Director Sukumar Considering Quitting Cinema : పుష్ప 2 సినిమాను నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్‌కు తీసుకెళ్లిన స్టార్ డైరక్టర్ సుకుమార్ తాజాగా సెన్సేషనల్ కామెంట్లు చేశారు. ఓ పక్క పుష్ప 2 థియేటర్లలో తన మేనియాను కొనసాగిస్తుంటే.. మరొపక్క సుకుమార్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అసలు సుకుమార్‌కి ఏమైంది? సినిమాలకు నిజంగానే దూరం కావాలనుకుంటున్నాడా?
యూఎస్‌లో జరిగిన గేమ్ చేంజర్ ఈవెంట్‌కి డైరక్టర్ సుకుమార్ గెస్ట్‌గా వెళ్లారు. అయితే ధోప్ అంటే వదిలేయడమని.. యాంకర్ సుమ అందరినీ ప్రశ్నలు అడిగింది. దీనిలో భాగంగా సుకుమార్‌ను కూడా సుమ మీరు ధోప్ అనే పదంతో ఒకటి వదిలేయాలనుకుంటే ఏమి వదిలేస్తారంటూ ప్రశ్నించింది. అస్సలు ఎవరూ ఊహించని ఆన్సర్నిచ్చి సుకుమార్ అందరినీ షాక్‌కు గురిచేశాడు. సినిమాను వదిలేస్తానంటూ జవాబు ఇవ్వడంతో పక్కనే ఉన్న రామ్ చరణ్ కూడా షాకయ్యాడు.
ఈ ప్రశ్న అడిగిన సుమ కూడా షాకై.. ఈ క్వశ్చన్ క్యాన్సిల్ క్యాన్సిల్ అంటూ చెప్పింది. రామ్ చరణ్ కూడా సుకుమార్ నుంచి మైక్ తీసుకుని.. కొన్ని సంవత్సరాలుగా ఇలా చెప్పే భయపెట్టిస్తున్నారు అందరినీ.. అదేమి జరగదు అంటూ చెప్పారు. అయితే సుకుమార్ మాత్రం దీనిని సీరియస్‌గానే చెప్పినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే పుష్ప 2 కమర్షియల్‌గా భారీ విజయాన్ని అందుకున్నా.. టీమ్ అంతా దానిని సెలబ్రేట్ చేసుకోలేకపోతుంది.
కొద్దిరోజులుగా సంధ్య థియేటర్ విషయంపై పుష్ప 2 టీమ్ నెగిటివిటీని మోస్తుంది. ఈ విషయం సుకుమార్‌ని కూడా బాగా డిస్టర్బ్ చేసినట్లుందని కొందరు నెటిజన్లు చెప్తున్నారు. అయితే మరికొందరు పుష్ప 2లోని కొన్ని సీన్లపై సుకుమార్ నిరాశకు గురయ్యాడని.. అందుకే సినిమాలు మానేయాలనుకుంటున్నారని నచ్చిన స్టోరీలు రాసుకుంటున్నారు. కానీ సంధ్య థియేటర్ ఘటన మాత్రం టీమ్ మొత్తంపై గట్టిగానే ఇంపాక్ట్ చూపిస్తుంది.
పుష్ప 2 హీరో అల్లు అర్జున్ అరెస్ట్, కోర్టు కేసులు.. సుకుమార్ సినిమాను వదిలేస్తాను అనడం, రష్మికపై నెగిటివ్ ట్రోలింగ్.. ఇలా టీమ్‌పై ఎన్నో అంశాలు ప్రభావితం చూపిస్తున్నాయి. క్రియేటివ్ డైరక్టర్ అయినా సుకుమార్ సినిమాలు వదిలేస్తానని చెప్పడమే దీనికి నిదర్శనం. రాజమౌళి స్థాయిలో సుకుమార్‌ను నేషనల్ మీడియా సైతం పొగిడేస్తుంటే.. ఆయన మాత్రం ఈ విషయాలకే సినిమాలకు దూరమైపోవడమేంటని సినిమా అభిమానులు ఫీల్ అవుతున్నారు.
ఈ ఇన్సిడెంట్ తర్వాత అయినా సుకుమార్ ట్రోమా నుంచి బయటకు వచ్చి సినిమాలు చేస్తాడో లేదో అంటూ సోషల్ మీడియాలో చర్చ గట్టిగానే సాగుతోంది. మరోవైపు అల్లు అర్జున్ కేస్ కూడా రోజు రోజుకు సీరియస్ అవుతోంది. ఇదిలా ఉండగా.. సంధ్యా ధియేటర్ ఘటన తర్వాత ఇండస్ట్రీ పెద్దలు వెళ్లి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. పలు అంశాలపై సమావేశంలో చర్చించారు. కానీ.. తెలంగాణలో ఇకపై బెనిఫిట్స్ షోలు ఉండవు, టికెట్ల రేట్లు పెరగవంటూ రేవంత్ రెడ్డి తేల్చి చెప్పేశారు. అంతేకాకుండా సినీ ఇండస్ట్రీ అంతా డ్రగ్స్ అవగాహన కార్యక్రమాలు చేయాలని ఆయన సూచించారు.