ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గుడివాడ కేసినో వ్యవహారం కలకలం రేపుతోంది. టీడీపీ నిజనిర్ధారణ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఆ టీమ్ గుడివాడలో పర్యటించేందుకు సిద్ధమైంది. అయితే గుడివాడ వైఎస్ఆర్‌సీపీ నేతలు కేసినో నిర్వహించిన కే - కన్వెన్షన్ సెంటర్ వద్ద పెద్ద ఎత్తున జన సమీకరణ చేశారు. అలాగే టీడీపీ నేతలు కూడా పోటీగా పెద్ద ఎత్తున కార్యకర్తలను సమీకరించి టీడీపీ కార్యాలయం వద్ద ఉంచారు. దీంతో గుడివాడలో టెన్షన్ ప్రారంభమయింది.
Also Read: ఏపీ ఉద్యోగులకు జగన్ సర్కార్ బిగ్ షాక్! డిమాండ్లు పట్టించుకోకుండానే వరుస జీవోలు
పోలీసులు గుడివాడలోని ప్రధాన కూడళ్లన్నింటి వద్ద పోలీసుల్ని మోహరించారు. ప్రధాన రహదారిపై బారికేడ్లు పెట్టారు. రోప్‌పార్టీ పోలీసులను రంగంలోకి దించారు. విజయవాడ నుంచి బయలుదేరిన టీడీపీ నిజ నిర్ధారణ కమిటీని పోలీసులు పామర్రు బైపాస్ వద్ద అడ్డుకున్నారు. టీడీపీ కమిటీలో నక్కా ఆనందబాబు, వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర, బొండా ఉమా, ఆలపాటి రాజేంద్రప్రసాద్, తంగిరాల సౌమ్య ఉన్నారు. క్యాసినో నిర్వహించిన ప్రదేశాన్ని పరిశీలిస్తే వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు దాడు చేసే అవకాశం ఉంది కాబట్టి పర్యటన విరమించుకోవాలని పోలీసులు టీడీపీ నేతల్ని కోరినట్లుగా తెలుస్తోంది.
Also Read: Chandrababu Naidu Corona Positive: చంద్రబాబుకు కరోనా పాజిటివ్.. ఇంట్లోనే క్వారంటైన్‌లోకి..
అయితే టీడీపీ నతేలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తాము కేసినో వ్యవహారంపై నిజ నిర్ధారణ చేసి తీరుతామని చెబుతున్నారు. కొడాలి నాని ఎన్టీఆర్ టు వైఎస్సార్ పేరిట క్యాసినో నిర్వహించారు. ఎన్టీఆర్ పేరుతో అసాంఘిక కార్యకలాపాలను సహించమని టీడీపీ నేతలు మండిపడ్డారు. కొడాలి నాని దొరికిపోయిన దొంగ.. వెంటనే ఆయన్ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని బొండా ఉమా డిమాండ్ చేశారు.
Also Read: ట్విట్టర్ వేదికగా పరస్పరం ట్వీట్లు విసురుకుంటున్న వైసీపీ ఎంపీలు
మరో వైపు కేసినో మూడు రోజుల పాటు జరిగినా పోలీసులు పట్టించుకోలేదు. కేసినో నిర్వాహకులు తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోయిన తర్వాత తీరిగ్గా టీడీపీ నేతలు ఫిర్యాదు చేసిన తర్వాత డీఎస్పీని విచారణ అధికారిగా నియమించారు. ఇలా చేయడం వల్ల అసలైన నిందితులను పోలీసులు వదిలేసే అవకాశం ఉందని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. పోలీసు అధికారుల ప్రమేయం లేకుండా ఈ కేసినోలు నడుస్తాయా అని ప్రశ్నిస్తున్నారు.
Also Read: Chandrababu Naidu Corona Positive: చంద్రబాబుకు కరోనా పాజిటివ్.. ఇంట్లోనే క్వారంటైన్‌లోకి..