కేరళ సీఎం పినరయి విజయన్ అమెరికా నుంచి పాలన కొనసాగిస్తారు. చికిత్స నిమిత్తం ఆయన అక్కడకు వెళ్లారు. కొన్ని రోజులు అక్కడి నుంచే పాలన కొనసాగిస్తానని, ఇతరులకు పాలనాబాధ్యతలను అప్పచెప్పనని చెప్పారు. పినరయి విజయన్ అమెరికాకు వెళ్తుండటంతో.. పాలనను ఎవరికీ అప్పగిస్తారనే.. దానిపై చర్చ నడిచింది. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎంవీ గోవందన్ లేదా కె.రాధాకృష్ణన్ కు బాధ్యతలు ఇస్తారేమోనని అందరూ అనుకున్నారు. కానీ బాధ్యతలు అప్పజెప్పలేదు. 


అక్కడి నుంచే ప్రభుత్వాన్ని నడిపేందుకు సాంకేతికతను ఉపయోగించుకుంటానని పినరయి విజయన్ వెల్లడించారు. చికిత్స కోసం తన భార్య, వ్యక్తిగత సిబ్బందితో కలిసి విజయన్ అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. జనవరి 29న మళ్లీ తిరిగి రానున్నారు. మెున్న కేబినెట్ భేటీలో సీఎం వర్చువల్ పద్ధతిలోనే పాల్గొన్నారు. జనవరి 19న మరో కేబినెట్ భేటీలోనూ వర్చువల్ గానే పాల్గొననున్నారు. ఆస్పత్రి బెడ్​పై నుంచీ పని చేస్తానని ఈ మేరకు పినరయి విజయన్ పేర్కొన్నారు.


అయితే 2018లోనూ వైద్య చికిత్స కోసం పినరయి విజయన్ అమెరికా వెళ్లారు. ఆ సమయంలో ఈపీ జయరాజన్​కు బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. ఈసారి సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులైన ఎంవీ గోవిందన్, కె.రాధాకృష్ణన్​కు బాధ్యతలు ఇస్తారేమోనని.. అనుకున్నా.. కేబినెట్ భేటీ ప్రకటనతో ఊహాగానాలపై స్పష్టత వచ్చింది.


Also Read: Elections New Rules : ఐదు రాష్ట్రాల్లో ధూం..ధాం ప్రచారాల్లేని ఎన్నికలు... ఆంక్షలు పొడిగించిన ఈసీ !


Also Read: UK PM Rishi : బ్రిటిషు గడ్డను ఏలనున్న భారత మూలాలున్న నేత ! కల కాదు నిజంగానే జరగబోతోందా ?


Also Read: Kangana Roads : హేమమాలిని ప్లేస్‌లోకి కంగనా ! రాజకీయ నేతలూ బ్రాండ్ అంబాసిడర్లను మార్చేస్తారా ?


Also Read: Super Vaccine : నాలుగేళ్లు మంచం మీదే.. వ్యాక్సిన్ ఇవ్వగానే లేచి కూర్చున్నాడు ! టీకాలో ఎవరికీ తెలియని శక్తి ఉందా?


Also Read: యూపీ సీఎంగా తొలి ప్రాధాన్యత ఎవరికి?.. ABP- సీ ఓటర్ సర్వే ఫలితాలు ఇవే!


Also Read: పంజాబ్ ఎన్నికల్లో భాజాపా- కెప్టెన్ దోస్తీ.. 101 శాతం విజయం తమదేనని ధీమా


Also Read: గోరఖ్‌పూర్ అర్బన్ నుంచి యోగి పోటీ.. యూపీ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా రిలీజ్ !


Also Read: ఎలక్షన్ టైం కదా.. రైతులు కొట్టినా తియ్యని దెబ్బే..! ఉత్తరాది బీజేపీ ఎమ్మెల్యేకు ఎంత కష్టమో...?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి