ఆంబ్రేన్ మనదేశంలో కొత్త వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌ను లాంచ్ చేసింది. అవే ఆంబ్రేన్ డాట్స్ మ్యూజ్ టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్. వీటి ధరను రూ.1,999గా నిర్ణయించారు. ఇవి ఫాస్ట్ చార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేయనున్నాయి. వీటి ప్లేటైం ఏకంగా 23 గంటలుగా ఉండటం విశేషం. కంపెనీ వీటిపై 365 రోజుల వారంటీని అందించనుంది. ఫ్లిప్‌కార్ట్, టాటా క్లిక్, ఇతర ప్రముఖ రిటైల్ స్టోర్లలో వీటిని కొనుగోలు చేయవచ్చు.
ఆంబ్రేన్ డాట్స్ మ్యూజ్ ఇయర్‌బడ్స్ ఫీచర్లు
వీటిలో 10 ఎంఎం డ్రైవర్లను అందించారు. ఇవి మొత్తంగా కేస్‌తో కలిపి 23 గంటల ప్లేబ్యాక్ టైంను అందించనున్నాయి. ఇక బడ్స్‌ను ఒక్కసారి చార్జ్ చేస్తే ఎనిమిది గంటల బ్యాటరీ బ్యాకప్‌ను అందించనున్నాయి. వీటిలో మంచి క్వాలిటీ ఉన్న ఇన్ బిల్ట్ మైక్రోఫోన్స్‌ను అందించినట్లు కంపెనీ అంటోంది. దీంతో కాల్స్ క్లారిటీ మరింత స్పష్టంగా ఉండనుంది.
బ్లూటూత్ వీ5.1 సపోర్ట్ కూడా ఇందులో ఉంది. దీని రేంజ్ 10 మీటర్లుగా ఉండనుంది. ఇది వేగంగా పెయిర్ అవ్వనుంది. గూగుల్ అసిస్టెంట్, సిరిలకు వాయిస్ యాక్టివేషన్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. ఇవి పూర్తిగా మనదేశంలోనే తయారయ్యాయని కంపెనీ తెలిపింది.
ఆంబ్రేన్ డాట్స్ స్లే ఇయర్‌బడ్స్ ఇటీవలే మనదేశంలో లాంచ్ అయ్యాయి. వాటర్ రెసిస్టెన్స్, వాయిస్ కమాండ్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఈ మేడ్ ఇన్ ఇండియా ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ఇప్పటికే అమెజాన్‌లో అందుబాటులో ఉన్నాయి.
ఈ ఇయర్ ఫోన్స్‌లో మల్టీ ఫంక్షనల్ బటన్‌ను కూడా అందించారు. ఫింగర్ ట్యాప్‌తో మ్యూజిక్, కాల్స్‌ను సులభంగా స్విచ్ చేయవచ్చు. ఇందులో 600 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. మొత్తంగా 38 గంటల ప్లేబ్యాక్ టైంను ఇవి అందించనున్నారు.
Also Read: Realme 9i: రూ.14 వేలలోపే రియల్‌మీ కొత్త ఫోన్.. సూపర్ అనిపించే ఫీచర్లు.. లేటెస్ట్ ప్రాసెసర్ కూడా!
Also Read: Samsung Offers: గుడ్‌న్యూస్.. ఈ శాంసంగ్ ఫోన్ ధర తగ్గింపు.. ఇప్పుడు రూ.13 వేలలోపే!
Also Read: Cheapest 5G Phone: వేడెక్కుతున్న 5జీ మార్కెట్.. రూ.20 వేలలోపే మరో 5జీ ఫోన్!
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!