తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 83,153 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. వీటిల్లో కొత్తగా 1920 మందికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,97,775కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ కోవిడ్ బులిటెన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో కరోనాతో ఇద్దరు మరణించారని పేర్కొంది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకూ కరోనా ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 4,045కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 15,969 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి నిన్న 417 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 6,77,234కి చేరింది.
Also Read: ఏపీలో కోవిడ్ విజృంభణ... కొత్తగా 1831 కోవిడ్ కేసులు... 7 వేలు దాటిన యాక్టివ్ కేసులు
గాంధీలో 44 మంది వైద్యులకు కరోనా
హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో కరోనా కలకలం రేగింది. ఆసుపత్రిలో 44 మంది మెడికోలకు కరోనా పాజిటివ్ వచ్చింది. అంతేకాకుండా ఉస్మానియాలో 50 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కాకతీయ మెడికల్ కళాశాలలో 30 మంది మెడికోలు కోవిడ్ బారినపడ్డారు. నిమ్స్‌లో 60 మంది వైద్యులు, వైద్య విద్యార్థులకు కరోనా సోకినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో థర్డ్ వేవ్ ప్రభావం చూపిస్తోందని వైద్యులు అంటున్నారు. కోవిడ్ సోకిన వైద్యులు ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. పెద్ద ఎత్తున వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి కరోనా సోకడంతో ఆందోళన నెలకొంది.
దేశంలో కరోనా కేసులు
రోజురోజుకి పెరుగుతోన్న కరోనా కేసులు తాజాగా స్వల్పంగా తగ్గాయి. దేశంలో కొత్తగా 1,68,063 కరోనా కేసులు నమోదుకాగా 277 మంది మృతి చెందారు. 69,959 మంది తాజాగా కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 8,21,446కు చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 2.29%గా ఉంది. రికవరీ రేటు 96.36%గా ఉంది. మరోవైపు ఒమిక్రాన్ కేసుల సంఖ్య 4461కి చేరింది. మహారాష్ట్ర, రాజస్థాన్‌లలో అత్యధికంగా ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.
Also Read: ఈ మూడు లక్షణాలు కనిపిస్తే అది ఒమిక్రాన్ కావచ్చు... తేలికగా తీసుకోవద్దు
Also read: వేడి చేస్తే తేనె విషంగా మారుతుందా? ఈ వాదనలో నిజమెంత?