కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకుంటే రోగ నిరోధక శక్తి ఎంత పెరుగుతుందో ఖచ్చితంగా చెప్పలేం కానీ.. ఖచ్చితంగా రోగం అయితే కుదరడం ఖాయమని తేలిపోయింది. జార్ఖండ్‌లోని దులార్ చంద్ అనే  వృద్ధుడు పక్షవాతానికి గురైన నాలుగేళ్లుగా మంచం పట్టాడు. కుటుంబసభ్యులు సపర్యలు చేయాల్సి వస్తోంది. వైద్యులకు చూపించినా ప్రయోజనం లేపోయింది. దీంతో కుటుంబసభ్యులు కూడా ఇక నయం కాదులే అని మంచం మీదనే ఉంచి చూసుకుంటున్నారు. 


 






Also Read: వామ్మో.. ఇలా ఉందేంటి? అమెరికన్లను వణికిస్తున్న ‘ఐస్ డిస్క్’.. రెండేళ్ల తర్వాత మళ్లీ ప్రత్యక్షం


కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత అందరూ వ్యాక్సిన్ వేయించుకున్నారు కానీ ఆయనను కుటుంబసభ్యులు పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు ఇంటింటికి వచ్చి వ్యాక్సిన్ వేస్తూండటంతో ఓ ఆరోగ్య కార్యకర్త... మంచం మీద ఉన్న దులార్ చంద్ గురించి కుటుంబసబ్యులను ప్రశ్నించారు. ఆయన ఎక్కడికీ పోరని.. మంచం మీదనే ఉంటారని వ్యాక్సిన్ అవసరం లేదని చెప్పారు. కానీ  ఎవరు ఎక్కడ ఉన్నా వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందేనని ఆరోగ్య కార్యకర్త కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఇచ్చారు. 


Also Read: నరక ద్వారం.. 50 ఏళ్లుగా ఇక్కడి భూమి మండుతూనే ఉంది.. చిన్న తప్పు ఎంత పనిచేసింది!


విచిత్రంగా వ్యాక్సిన్ తీసుకున్న కాసేపటికే దులార్ చంద్ లేచి కూర్చున్నాడు. అంతే కాదు.. అప్పటి వరకు పక్షవాతం వల్లన సరిగ్గా మాటలు కూడా వచ్చేవి కావు. కానీ ఇప్పుడు బాగా మాట్లాడుతున్నారు. లేచి కూర్చుని నడుస్తున్నాడు . దీంతో అబ్బురపడటం.. అవాక్కవడం.. అన్నీ దులార్ చంద్ కుటుంబసభ్యులే కాదు...  వ్యాక్సిన్ ఇచ్చిన వారికీ తప్పలేదు. వ్యాక్సిన్‌లో అంత మహత్యం ఏముందో ఎవరికీ తెలియలేదు. అద్భుతాలు అప్పుడప్పుడూ ఇలా జరుగుతూ ఉంటాయని అనుకోవడమే తప్ప... ఇంతకు మించి ఊహించలేమని దులార్ చంద్‌కు  వైద్య చేసిన వైద్యులు కూడా తేల్చేశారు. 


Also Read: ఓర్నీ.. చేప వీర్యంతో స్పెషల్ కర్రీ.. అంత కరువేంది బ్రో!



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి