మీడియాకు సమాచారం వచ్చింది. అదీ చిరంజీవి అభిమానులతో నిత్యం టచ్‌లో ఉండే వ్యక్తి, చిరంజీవి ఐ అండ్ బ్లండ్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్ వ్యవహారాలు చూసే స్వామి నాయుడు నుంచి మెసేజ్ వచ్చింది. ఎందుకీ మార్పు? అని ఆరా తీస్తే అసలు విషయం బయటకు వచ్చింది.

Also Read'మ్యాక్స్' రివ్యూ: మ్యాగ్జిమమ్ మాస్ యాక్షన్‌తో అదరగొట్టిన కిచ్చా సుదీప్ - మరి సినిమా హిట్టా? ఫట్టా?

చిరు తనయుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) దగ్గర కొన్ని రోజుల క్రితం పిఆర్ఓగా ఓ వ్యక్తి చేరారు. ఇప్పుడు చిరు పిఆర్ఓ బాధ్యతలు సైతం ఆయనకు అప్పగించారు. గతంలో చరణ్ 'ఆరెంజ్' సినిమాకు వర్క్ పిఆర్ఓగా చేయడంతో పాటు నిహారిక కొణిదెలకు సైతం ఆయన వర్క్ చేస్తున్నారు. చిరు సామాన్యంగా టీం ఛేంజ్ చేయడానికి ఇష్టపడరు. అటువంటిది రీసెంట్ ఛేంజ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. ఇకపై చిరు, చరణ్ సినిమాలతో పాటు వ్యక్తిగత పిఆర్ఓగా ఆయన వర్క్ చేస్తారని టాక్. 

Also Readబేబీ జాన్ రివ్యూ: కీర్తి సురేష్ ఫస్ట్ హిందీ సినిమా - దళపతి విజయ్ 'తెరి' బాలీవుడ్ రీమేక్ ఎలా ఉందంటే?

Continues below advertisement