సైబరాబాద్ పరిధిలో గంజాయి ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను సైబరాబాద్​ పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం ఎనిమిది మంది గంజాయి ముఠా సభ్యులను అరెస్టు చేసినట్టు సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర మీడియాకు తెలిపారు. అరెస్టు చేసిన వారిలో వివిధ రాష్ట్రాలకు చెందిన ఆరుగురు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మరో ఇద్దరు ప్రధాన నిందితులు  వికాస్ జాధవ్, సుభాష్ కుమార్ లు పరారీలో ఉన్నారని పేర్కొన్నారు.  ఈ ముఠా నుంచి 800 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.1.80 కోట్లు ఉంటుందని సీపీ స్టీఫెన్ రవీంద్ర ప్రకటించారు. శంషాబాద్ ఎస్వోటీ, మియాపూర్ పోలీసుల సంయుక్త ఆపరేషన్ లో గంజాయి గుట్టురట్టు అయ్యిందని పేర్కొన్నారు. గంజాయి తరలిస్తున్న వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 



Also Read:  ‘నిన్ను పెళ్లి చేసుకోను.. ఇంకొకరితో కానివ్వను.. కాదని చేసుకుంటే..’ హైదరాబాద్‌లో సైకో లవర్ హల్‌చల్


25 మందిపై పీడీ యాక్ట్ 


'ఒడిశా కొరాపుట్ నుంచి మహారాష్ట్ర నాసిక్ కు గంజాయిను తరలిస్తుండగా సైబరాబాద్ పరిధిలో పోలీసులు పట్టుకున్నారు. సులభమైన మార్గాల్లో డబ్బు సంపాదించేందుకు ఈ ముఠా గంజాయ్ దందా చేస్తుంది. ఈ ముఠాలో ప్రధాన నిందితుడు వికాస్ జాధవ్. ముఠా సభ్యులు ఒక కేజీ గంజాయిని రూ.3 వేలకు కొనుగోలు చేసి రూ.20 వేలకు అమ్ముతున్నారు. పక్కా సమాచారంతో ముఠాను అరెస్ట్ చేశాం. సైబరాబాద్ పరిధిలో 2021, 2022 జనవరి 20వ తేదీ వరకు మొత్తం 222 డ్రగ్స్ కేసులు నమోదు చేసి 459 మందిని అరెస్ట్ చేశాం. రిపిటేడ్ గా డ్రగ్స్ దందా చేస్తున్న 25 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేశాం.' అని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. 


Also Read: 7 నెలల పిల్లాడిపై శానిటైజర్ పోసి నిప్పు.. కన్న తల్లి నిర్వాకం, కారణం ఏంటంటే..


మొత్తం 222 డ్రగ్స్ కేసులు 


గత ఏడాది నుంచి ఇప్పటి వరకూ మొత్తం 222 డ్రగ్స్ కేసులు నమోదయ్యాయని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర అన్నారు. ఈ కేసుల్లో 2863.09 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామని ప్రకటించారు. అలాగే 37.3 కేజీల బరువున్న 128 గంజాయి మొక్కలు, 14 గంజాయి మాత్రలు, 8.63 లీటర్ల హషీష్ ఆయిల్, 200 గ్రాముల లూస్ వీడ్ ఆయిల్ పేస్ట్ స్వాధీనం చేసుకున్నామన్నారు.  వీటితో పాటు లైరికా150 ఎం.జీ - 12 మాత్రలు, ఆల్ప్రజోలం 141 కి.గ్రా, ఎమ్డీఎమ్ఏ 240.29 గ్రాములు, నల్లమందు 200 గ్రాములు, ఎక్స్టసీ మాత్రలు- 61, ఎల్ఎస్డీ పేపర్లు 47 స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. 25 మంది మాదకద్రవ్యాల నేరస్థులపై పీడీ చట్టం ఓపెన్ చేశామని పేర్కొన్నారు. 


Also Read: ఇంట్లోకి చొరబడి భర్తపై హత్యాయత్నం.. కత్తులతో ఉన్న దుండగులను ఎదుర్కొన్న భార్య, ఆమె తెలివికి శభాష్ అంటున్న స్థానికులు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి