గోవా దివంగత ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పనాజీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలవనున్నట్లు ప్రకటించారు. భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు.
అందుకే నిర్ణయం..
భాజపా గురువారం విడుదల చేసిన తొలి జాబితాలో ఉత్పల్ పారికర్‌కు చోటు దక్కలేదు. ఈ క్రమంలోనే పార్టీ మారతారనే ఊహాగానాలు మొదలయ్యాయి. వాటిని నిజం చేస్తూ తాజాగా ప్రకటన చేశారు ఉత్పల్. మనోహర్ పారికర్ సుదీర్ఘ కాలం ప్రాతినిధ్యం వహించిన పనాజీ స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్యే అటనాసియో మొన్సెరేట్కే మళ్లీ అవకాశం ఇచ్చింది భాజపా.
కేజ్రీవాల్ ఆఫర్..
దిల్లీ సీఎం, ఆమ్‌ఆద్మీ అధినేత కేజ్రీవాల్ మనోహర్ పారికర్‌కు ఆఫర్ ఇచ్చారు. తమ పార్టీ తరఫున ఎన్నికల బరిలో నిలవాలని ఉత్పల్ పారికర్‌ను కోరారు. కానీ ఈ ఆఫర్‌ను పారికర్ పట్టించుకోలేదు. ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగుతున్నారు.
మరోవైపు ఆమ్‌ఆద్మీ గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే తమ అభ్యర్థుల ఐదో జాబితాను ఈరోజు విడుదల చేసింది.
Also Read: UP Cong Candidate List: యూపీలో కాంగ్రెస్ 'మహిళా' అస్త్రం.. రెండో జాబితాలో 16 మందికి చోటు