Vijay Sai Reddy VS RRR: ట్విట్టర్ వేదికగా పరస్పరం ట్వీట్లు విసురుకుంటున్న వైసీపీ ఎంపీలు
ట్విట్టర్ వేదికగా వైసీపీ ఎంపీలు యుద్ధానికి దిగారు. వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, రఘురామ కృష్ణంరాజు పరస్పరం తిట్ల దండకాలతో ట్వీట్లు చేసుకుంటున్నారు. ఒకరిపై మరొకరు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తనకు ప్రాణహాని ఉందంటూ రఘురామ చేసిన ట్వీట్ పై విజయసాయి రెడ్డి తొలుత కౌంటర్ ఇస్తూ దాన్ని చీప్ పబ్లిసిటీ స్టంట్ గా అభివర్ణించారు. దీనిపై వెటకారంగా స్పందించిన రఘురామ....విజయసాయిని అండమాన్ కి పంపిస్తే ఎందుకు తిరిగొచ్చారని ప్రశ్నించారు. తనకులానే త్వరలో తన్నులు రోజులు దగ్గరే ఉన్నాయంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇలా ఇరువురి మధ్య ట్వీట్ వార్ నడుస్తూనే ఉంది.