టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో కూటమికి ప్రయత్నాలు చేస్తున్న అంశంపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజ్య తీవ్రంగా స్పందించారు.  ఫ్రంట్ లేదు.. టెంట్ లేదు..కేసీఆర్ ఏ క్షణమైనా జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన ప్రకటించారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన బండి సంజయ్.. కేసీఆర్ అవినీతి, అక్రమాలపై కేంద్రం సీరియస్‌గా ఉందని స్పష్టం చేశారు.  ఈ విషయం కేసీఆర్‌కు తెలుసని..అందుకే విపక్ష నేతలతో భేటీ అయి సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 


Also Read: రాత్రి గం.10ల వరకు వ్యాక్సినేషన్... ఆదివారం కూడా బస్తీ దవాఖానా, పీహెచ్ సీలు... మంత్రి హరీశ్ రావు సమీక్ష


కమ్యూనిస్టు పార్టీ నేతలు, తేజస్వియాదవ్ వంటి వారు ప్రగతి భవన్‌కు వచ్చి కేసీఆర్‌తో బేటీ కావడంపై  బండి సంజయ్ భిన్నంగా స్పందించారు. అవినీతి పరులంతా ఒక్క చోట చేరుతున్నారని విమర్శించారు. కేసీఆర్ విదేశాలకు పోయినా జైలుకు పంపిస్తామన్నారు. కేసీఆర్ ఎక్కడ ఉన్నా గుంజుకొచ్చుడేనని స్పష్టం చేశారు.  కేసీఆర్ పరిపాలన చేయడం లేదని.. దాచుకోవడం.. దోచుకోవడం తప్ప ఏమీ చేయడం లేదని విమర్శించారు. 


Also Read: Covid Updates: తెలంగాణలో కొత్తగా 1920 కరోనా కేసులు, ఇద్దరు మృతి... 16 వేలకు చేరువలో యాక్టివ్ కేసులు


కొద్ది రోజులుగా బీజేపీ నేతలు కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ గురించి చెబుతూ వస్తున్నారు.  తెలంగాణ ప్రభుత్వ అవినీతిపై ఆధారాలు అన్నీ సేకరించామని ఏ క్షణంలో అయినా దర్యాప్తు ఉంటుందని చెబుతూ వస్తున్నారు. అందుకే కేసీఆర్ జైలుకు వెళ్తారని చెబుతున్నామని అంటున్నారు . ఈ విషయంలో బండి సంజయ్ చాలా దూకుడుగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో బండి సంజయ్‌పైనా టీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. కేసీఆర్‌పై చేయి పడితే తెలంగాణ అగ్నిగుండమవుతుందని హెచ్చరిస్తున్నారు. 


Also Read: రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ వాయిదా.... ఈ నెల 18 నుంచి కర్ఫ్యూ అమలు... ఆంక్షల ఉత్తర్వుల్లో సవరణ చేసిన ప్రభుత్వం


మంత్రి కేటీఆర్ కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలను .. బీజేపీ మిత్రపక్షాలుగా అభివర్ణిస్తున్నారు. రాజకీయంగా ప్రశ్నించేవారిని కే్సుల పేరుతో బెదిరిస్తున్నారని.. అలాంటి వాటికి తాము భయపడబోమని స్పష్టం చేశారు. ఓ వైపు కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే ప్రయత్నం చేస్తున్నారు. మరో వైపు ఆయన జైలుకెళ్లే టైం దగ్గర పడిందని బీజేపీ నేతలు హెచ్చరిస్తున్నారు. దీంతో తెలంగాణ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. 



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి