Priyanka Gandhi : యూపీ ఎన్నికల్లో ట్విస్ట్.. సీఎం అభ్యర్థి నేను కాదంటున్న ప్రియాంక
యూపీ ఎన్నికల్లో ప్రధాన పాత్ర తనదే నంటూ ప్రియాంక గాంధి చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. ఆమే కాంగ్రెస్ సీఎం అభ్యర్థి అంటూ ప్రచారం జరిగిపోయింది.
ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇంకా ముఖ్యమంత్రి అభ్యర్థిని ఖరారు చేయలేదన్నారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ. నిన్న తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్నారు.
నిన్న మీడియాతో మాట్లిన సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో తనదే కీలక పాత్రని అన్నారు. సీఎం అభ్యర్థి కూడా తానే అన్న అర్థం వచ్చేలా కామెంట్ చేశారు. దీనిపై విస్తృతంగా చర్చ నడిచింది. ప్రత్యర్థులు కూడా విమర్శలు ఎక్కు పెట్టారు.
ఈ కామెంట్స్ చేసిన 24 గంటల్లోనే వివరణ ఇచ్చుకున్నారు ప్రియాంక గాంధీ. తాను సీఎం అనే అర్థంలో కామెంట్స్ చేయలేదని ఏఎన్‌ఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.
సీఎం ఎవరు పార్టీ అధిష్ఠానం నిర్ణయిస్తుందని.. ఇంకా అలాంటి నిర్ణయం ఇంత వరకు జరగలేదన్నారు ప్రియాంక. అసలు తాను సీఎం అభ్యర్థిని అని అనలేదు. ఎన్నికల్లో ప్రధాన పాత్ర మాత్రమే తనదని అన్నాను. మీరు పదే పదే ఇదే ప్రశ్న అడుగుతున్నందున కాస్త అతిశయోక్తిగా చెప్పాను. దానికి మీడియా మసాలా తగిలించిందన్నారు.
చాలా రాష్ట్రాలకు కాంగ్రెస్, బీజేపీ తరఫున ఇన్‌ఛార్జులుగా పని చేస్తున్నారు. వాళ్లంతా ముఖ్యమంత్రి అభ్యర్థులా? వాళ్లను ఎందుకు మీరు ప్రశ్నలు అడగటం లేదని ప్రశ్నించారు ప్రియాంక.
నిన్న ఏఐసీసీలో మీడియాతో మాట్లాడుతూ... ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి మీకు ఇంకో ఫేస్ కనిపిస్తుందా... ఎక్కడైనా నేను కనిపిస్తున్నాను కదా.. అంటూ కామెంట్ చేశారు. దీంతో ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రియాంక గాంధీయే అనుకున్నారంతా. ఈ ప్రచారానికి ముగింపు పలకాలనే ఉద్దేశంతోనే ఆమె ఈ వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది.
Also Read: స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి జూనియర్ పారికర్.. భాజపాకు బైబై
Also Read: UP Cong Candidate List: యూపీలో కాంగ్రెస్ 'మహిళా' అస్త్రం.. రెండో జాబితాలో 16 మందికి చోటు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి