Bakasura Hotel in Kothagudem: ట్రెండ్ కు తగ్గట్లుగా మారుతున్న పరిస్థితులకు తగ్గట్లుగా మారాల్సి ఉంటుంది. ఓ చోట ఆర్జీవీ హోటల్ అంటారు మరోచోట విమానం లాంటి సెట్ వేసి హోటల్ ఏర్పాటు చేస్తారు. ఇదే విధానాన్ని పాటించి మార్కెటింగ్ లో కొందరు యువకులు దూసుకుపోతున్నారు. యూత్ స్టార్టప్ బిజినెస్‌లో ఫుడ్ అగ్ర స్థానంలో నిలుస్తోంది. ఆహార మార్కెట్‌కు డిమాండ్ బాగా ఉండటం... టేస్టీ ఫుడ్ కు దాసోహం అవుతున్నారు ఆహార ప్రియులు. రుచితో కొందరు ఆకట్టుకుంటే మరికొందరు వెరైటీ పేర్లతో, వినూత్న సౌకర్యాలతో కొందరు, ఇంటీరియర్ డిజైన్లతో మరికొందరు అదరగొడుతున్నారు.
పోటీ ప్రపంచంలో యూత్ కొత్త ఐడియాలతో దూసుకెళ్తున్నది. ఇదిగో ఈ యంగ్ స్టర్ మాత్రం తన హోటల్ కు భకాసురా అని వెరైటీ పేరు పెట్టాడు. ఇక్కడ నాన్ వెజ్ స్పెషల్ అంట. ఈ హోటల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం బైసాస్ రోడ్డులో ఏర్పాటు చేశాడు. పేరు వెరైటీగా ఉండటంతో కస్టమర్లు కూడా బాగానే వస్తున్నారు. భోజనం అంటే గుర్తొచ్చే పేర్లలో భకాసురుడి పేరు ఒకటి. కనుక కడుపునిండా భోజనం చేయొచ్చు అని భావించి కస్టమర్లు వస్తారని ఆ పేరు పెట్టానంటున్నాడు ఓనర్ రవికిరణ్.
పేరేకాదు టేస్ట్ కూడా అదుర్స్..
కొన్ని చోట్ల వెరైటీ పేర్లతో హోటల్స్ ఉన్నా.. అక్కడ ఫుడ్ ఎలా ఉంటుందో అని ఆలోచిస్తాం. కానీ ఇక్కడ తెలంగాణ వంటకాలు స్పెషల్. అందులోనూ బోటీ రోటీ కర్రీతో కొత్త వంటకాలను పరిచయం చేస్తున్నాడు రవికిరణ్. పోటీ ప్రపంచంలో మార్కెట్ లో దూసుకెళ్లాలంటే వినూత్నంగా ఆలోచించడం తప్పనిసరి అంటాడు. పేరు వెరైటీగా ఉండటమే కాదు ఫుడ్ కూడా టేస్టీ టేస్టీ అంటున్నారు కస్టమర్లు. సో ఫుడ్ లవర్స్ భద్రాచలం వెళ్లేటప్పుడో, కొత్తగూడెంపరిసర ప్రాంతాలవారు అటుగా వెళ్లేటప్పుడు బకాసుర హోటల్‌కు టచ్ చేయండి, బకాసుర వంటకాలను రుచి చూడండి.
కరోనా వైరస్ వ్యాప్తి తరువాత బతుకుదెరువు మరింత కష్టంగా మారుతోంది. యువత ఉద్యోగాల వేటకు బదులుగా ఫుడ్ బిజినెస్‌పై ఫోకస్ చేస్తున్నారు. వెరైటీ పేర్లు, వెరైటీ డిషెస్‌తో దూసుకెళ్తున్నారు. కుటుంబానికి తమ వంతుగా చేదోడువాదోడుగా నిలవడంతో పాటు తమ కెరీర్‌కు బాటలు వేసుకుంటున్నారు.
Also Read: Warangal: ఇంట్లోకి చొరబడి భర్తపై హత్యాయత్నం.. కత్తులతో ఉన్న దుండగులను ఎదుర్కొన్న భార్య
Also Read: KTR: కేంద్ర మంత్రి నిర్మలకు మంత్రి కేటీఆర్ లేఖ.. తెలంగాణకు రూ.7,778 కోట్లు కావాలని వినతి