నట సింహ నందమూరి బాలకృష్ణ అభిమానులకు ఇదొక గొప్ప ఛాన్స్. బాలయ్యను కలవాలని అభిమానులు కోరుకుంటారు కదా! వాళ్లకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మంచి ఆఫర్ ఒకటి ఇచ్చింది. 'అఖండ' సినిమా ఈ ఓటీటీ వేదికలో ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. శుక్రవారం సాయంత్రం ఆరు గంటల నుంచి ఆదివారం అర్ధరాత్రి వరకూ... సినిమా చూసిన వారిలో 500 మందికి బాలకృష్ణను కలిసే అదృష్టం దక్కనుంది. సినిమా చూసిన వారు తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో తెలియజేస్తూ... డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్ తెలుగు ఐడీని ట్యాగ్ చేయాలి. "ఐదు వందల మంది లక్కీ విన్న‌ర్స్‌ను కలుస్తా" అని బాలకృష్ణ పేర్కొన్నారు.





బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన హ్యాట్రిక్ మూవీ 'అఖండ'. థియేటర్లలో అఖండ విజయం అందుకుంది. బాలయ్య ద్విపాత్రాభినయం, ముఖ్యంగా అఘోరా పాత్రలో రుద్ర తాండవం నందమూరి అభిమానులతో పాటు ప్రేక్షకులకు నచ్చాయి. బాలకృష్ణను బోయపాటి శ్రీను చూపించిన విధానం అందర్నీ ఆకట్టుకుంది. గురువారం హైదరాబాద్ సుదర్శన్ 35ఎంఎం థియేటర్లో సినిమా అర్ధ శతదినోత్సవ వేడుక నిర్వహించారు. 


Also Read: హిందూ ధర్మం జోలికి వస్తే దేవుడు 'అఖండ'లా బుద్ధి చెబుతాడు! - బాలకృష్ణ
Also Read: రవితేజ కెరీర్‌లోనే ఇది తొలిసారి... 'రావణాసుర' కోసం డేరింగ్ స్టెప్!
Also Read: అందుకు ఎనిమిదేళ్లు పట్టింది... కీర్తీ సురేష్‌కు ఈ సినిమా సో స్పెషల్!
Also Read: ఫ్రెండ్స్‌... ఆ ద‌రిద్రాన్ని (కొవిడ్‌ను) సీరియ‌స్‌గా తీసుకోండి! - త‌రుణ్ భాస్క‌ర్‌
Also Read: 'ఆచార్య'కు 'శ్యామ్ సింగరాయ్' నచ్చాడు... మీసం మెలేసిన మెగాస్టార్, నేచురల్ స్టార్!
Also Read: ఔను... వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు! ప్రేమలో సురేఖావాణి కుమార్తె... రానా రూటులో ప్రకటన!
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి