ఇద్దరి మధ్య చిగురించిన ప్రేమ చివరకు పెళ్లికి దారి తీసింది. ఇంట్లో పెద్దలు ఒప్పుకోకపోవడంతో చేసేది లేక వారిద్దరూ ఇళ్లలో నుంచి పారిపోయి మరీ పెళ్లి చేసుకున్నారు. అనంతరం వారి వారి ఇళ్లకు దూరంగా కాపురం కూడా పెట్టారు. ఇందులో విచిత్రం ఏముంది.. చాలా చోట్ల జరిగే ఘటనలే ఇవీ.. అంటారా! ఇందులో ట్విస్ట్ ఏంటంటే.. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట యువతి యువకుడు కాదు. యువతి మరో యువతి. ఇలా ఇద్దరు అమ్మాయిలు పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న ఘటన రాజస్థాన్‌లోని చురు జిల్లాలో చోటు చేసుకుంది.


పోలీసులు, స్థానిక వార్తా పత్రికలు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇద్దరు అమ్మాయిల మధ్య పరిచయం ప్రేమకు దారి తీసింది. వారిద్దరూ ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. ఈ సంఘటన రాజస్థాన్‌ చురు జిల్లాలోని రతన్‌గఢ్‌ ప్రాంతంలో జరిగింది. హర్యానాలోని జింద్‌ అనే ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల యువతి రాజస్థాన్‌ రతన్‌గఢ్‌లోని తన సోదరి అత్తారింటికి తొలిసారిగా ఏడాది క్రితం వెళ్లింది. అక్కడ ఆమెకు తన సోదరి ఆడపడుచు(18)ను తొలిసారిగా చూసింది. వెంటనే వారిద్దరి మధ్య మంచి స్నేహం కుదిరింది. క్రమంగా అది ఇద్దరి మధ్య ప్రేమగా మారిపోవడానికి ఎక్కువ కాలం పట్టలేదు. 


Also Read: Prakasam: ఈ భార్యాభర్తలు అన్నాచెల్లెళ్లుగా మారిపోయారు.. వామ్మో, వీరి ప్లాన్‌ తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే..!


అనంతరం వీరి సంగతి తెలిసిన ఇరువురి కుటుంబ సభ్యులు వాళ్లు ఇద్దరూ కలుసుకోకుండా చేశారు. ఒకరినొకరు కలవ వద్దని కఠిన ఆంక్షలు విధించారు. ఈ క్రమంలో ఒకరినొకరు వదిలి ఉండలేని వారిద్దరూ గతేడాది నవంబరులో రతన్‌గఢ్‌కు చెందిన యువతి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది. హర్యానాలోని అదంపుర్‌ మండీకి చేరుకుని తన ప్రియురాలిని కలుసుకుంది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి హర్యానాలోని ఫతేహ్‌బాద్‌లో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత హర్యానాలోనే జింద్‌ అనే నగరంలో ఇల్లు అద్దెకు తీసుకొని గత రెండు నెలలుగా కలిసి ఉంటున్నారు. 


ఈలోపు రతన్‌గఢ్‌‌లోని యువతి తండ్రి తన కూతురు కనిపించటం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు జనవరి 12న ఆ ఇద్దరు యువతుల ఆచూకీ గుర్తించారు. పెళ్లి రద్దు చేసుకొని ఇద్దరూ విడిపోవాలని, తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని కుటుంబ సభ్యులు, పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. కానీ, ఆ యువతులు తాము జంటగా ఉండే నిర్ణయానికే కట్టుబడి ఉంటామని తెగేసి చెప్పేశారు. ఎంత చెప్పినా వినకపోతుండడంతో పోలీసులు కూడా చేసేదేమీ లేక వారిని తిరిగి పంపేశారు.


Also Read: Bandi Sanjay : ఫ్రంట్ లేదు టెంట్ లేదు.. ఏ క్షణమైనా కేసీఆర్ జైలుకు వెళ్తారన్న బండి సంజయ్ !


Also Read: Hyderabad: ఎర్రగడ్డ సంతలో కత్తులు కొని మాజీ భార్యపై ఘాతుకం.. నడిరోడ్డుపైనే కత్తిపోట్లు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి