ఎన్నికలంటే అందరికీ కనిపించేది భారీ బహిరంగసభలు, ర్యాలీలు. ధూం..ధాంగా సాగే ప్రచారాలు. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అవేమీ కనిపించే అవకాశం కనిపించడం లేదు. దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి పెరుగుతున్నందున ఐదు రాష్ట్రాల్లో రోడ్‌షోలు, పాదయాత్రలు, సైకిల్/బైక్ ర్యాలీలపై ఇదివరకే విధించిన నిషేధాన్ని పొడిగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నెల 8న ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ని ప్రకటించిన సందర్భంగా ఎన్నికల ర్యాలీలపై విధించిన నిషేధం శనివారంతో ముగిసింది. కొనసాగించాలని ఈసీ తాజాగా నిర్ణయం తీసుకుంది.
Also Read: గోరఖ్‌పూర్ అర్బన్ నుంచి యోగి పోటీ.. యూపీ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా రిలీజ్ !
కేంద్ర ఆరోగ్య అధికారులు..ఐదు రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులతో సమావేశమైన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నందున ప్రచారాలపై కొన్నాళ్ల పాటు నిషేధం ఉంచడమే మేలనే అభిప్రాయాలు వ్యక్తం కావడంతో ఎన్నికల సంఘం ఎన్నికల ర్యాలీలపై తాత్కాలిక నిషేధాన్ని ఈ నెల 22వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇండోర్‌లలో నిర్వహించే సమావేశాలకు 300 మంది లేదా హాలులో 50శాతం సామర్థ్యానికి మించకుండా చూసుకోవాలని రాజకీయ పార్టీలకు సూచించింది.
ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపుర్‌లలో మొత్తం 690 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. అన్ని రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపును మార్చి 10న ఒకేసారి చేపడతారు. ఇప్పటికే రాజకీయ పార్టీలు అభ్యర్థులను ఖరారు చేసే హడావుడిలో ఉన్నాయి. అదయిన తర్వాత ప్రచారబరిలోకి దిగాలనుకున్నారు. కానీ భారీ ప్రచారాలకు ఈ సారి అవకాశం లేకపోవడంతో పార్టీలన్నీ ఆన్‌లైన్ ప్రచారాలపై ఎక్కువ దృష్టి పెడుతున్నాయి. యూపీలోనే ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్‌లో మాత్రం ఒకే దశలో జరగనున్నాయి. మణిపూర్‌లో రెండు దశల్లో ఎన్నికలు జరుగుతాయి.
Also Read: యూపీ సీఎంగా తొలి ప్రాధాన్యత ఎవరికి?.. ABP- సీ ఓటర్ సర్వే ఫలితాలు ఇవే!
Also Read: పంజాబ్ ఎన్నికల్లో భాజాపా- కెప్టెన్ దోస్తీ.. 101 శాతం విజయం తమదేనని ధీమా